కోవిడ్ మహమ్మారి విజృంభణతో ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఈ సమయంలో ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలు విక్రయాల పట్ల జాగ్రత్త వహించాలని చెబుతూ.. వివిధ బ్రోకరేజ్ సంస్థలు కొన్ని షేర్లకు ఇస్తున్న సిఫార్సులు ఈ కింది విధంగా ఉన్నాయి.
కంపెనీ పేరు: జేకే లక్ష్మీ సిమెంట్
బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్
రేటింగ్: కొనవచ్చు
టార్గెట్ ధర: రూ.310
ప్రస్తుత ధర: రూ.208
బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ జేకే లక్ష్మీ సిమెంట్ షేరుకు బై రేటింగ్‌ను ఇచింది. ఆర్థిక సంవత్సరం-22లో ఇబిటా 6 రెట్లు పెరుగుతుందనే అంచనాతో ఈ షేరుకు టార్గెట్ ధరను రూ.310గా నిర్ణయించింది. జేకే సిమెంట్ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కోవిడ్ కారణంగా డిమాండ్ తగ్గిందని ఆర్థిక సంవత్సరం-20 కంటే ఎఫ్‌వై21లో ఇబిటా వృద్ధి 6శాతంగానూ, నికర లాభం వృద్ధి7శాతంగా నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2454.60 కోట్లుగా ఉంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో జేకే సిమెంట్ షేరు ధర రూ.208.80 గా ఉంది.
కంపెనీ పేరు: టాటా స్టీల్
బ్రోకరేజ్ సంస్థ: ఎడెల్వీజ్
రేటింగ్ : కొనవచ్చు
టార్గెట్ ధర : రూ.330
ప్రస్తుత ధర: రూ.16.85
బ్రోకరేజ్ సంస్థ ఎడెల్వీజ్ టాటా స్టీల్ షేరుకు బై రేటింగ్‌ను ఇచ్చింది.ఆర్థిక సంవత్సరం-22లో ఇబిటా 7.5 రెట్లు పెరుగుతుందన్న అంచనాతో ఈ షేరుకు టార్గెట్ ధరను రూ.330గా నిర్ణయిచింది. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో టాటా స్టీల్ అందుకోలేకపోయిందని తెలిపింది. ముడి పదార్థాల ధరలు వార్షిక ప్రాతిపదికన 23 శాతం పడిపోవడం, త్రైమాసిక ప్రాతిపదికన బ్లెండెడ్ రియలైజేషన్ 9 శాతం పెరగడం, వార్షిక ప్రాతిపదికన డెట్ స్థిరంగా ఉండడం సానుకూల అంశాలని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కోవిడ్ కారణంగా ఆర్థిక సంవత్సరం-21లో 10 శాతం వరకు అమ్మకాలు తగ్గవచ్చని బ్రోకరేజ్ అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం-22లో డిమాండ్ పెరిగి కంపెనీ లాభాలను ఆర్జిస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం టాటా స్టీల్స్ మార్కెట్ క్యాప్ రూ.33221.86 కోట్లుగా ఉంది. కాగా బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ప్రస్తుత ధర రూ.274.45 గా ఉంది.
కంపెనీ పేరు: మహీంద్రా లాజిస్టిక్స్
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్
రేటింగ్: అదనంగా కొనవచ్చు
టార్గెట్ ధర: రూ.275
ప్రస్తుత ధర: రూ.263
బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ మహీంద్రా లాజిస్టిక్స్ షేరు రేటింగ్‌ను బై నుంచి యాడ్‌కు తగ్గించింది. టార్గెట్ ధరను ముందుగా నిర్ణయించిన రూ.340 నుంచి తగ్గించి రూ.275 గా నిర్ణయించింది.నాలుగో త్రైమాసికంలో ఈ కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 20 శాతం తగ్గినప్పటికీ, ఈ కంపెనీ కన్సాలిడేషన్ వేర్‌హౌసింగ్ అండ్ సప్లై A గ్రేడ్‌లో ఉందని, ఆదాయం J వక్రరేఖలో ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1926.86 కోట్లుగా ఉంది. కాగా బీఎస్‌ఈలో మహీంద్రా లాజిస్టిక్స్ షేరు ప్రస్తుత ధర రూ.263.50 గా ఉంది.
కంపెనీ పేరు: బజాజ్ ఆటో
బ్రోకరేజ్ సంస్థ: ఎమ్‌కే గ్లోబల్
రేటింగ్: హోల్డ్‌లో ఉంచింది
టార్గెట్ ధర: 2,629
ప్రస్తుత ధర: రూ.2,552
బ్రోకరేజ్ సంస్థ ఎమ్‌కే గ్లోబల్ బజాజ్ ఆటో షేరు రేటింగ్‌ను హోల్డ్‌లో ఉంచుతూ ఏడాదికాలానికిగాను టార్గెట్ ధరను రూ.2,629 గా నిర్ణయించింది. ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్ 14 రెట్లు పెరుగుతుందన్న అంచనాతో టార్గెట్ ధరను నిర్ణయించినట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఈ కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 8శాతం క్షీణించి రూ.68.2 బిలియన్లకు చేరిందని తెలిపింది. ఆర్థిక సంవత్సరం-21,22లలో ఈపీఎస్‌లలో 19 శాతం తగ్గుతుందని అంచనావేసింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.2,552.75 గా ఉంది.
కంపెనీ పేరు: పిరమల్ ఎంటర్‌ప్రైజెస్
బ్రోకరేజ్ సంస్థ: సిటీ రీసెర్చ్ ఈక్విటీస్
రేటింగ్: కొనవచ్చు
టార్గెట్ ధర: రూ.1,130
ప్రస్తుత ధర: రూ.953
బ్రోకరేజ్ సంస్థ సిటీ రీసెర్చ్ ఈక్విటీస్ పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ..టార్గెట్ ధరను రూ.1,130గా నిర్ణయించింది. ప్రస్తుతం రెండు మూడు త్రైమాసికాలలో విక్రయాలు తగ్గడం వల్ల ప్రాపర్టీ ధరలు 10 శాతం తగ్గినప్పటికీ, వచ్చే త్రైమాసికాలలో పరిస్థితులు మెరుగుపడతాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ప్రసుతం పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ క్యాప్ రూ.21044.98 కోట్లుగా ఉంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.953.95 గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment