stock brokers
-
కార్వీ కేసులో సెబీకి నాలుగు వారాల గడువు: శాట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ద్వారా యాక్సిస్ బ్యాంక్‌కు తాకట్టు పెట్టిన షేర్లను విడుదల చేయడానికి మార్కెట్ రెగ్యులేటర్, డిపాజిటరీలకు 2023 డిసెంబర్ 20 నుండి నాలుగు వారాల సమయం ఉందని సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) శుక్రవారం స్పష్టం చేసింది. శాట్ మునుపటి ఆర్డర్ ప్రకారం తాకట్టు పెట్టిన షేర్లను విడుదల చేయనందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (సెబీ) వ్యతిరేకంగా యాక్సిస్ బ్యాంక్ ట్రిబ్యునల్ ముందు అప్పీల్ చేసింది. ‘ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి అప్పీలుదారు అయిన యాక్సిస్ బ్యాంక్, అలాగే సెబీ, నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్‌లకు (ఎన్ఎస్డీఎల్) ఆర్డర్ తేదీ నుండి నాలుగు వారాల గడువు ఉందని స్పష్టం చేయబడింది’ అని శాట్ పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి ఇతర రుణదాతలకు తాకట్టు పెట్టిన షేర్లు సెబీ, ఎన్ఎస్డీఎల్ ద్వారా కార్వీ ఖాతాదారులకు బదిలీ అయ్యాయి. ఈ సెక్యూరిటీల కోసం రుణదాతలకు నాలుగు వారాల్లో పరిహారం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. యాక్సిస్ బ్యాంక్‌కు తాకట్టు పెట్టిన షేర్లు అలాగే ఉన్నాయి. దీనిని గుర్తించిన ట్రిబ్యునల్.. ఆ తనఖా షేర్లను విక్రయించడానికి యాక్సిస్ బ్యాంక్‌కు అనుమతించింది. 2023 డిసెంబర్ 20 నాటి శాట్ ఆర్డర్‌పై డిసెంబర్ 30న సుప్రీంకోర్టులో సెబీ అప్పీల్ దాఖలు చేసింది. -
వెబ్సైట్ల నిర్వహణ తప్పనిసరి.. సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీలకు వెబ్సైట్ల నిర్వహణను తప్పనిసరి చేసింది. తద్వారా స్టాక్ బ్రోకర్లు(ఎస్బీలు), డిపాజిటరీ పార్టిసిపెంట్లు(డీపీలు) చేపట్టే వివిధ లావాదేవీ(యాక్టివిటీ)ల సమాచారం ఇన్వెస్టర్లకు పారదర్శకంగా అందుబాటులోకి రానుంది. ఆధునిక సాంకేతికతల నేపథ్యంలో సంబంధిత వెబ్సైట్లను ఎస్బీ, డీపీలు తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది. వెరసి ఇన్వెస్టర్లకు ఉత్తమ సర్వీసులు అందించేందుకు వీలుంటుంది. ఆయా వెబ్సైట్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్, రిజిస్టరైన చిరునామా, ప్రధాన కేంద్రం, బ్రాంచీలు, కాంటాక్టుకు వీలయ్యే పేర్లు, ఈమెయిల్ ఐడీలు తదితర ప్రాథమిక సమాచారంతోపాటు కీలక యాజమాన్యం, కంప్లయెన్స్ అధికారుల వివరాలు సైతం పొందుపరచవలసి ఉంటుందని తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది. తాజా మార్గదర్శకాలు ఆగస్ట్ 16 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలియజేసింది. ఈ సర్క్యులర్ అమల్లోకి వచ్చిన వారంలోగా ఎస్బీలు, డీపీలు వెబ్సైట్ యూఆర్ఎల్(లింక్)ను స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదించవలసి ఉంటుందని సర్క్యులర్‌లో సెబీ స్పష్టం చేసింది. యూఆర్ఎల్లో సవరణలు చేపడితే మూడు రోజుల్లోగా తెలియజేయవలసి ఉంటుంది. (ఇదీ చదవండి: వడ్డీ రేట్ల పెంపు జాబితాలోకి మరో రెండు బ్యాంకులు) -
కార్వీ సీఎండీ పార్థసారథి కేసు: సీసీఎస్‌కు పెరుగుతున్న బాధితుల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: కార్వీ సీఎండీ పార్థసారథి కేసులో(సెంట్రల్ క్రైమ్ స్టేషన్) సీసీఎస్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, పార్థసారథిని కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో (సీసీఎస్) పోలీసులు ప్రత్యేక పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన బాధితులు పెద్ద ఎత్తున సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో మదుపరుల పెట్టుబడితో కలిపి రూ. 2 వేల కోట్లకు స్కాం పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకర్ల ఫిర్యాదు మేరకు ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. చదవండి: కార్వీ సంస్థ సీఎండీ పార్థసారథి అరెస్ట్ -
Intraday Trading : మదుపర్లకు గుడ్ న్యూస్?!
న్యూఢిల్లీ: ఇంట్రాడే ట్రేడింగ్‌కు సంబంధించిన గరిష్ట స్థాయి మార్జిన్‌ను ప్రస్తుతం అమలవుతున్న 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గించాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ ఏఎన్ఎంఐ విజ్ఞప్తి చేసింది. పీక్ మార్జిన్‌ను తగ్గించడం వల్ల వ్యక్తిగత ఇన్వెస్టర్లు, ట్రేడింగ్ చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని, అలాగే క్యాపిటల్ మార్కెట్ మరింతగా విస్తరించడానికి కూడా దోహదపడగలదని ఒక ప్రకటనలో పేర్కొంది. స్టాక్ బ్రోకింగ్ సంస్థలు తమ క్లయింట్ల నుంచి తీసుకోవాల్సిన మార్జిన్లకు సంబంధించి క్రమంగా పెరిగే గరిష్ట మార్జిన్ కాన్సెప్టును 2020 డిసెంబర్ నుంచి సెబీ అమల్లోకి తెచ్చింది. తొలుత 25 శాతంగా ఉన్న ఈ మార్జిన్ స్థాయి ప్రస్తుతం 75 శాతానికి పెరిగింది. -
రికార్డుల ర్యాలీకి చెక్- ఐటీ అప్
ముంబై, సాక్షి: చిట్టచివరికి 9 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీయడంతో మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 141 పాయింట్లు క్షీణించి 48,036కు చేరింది. నిఫ్టీ సైతం 53 పాయింట్లు తక్కువగా 14,080 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో సోమవారం సెన్సెక్స్ 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో 9 రోజులుగా మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తుండటంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 48,130-47,903 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఇక నిఫ్టీ సైతం 14,116-14,048 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. మీడియా, రియల్టీ ఓకే ఎన్ఎస్ఈలో మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్, ఆటో 1 శాతం స్థాయిలో బలహీనపడగా.. మీడియా, ఐటీ 0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, విప్రో మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 2.3-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇతర బ్లూచిప్స్‌లో టాటా మోటార్స్, హిందాల్కో, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐవోసీ, కోల్ ఇండియా, ఐసీఐసీఐ, బజాజ్ ఆటో, బీసీసీఎల్ 3-1.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎంజీఎల్ జోరు డెరివేటివ్ స్టాక్స్‌లో ఎంజీఎల్, ఐజీఎల్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎల్అండ్టీ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్, మదర్సన్, జూబిలెంట్ ఫుడ్, జీ, నౌకరీ, ఇండస్‌టవర్ 4.2- 1.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు పిరమల్, ఇండిగో, చోళమండలం, కెనరా బ్యాంక్, భారత్ ఫోర్జ్, ఐడియా, ఆర్తి ఇండస్ట్రీస్, లాల్‌పాథ్ 2.6-1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్స్ 0.2 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,229 నష్టపోగా.. 1149 లాభాలతో ట్రేడవుతున్నాయి. పెట్టుబడులవైపు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,843 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 715 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గత శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 506 కోట్లు, డీఐఐలు రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
హెడల్ బర్గ్, సాగర్ సిమెంట్స్ బై: బ్రోకరేజ్‌ల స్టాక్ సిఫార్సులు
కరోనా దాటికి కుదేలైన స్టాక్ మార్కెట్లు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. గత వారం రోజులుగా దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ సమయంలో షేర్ల కొనుగోలు విక్రయాల విషయంలో తొందరపాటు లేకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని చెబుతూ..కొన్ని షేర్లను కొనుగోలు చేయవచ్చని బ్రోకరేజ్ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. అవి ఈ విధంగా ఉన్నాయి. కంపెనీ పేరు: హెడల్ బర్గ్ సిమెంట్ బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠీ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.207 ప్రస్తుత ధర: రూ.172 బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ హెడల్‌బర్గ్ సిమెంట్ షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.207గా నిర్ణయించింది.ఈ కంపెనీ పనితీరు బావుందని చెబుతూ.. కంపెనీకి దృడమైన నెట్ డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్ ఉందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. భవిష్యత్తులో మూల ధన నియంత్రణ సామర్థ్యం బాగా పెరుగుతాయని చెబుతూ ఈ షేరును కొనవచ్చని తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.172.75 గా ఉంది. కంపెనీ పేరు: చోళమండళమ్ ఇన్వెస్ట్మెంట్ బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర : రూ.225 ప్రస్తుత ధర: రూ.145 హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ చోళమండళమ్ షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.225గా నిర్ణయించింది. బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీలలో లిక్విడిటీ, టర్మ్ ఫండింగ్‌లో ఈ కంపెనీ స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. మూల ధనం, రుణాలు పెంచుకునే విషయంలో ఈ కంపెనీ స్థితిగతులకు బావున్నాయని అందువల్ల ఈ షేరు కొనవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కోంది.కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.145.35 గా ఉంది. కంపెనీ పేరు:భారత్ పెట్రోలియం బ్రోకరేజ్ సంస్థ: నోమురా రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.390 ప్రస్తుత ధర: రూ.369 భారత్ పెట్రోలియం షేరుకు బ్రోకరేజ్ సంస్థ బయ్ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.390 గా నిర్ణయించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక అంచనాలను మించి ఫలితాలను వచ్చాయని నోమురా తెలిపింది.కోవిడ్-19 కారణంగా ఆర్థిక సంవత్సరం 2020-21లో పెట్టుబడులు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రైవేటీరణ ఒక ముఖ్యమైన ఉత్ప్రేరకంగా ఉంటుందని వెల్లడించింది. కాగా బీఎస్ఈలో ప్రస్తుతం ఈ కంపెనీ షేరు ధర రూ.369.90 గా ఉంది. కంపెనీ పేరు: సాగర్ సిమెంట్స్ బ్రోకరేజ్ సంస్థ: యస్ సెక్యూరిటీస్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.476 ప్రస్తుత ధర: రూ.333 బ్రోకరేజ్ సంస్థ యస్ సెక్యూరిటీస్ సాగర్ సిమెంట్స్‌కు బయ్ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.476గా నిర్ణయించింది. కోవిడ్-19 వల్ల ఏర్పడిన అంతరాయాలనుంచి సెప్టెంబర్ తర్వాతే సాగర్ సిమెంట్స్ సాధారణ స్థితి చేరుతుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. లాక్డౌన్లో కొన్ని సడలింపుల ఇవ్వడం వల్ల సిమెంట్స్ వినియోగం 30 శాతం పెరిగిందని ,ఇకముందు ఇంకా పుంజుకుంటుందని చెబుతూ ఈ షేరును కొనవచ్చని పేర్కొంది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.333.05 గా ఉంది. కంపెనీ పేరు: కేఈఐ ఇండస్ట్రీస్ బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠీ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.411 ప్రస్తుత ధర: రూ.352 బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ కేఈఐ ఇండస్ట్రీస్‌పై పాజిటివ్‌గా స్పందిస్తూ షేరుకు బయ్రేటింగ్ను ఇచ్చింది.టార్గెట్ ధరను రూ.411గా నిర్ణయించింది. ఈ కంపెనీ కేబుల్స్ ఆర్డర్లు బాగున్నాయని, వివిధ రకాల కస్టమర్లతో బలమైన బ్యాలెన్స్ షీట్ కలిగిందని చెబుతూ ఈ షేరును కొనవచ్చని తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.352.10 గా ఉంది. -
టాటా స్టీల్,పిరమల్ ఎంటర్ప్రైజెస్ బై: బ్రోకరేజల రికమెండేషన్లు
కోవిడ్ మహమ్మారి విజృంభణతో ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఈ సమయంలో ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలు విక్రయాల పట్ల జాగ్రత్త వహించాలని చెబుతూ.. వివిధ బ్రోకరేజ్ సంస్థలు కొన్ని షేర్లకు ఇస్తున్న సిఫార్సులు ఈ కింది విధంగా ఉన్నాయి. కంపెనీ పేరు: జేకే లక్ష్మీ సిమెంట్ బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.310 ప్రస్తుత ధర: రూ.208 బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ జేకే లక్ష్మీ సిమెంట్ షేరుకు బై రేటింగ్‌ను ఇచింది. ఆర్థిక సంవత్సరం-22లో ఇబిటా 6 రెట్లు పెరుగుతుందనే అంచనాతో ఈ షేరుకు టార్గెట్ ధరను రూ.310గా నిర్ణయించింది. జేకే సిమెంట్ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కోవిడ్ కారణంగా డిమాండ్ తగ్గిందని ఆర్థిక సంవత్సరం-20 కంటే ఎఫ్వై21లో ఇబిటా వృద్ధి 6శాతంగానూ, నికర లాభం వృద్ధి7శాతంగా నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2454.60 కోట్లుగా ఉంది. ప్రస్తుతం బీఎస్ఈలో జేకే సిమెంట్ షేరు ధర రూ.208.80 గా ఉంది. కంపెనీ పేరు: టాటా స్టీల్ బ్రోకరేజ్ సంస్థ: ఎడెల్వీజ్ రేటింగ్ : కొనవచ్చు టార్గెట్ ధర : రూ.330 ప్రస్తుత ధర: రూ.16.85 బ్రోకరేజ్ సంస్థ ఎడెల్వీజ్ టాటా స్టీల్ షేరుకు బై రేటింగ్‌ను ఇచ్చింది.ఆర్థిక సంవత్సరం-22లో ఇబిటా 7.5 రెట్లు పెరుగుతుందన్న అంచనాతో ఈ షేరుకు టార్గెట్ ధరను రూ.330గా నిర్ణయిచింది. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో టాటా స్టీల్ అందుకోలేకపోయిందని తెలిపింది. ముడి పదార్థాల ధరలు వార్షిక ప్రాతిపదికన 23 శాతం పడిపోవడం, త్రైమాసిక ప్రాతిపదికన బ్లెండెడ్ రియలైజేషన్ 9 శాతం పెరగడం, వార్షిక ప్రాతిపదికన డెట్ స్థిరంగా ఉండడం సానుకూల అంశాలని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కోవిడ్ కారణంగా ఆర్థిక సంవత్సరం-21లో 10 శాతం వరకు అమ్మకాలు తగ్గవచ్చని బ్రోకరేజ్ అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం-22లో డిమాండ్ పెరిగి కంపెనీ లాభాలను ఆర్జిస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం టాటా స్టీల్స్ మార్కెట్ క్యాప్ రూ.33221.86 కోట్లుగా ఉంది. కాగా బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ప్రస్తుత ధర రూ.274.45 గా ఉంది. కంపెనీ పేరు: మహీంద్రా లాజిస్టిక్స్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్: అదనంగా కొనవచ్చు టార్గెట్ ధర: రూ.275 ప్రస్తుత ధర: రూ.263 బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ మహీంద్రా లాజిస్టిక్స్ షేరు రేటింగ్‌ను బై నుంచి యాడ్‌కు తగ్గించింది. టార్గెట్ ధరను ముందుగా నిర్ణయించిన రూ.340 నుంచి తగ్గించి రూ.275 గా నిర్ణయించింది.నాలుగో త్రైమాసికంలో ఈ కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 20 శాతం తగ్గినప్పటికీ, ఈ కంపెనీ కన్సాలిడేషన్ వేర్‌హౌసింగ్ అండ్ సప్లై A గ్రేడ్‌లో ఉందని, ఆదాయం J వక్రరేఖలో ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1926.86 కోట్లుగా ఉంది. కాగా బీఎస్ఈలో మహీంద్రా లాజిస్టిక్స్ షేరు ప్రస్తుత ధర రూ.263.50 గా ఉంది. కంపెనీ పేరు: బజాజ్ ఆటో బ్రోకరేజ్ సంస్థ: ఎమ్కే గ్లోబల్ రేటింగ్: హోల్డ్‌లో ఉంచింది టార్గెట్ ధర: 2,629 ప్రస్తుత ధర: రూ.2,552 బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ బజాజ్ ఆటో షేరు రేటింగ్‌ను హోల్డ్‌లో ఉంచుతూ ఏడాదికాలానికిగాను టార్గెట్ ధరను రూ.2,629 గా నిర్ణయించింది. ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్ 14 రెట్లు పెరుగుతుందన్న అంచనాతో టార్గెట్ ధరను నిర్ణయించినట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఈ కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 8శాతం క్షీణించి రూ.68.2 బిలియన్లకు చేరిందని తెలిపింది. ఆర్థిక సంవత్సరం-21,22లలో ఈపీఎస్‌లలో 19 శాతం తగ్గుతుందని అంచనావేసింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.2,552.75 గా ఉంది. కంపెనీ పేరు: పిరమల్ ఎంటర్ప్రైజెస్ బ్రోకరేజ్ సంస్థ: సిటీ రీసెర్చ్ ఈక్విటీస్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.1,130 ప్రస్తుత ధర: రూ.953 బ్రోకరేజ్ సంస్థ సిటీ రీసెర్చ్ ఈక్విటీస్ పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ..టార్గెట్ ధరను రూ.1,130గా నిర్ణయించింది. ప్రస్తుతం రెండు మూడు త్రైమాసికాలలో విక్రయాలు తగ్గడం వల్ల ప్రాపర్టీ ధరలు 10 శాతం తగ్గినప్పటికీ, వచ్చే త్రైమాసికాలలో పరిస్థితులు మెరుగుపడతాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ప్రసుతం పిరమల్ ఎంటర్ప్రైజెస్ మార్కెట్ క్యాప్ రూ.21044.98 కోట్లుగా ఉంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.953.95 గా ఉంది. -
అజంతా, అలెంబిక్ ఫార్మా బై: బ్రోకరేజ్‌ల రికమెండేషన్లు
ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేయాలని చెబుతూ.. కొన్ని షేర్లను బ్రోకరేజ్ సంస్థలు సిఫార్సులు చేస్తున్నాయి. అవి ఈ విధంగా ఉన్నాయి. కంపెనీ పేరు: ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రేటింగ్: మరిన్ని కొనవచ్చు టార్గెట్ ధర:రూ.1800 ప్రస్తుత ధర: రూ.1783 బ్రోకరేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎల్అండ్ టీ ఇన్ఫోటెక్ షేర్లను మరిన్ని కొనవచ్చని చెబుతూ టార్గెట్ ధరను రూ.1800 గా నిర్ణయించింది. పటిష్టమైన పోర్ట్పోలియోతోపాటు, అగ్రఖాతాలలో స్థిరత్వం ఉన్నందున ఈ షేర్లను కొనుక్కోవచ్చని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు ధర రూ.1783.25 గా ఉంది. కంపెనీ పేరు: అలెంబిక్ ఫార్మా బ్రోకరేజ్ సంస్థ:యస్ సెక్యూరిటీస్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.1100 ప్రస్తుత ధర: రూ.897 అలెంబిక్ ఫార్మా షేరుకు బ్రోకరేజ్ సంస్థ బైరేటింగ్ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.11000గా నిర్ణయించింది. ఈ కంపెనీకు ఆదాయం బాగానే వస్తుందని, టొరంట్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీ కంటే అధికంగా డిస్కౌంట్లు ఇచ్చి వ్యాపారం చేస్తోంది. అందువల్ల ఈ షేరును కొనవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెని షేరు ధర రూ. 897.50గా ఉంది. కంపెనీ పేరు: అజంతా ఫార్మా బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.1700 ప్రస్తుత ధర: రూ.1,510 బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అజంతా ఫార్మా షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ, టార్గెట్ ధరను రూ.1700 గా నిర్ణయించింది. అజంతా ఫార్మా ప్రధాన క్యాపెక్స్ కార్యక్రమం ఆర్థిక సంవత్సరం-21లో ముగుస్తుంది.నిర్వహణ క్యాపెక్స్ ఆర్థిక సంవత్సరం-22లో అవసరమని ఇది సంస్థకు ఉచిత నగదు ప్రవాహాన్ని సూచిస్తుందని తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.1,510.30 గా ఉంది. కంపెనీ పేరు: ఆల్ట్రా టెక్ సిమెంట్ బ్రోకరేజ్ సంస్థ: యస్ సెక్యూరిటీస్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.4413 ప్రస్తుత ధర: రూ.3,638 బ్రోకరేజ్ సంస్థ యస్ సెక్యూరిటీస్ ఆల్ట్రా టెక్ షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ, టార్గెట్ ధరను రూ.4413గా నిర్ణయించింది. ఆల్ట్రాటెక్ సిమెంట్‌కు చెందిన సెంచురీ టెక్స్టైల్స్ వినియోగం క్యూ4లో 83 శాతం పెరిగిందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.3,638.40 గా ఉంది. కంపెనీ పేరు: బజాజ్ ఆటో బ్రోకరేజ్ సంస్థ: ఎమ్కే గ్లోబల్ రేటింగ్: హోల్డ్ టార్గెట్ ధర: రూ.2629 ప్రస్తుత ధర: రూ.2,552 బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల బజాజ్ ఆటో షేరు రేటింగ్‌ను హోల్డ్‌లో ఉంచుతూ టార్గెట్ ధరను రూ.2629 గా నిర్ణయించింది. త్రీవీలర్ డిమాండ్, ఎగుమతుల అధిక మార్జిన్ అవకాశాలు తగ్గుతాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. త్రీవీలర్ ధరల పెరుగుదల దేశీయ డిమాండ్‌పై పడుతుందని తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు ధర రూ.2,552.75 గా ఉంది. -
షేర్ల దుర్వినియోగానికి చెక్
న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లను స్టాక్ బ్రోకర్లు సొంతానికి వాడుకున్నా, ఇన్వెస్టర్ల నిధులను పక్కదారి పట్టించినా సత్వరం గుర్తించేందుకు ప్రత్యేక ఆన్లైన్ సిస్టమ్‌ను రూపొందించినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గురువారం వెల్లడించింది. ఇలాంటి కేసుల్లో స్టాక్ ఎక్సే్చంజీలను ఈ సిస్టమ్ వెంటనే అప్రమత్తం చేస్తుందని పేర్కొంది. క్లయింట్లు తనఖాగా ఉంచిన షేర్లను కొన్ని బ్రోకింగ్ సంస్థలు.. సొంత అవసరాల కోసం లేదా ఇతర క్లయింట్ల అవసరాల కోసం దుర్వినియోగం చేసిన ఉదంతాలు వెలుగుచూసిన నేపథ్యంలో సెబీ తాజా చర్యలు తీసుకుంది. ఈ వ్యవస్థ కింద.. బ్రోకర్లు వారంవారీ స్టాక్ ఎక్సే్చంజీలకు సమర్పించే క్లయింట్ల షేర్ల డేటా వివరాలను సెబీ ఆన్లైన్ సిస్టమ్ సేకరిస్తుంది. క్లయింట్ డీమ్యాట్ అకౌంట్లో ఉన్న షేర్లు, మరుసటి రోజున బ్రోకరు చూపించిన షేర్ల పరిమాణాన్ని పోల్చి చూస్తుంది. ఏవైనా వ్యత్యాసాలు కనిపించిన పక్షంలో ఎక్సే్చంజీలను అప్రమత్తం చేస్తుంది. ప్రతీవారం ఈ నివేదికలు విడుదల చేస్తామని, ఇప్పటికే ఇలాంటి మూడు కేసులను ఎక్సే్చంజీలకు తెలియజేశామని సెబీ ఒక ప్రకటనలో తెలిపింది. -
పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చే ముందు జాగ్రత్త
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్లతో ఇన్వెస్టర్లు పవర్ ఆఫ్ అటార్నీ (పీవోఏ) ఒప్పందం కుదుర్చుకునే విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్ఎస్ఈ హెచ్చరించింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ రూ.2,300 కోట్ల విలువైన తమ క్లయింట్ల సెక్యూరిటీలను తన ఖాతాలోకి మళ్లించి, వాటిపై రుణాలు పొందిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కార్వీ క్లయింట్ల పీవోఏను దుర్వినియోగం చేసినట్టు సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈ సోమవారం ఓ ప్రకటనలో సూచనలు చేసింది. ► ఇన్వెస్టర్లు తమ తరఫున బ్రోకర్లు నిర్వహించాల్సిన హక్కుల ను పీవోఏలో స్పష్టంగా పేర్కొనాలి. అవి ఎప్పటి వరకు చెల్లుబాటయ్యేది కూడా ఒప్పందంలో ఉండేలా చూసుకోవాలి. ► పీవోఏకు ప్రత్యామ్నాయంగా ఆన్లైన్లో సెక్యూరిటీలను డెలివరీ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలి. సెబీ, స్టాక్ ఎక్సే్ఛ ంజ్ నిబంధనల ప్రకారం పీవోఏ అన్నది తప్పనిసరేమీ కాదు. ► ట్రేడ్ కాంట్రాక్టు 24 గంటల్లోపు ఇన్వెస్టర్లకు అందాలి. అదే విధంగా అకౌంట్ స్టేట్మెంట్ ప్రతి మూడు నెలలకూ ఓ సారి తప్పకుండా వచ్చేలా చూసుకోవాలి. ► బ్రోకర్ వద్ద మార్జిన్ కోసం ఉంచిన సెక్యూరిటీలను తనఖా పెట్టి నిధులు పొందేందుకు అనుమతించకూడదు. ► నిధులు, సెక్యూరిటీలను బ్రోకర్ వద్దే ఉంచేయకుండా సకాలంలో తెప్పించుకోవాలి. ► ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల్లోకి క్రమం తప్పకుండా లాగిన్ అయి, బ్యాలన్స్‌ను తనిఖీ చేసుకోవాలి. డిపాజిటరీల నుంచి వచ్చే స్టేట్మెంట్లు, స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల నుంచి నిధులు, సెక్యూరిటీలకు సంబంధించి వచ్చే ఎస్ఎంఎస్లను కూడా పరిశీలించుకోవాలి. ఏవైనా వ్యత్యాసాలను గమనిస్తే వెంటనే ఆ విషయాన్ని బ్రోకర్లకు తెలియజేయాలి. ► స్టాక్ బ్రోకర్ వద్ద తమ మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీకి సంబంధించి తాజా వివరాలు ఉండేలా చూసుకోవాలని కూడా ఇన్వెస్టర్లను ఎన్ఎన్ఈ కోరింది. -
షేర్ల వ్యాపారానికి స్టాక్ బ్రోకర్!
స్టాక్ ఎక్స్ఛేంజ్, బులియన్ మార్కెట్, షేర్లు, సెన్సెక్స్, నిఫ్టీ.. ఇవి మనం తరచుగా వినే పదాలు. సంప్రదాయ పొదుపు పథకాల కంటే షేర్లలో పెట్టుబడులతో అధిక రాబడి ఉంటుందని ఆర్థిక నిపుణులు సలహాలు ఇస్తుంటారు. అయితే, షేర్లు, అందులో పెట్టుబడులపై చాలామందికి ఏమాత్రం అవగాహన ఉండదు. షేర్ల ఫలాలు పొందాలనుకునే క్లయింట్ల తరఫున ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి స్టాక్ బ్రోకర్లు ఉంటారు. ప్రపంచంలో ధనం చెలామణిలో ఉన్నంతకాలం స్టాక్ బ్రోకర్లకు చేతినిండా పని, మంచి ఆదాయం లభిస్తాయని నిపుణులు అంటున్నారు. పేరు ప్రఖ్యాతలు, ఆదాయం, అవకాశాలు: స్టాక్ బ్రోకర్లు తమ క్లయింట్లకు సురక్షితమైన పెట్టుబడి పథకాలను సూచించాల్సి ఉంటుంది. వారి తరఫున షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి. షేర్ల కొనుగోలు, అమ్మకం వంటి కార్యకలాపాలు స్వయంగా చేపట్టాలి. ఈ వ్యవహారాలను నిర్వహించినందుకు క్లయింట్ల నుంచి ఆకర్షణీయమైన కమీషన్ పొందొచ్చు. స్టాక్ బ్రోకర్లు తమ పనితీరుతో క్లయింట్లకు లాభాలను ఆర్జించి పెడితే పేరుప్రఖ్యాతలు వస్తాయి. అవకాశాలు, ఆదాయం పెరుగుతాయి. తాజా గ్రాడ్యుయేట్లు/పోస్టు గ్రాడ్యుయేట్లకు స్టాక్ బ్రోకరేజీ సంస్థల్లో అసిస్టెంట్ రిలేషన్షిప్ మేనేజర్/రిలేషన్షిప్ మేనేజర్‌గా కొలువులు అందుబాటులో ఉన్నాయి. బ్రోకరేజీ కంపెనీలో సబ్-బ్రోకర్, ఫ్రాంచైజీగా కూడా చేరొచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: స్టాక్ బ్రోకర్‌కు మార్కెట్ పల్స్‌ను సరిగ్గా గుర్తించే నేర్పు ఉండాలి. ఆర్థిక లావాదేవీల్లో నమ్మకం ప్రధానం. క్లయింట్ల మనోభావాలు దెబ్బతినకుండా, మార్కెట్లో కంపెనీ స్థానం దిగ జారకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్టాక్ బ్రోకర్ పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే క్లయింట్ల జీవితాలు తారుమారవుతాయి. కాబట్టి విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సదా అప్రమత్తంగా ఉండాలి. ఈ వృత్తిలో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. అర్హతలు: మన దేశంలో బ్రోకరేజీ సంస్థలు ఎంబీఏ (ఫైనాన్స్) కోర్సు చదివినవారిని అసిస్టెంట్ రిలేషన్షిప్ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్‌గా నియమించుకుంటున్నాయి. కాబట్టి ఈ కోర్సు పూర్తిచేస్తే స్టాక్ బ్రోకర్‌గా స్థిరపడొచ్చు. దీంతోపాటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ చేస్తున్న ఫైనాన్షియల్ మార్కెట్స్ సర్టిఫికేషన్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ చేస్తున్న డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ సర్టిఫికేషన్ కూడా పూర్తిచేస్తే అర్హతలను పెంచుకొని, మంచి అవకాశాలను అందుకోవచ్చు. వేతనాలు: స్టాక్ బ్రోకర్లకు పనితీరును బట్టి ఆదాయం చేతికందుతుంది. ఎంబీఏ(ఫైనాన్స్) కోర్సు చేసిన రిలేషన్షిప్ మేనేజర్ సంవత్సరానికి రూ.2.4 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. నాన్-ఫైనాన్స్ రిలేషన్షిప్ మేనేజర్‌కు ఇంతకంటే కొంత తక్కువ ఆదాయం లభిస్తుంది. సంస్థ పరిధిని బట్టి ఇందులో మార్పులుంటాయి. రిలేషన్షిప్ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించినవారు మెరుగైన పనితీరుతో టీమ్ లీడర్, జోనల్ మేనేజర్‌గా పదోన్నతులు పొందొచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: బీఎస్ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్-ముంబై. వెబ్సైట్:www.bseindia.com నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్-ముంబై. వెబ్సైట్: www.nseindia.com ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ వెబ్సైట్: www.icsi.edu ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ వెబ్సైట్: www.icai.org ఎన్సీఎఫ్ఎం అకాడమీ-హైదరాబాద్. వెబ్సైట్: www.ascncfmacademy.com ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగొచ్చు ‘‘భారతీయ స్టాక్ మార్కెట్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. స్టాక్ బ్రోకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఫైనాన్స్, మార్కెట్లపై ఆసక్తి ఉన్న ఇంటర్మీడియెట్, డిగ్రీ అభ్యర్థులు ఈ కోర్సులను అభ్యసించొచ్చు. షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్ల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియలో స్టాక్ బ్రోకర్‌దే ప్రధాన పాత్ర. వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన ఈ క్రయవిక్రయాల విషయంలో స్టాక్‌బ్రోకర్... డీలర్‌గా, అడ్వైజర్‌గా, అనలిస్ట్‌గా పనిచేస్తాడు. ఈ కెరీర్లో ప్రవేశించిన వారు ఉద్యోగాలకే పరిమితమవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్ స్థితిగతులపై పూర్తి అవగాహన ఏర్పడితే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది’’ - ఎ.ఎస్.చక్రవర్తి, ఎన్సీఎఫ్ఎం అకాడమీ, హైదరాబాద్ పోటీ పరీక్షల్లో ‘దిక్కులు’ టాపిక్‌పై ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? వీటిని సులభంగా సాధించడానికి సూచనలివ్వండి. - జి.అరుణ్, నారాయణగూడ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలతోపాటు ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్లన్నింటి దృష్ట్యా ‘దిక్కులు’ పాఠ్యాంశం అత్యంత ప్రాధాన్యమైంది. ప్రతి పోటీ పరీక్షలోనూ ఈ అంశం నుంచి కనీసం రెండు లేదా మూడు ప్రశ్నలు తప్పనిసరిగా కనిపిస్తాయి. పటం సహాయంతో వీటిపై వచ్చే ప్రశ్నలను సులభంగా సాధించవచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఎదురవగానే ముందుగా కాగితంలో ఏదో ఒక మూలన పై నుంచి కిందికి సవ్యదిశలో ‘ఉఈతూఆదనైపవా’ కోడ్‌తో వరుసగా దిక్కులన్నింటినీ గుర్తించాలి. తర్వాత దత్తాంశంలోని వివరాల ఆధారంగా పటం గీయాలి. వ్యక్తి ప్రయాణిస్తున్న దిశ ఆధారంగా కుడివైపు లేదా ఎడమవైపు తిరిగితే ఏ దిశలో ఉంటాడో జాగ్రత్తగా గుర్తించాలి. వీటిపై వచ్చే ప్రశ్నలను సులభంగా సాధించడానికి తోడ్పడే మరో అంశం ‘పైథాగరస్ సిద్ధాంతం’. దీనికి సంబంధించి లంబకోణ త్రిభుజం ఏర్పరిచే భుజాల కొలతలైన (3, 4, 5), (5, 12, 13), (12, 16, 20) లాంటివాటిని గుర్తుంచుకుంటే సమస్యను మరింత వేగంగా సాధించవచ్చు. ఇన్పుట్స్: బి రవిపాల్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ బయాలజీ మెథడ్స్‌లో ప్రశ్నల ప్రాధాన్యం ఏమిటి? - ఆర్.సౌందర్య, కాప్రా డీఎస్సీ, టెట్ పరీక్షల్లో మెథడాలజీ ప్రశ్నలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించడం వల్ల పోటీలో ముందు నిలిచే అవకాశం ఉంది. గతంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో మెథడాలజీ నుంచి 16 మార్కులకుగాను 32 ప్రశ్నలు ఇచ్చారు. ఒకవేళ టెట్‌ను కొనసాగిస్తే దాంట్లోనూ ఈ విభాగం నుంచి 20 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కంటెంట్ నుంచి 44 మార్కులకుగాను ఇచ్చే 88 ప్రశ్నలకు చాలా మంది అభ్యర్థులు కచ్చితమైన సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కంటెంట్‌కు సంబంధించిన చాలా ప్రశ్నలు పదో తరగతి, కొన్ని ప్రశ్నలు ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉండటం, డిగ్రీ స్థాయి అభ్యర్థులు పుస్తకాలను పదే పదే చదవడం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతున్నారు. కంటెంట్‌పై ప్రశ్నలు జ్ఞాన సంబంధమైనవి (నాలెడ్‌జ బేస్డ్) కావడం వల్ల పుస్తకాలను క్షుణ్నంగా చదివిన అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధిస్తారు. అందువల్ల మెథడాలజీలో పట్టు సాధించిన వారికి మంచి ర్యాంకు వస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇన్పుట్స్: ఎస్.పి.డి.పుష్పరాజ్, సబ్జెక్ట్ నిపుణులు జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. టెక్నికల్ అసిస్టెంట్ టి-3 అర్హతలు: అగ్రికల్చర్ సెన్సైస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ. తగిన అనుభవం దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 25 వెబ్సైట్: www.nrcpb.org సీఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. సబ్ ఇన్స్పెక్టర్: 42 విభాగాలు: స్టాఫ్ నర్స్, రేడియోగ్రాఫర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్: 87 విభాగాలు: ఫిజియో థెరపిస్ట్, ఫార్మాసిస్ట్, లేబొరేటరీ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్. హెడ్ కానిస్టేబుల్: 19 విభాగాలు: జూనియర్ ఎక్స్‌రే అసిస్టెంట్, లేబొరేటరీ అసిస్టెంట్, ఎయిర్ కండీషనింగ్ ప్లాంట్ టెక్నీషియన్, స్టీవార్డ్. కానిస్టేబుల్: 46. విభాగాలు: వార్డ్బాయ్/ గర్ల్, కుక్. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 7 వెబ్సైట్: http://crpf.nic.in ఇండియన్ నేవీ ఇండియన్ నేవీ.. షార్ట్ సర్వీస్ కమిషన్ పైలట్/ అబ్జర్వర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పైలట్/అబ్జర్వర్ అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్, 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డీజీసీఏ జారీ చేసిన సీపీఎల్ ఉండాలి. ఎంపిక: సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 3 వెబ్సైట్: www.nausena-bharti.nic.in నర్సింగ్ డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ - తెలంగాణ (డీఎంఈ) జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. కాలపరిమితి: మూడున్నరేళ్లు అర్హత: 40 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 13 వెబ్సైట్: http://dme.tg.nic.in/ ఎడ్యూ న్యూస్: ఆసియాలో టాప్ బి-స్కూల్.. ఐఐఎం-కలకత్తా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-కలకత్తా ఆసియాలో టాప్ బిజినెస్ స్కూల్ (బి-స్కూల్)గా గుర్తింపు సాధించింది. ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ గ్లోబల్ ర్యాంకింగ్స్-2014లో స్థానం పొంది తన ప్రత్యేకతను చాటుకుంది. తన ఫ్లాగ్షిప్ కోర్సు పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్(పీజీపీ) ద్వారా ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ర్యాంకింగ్‌సలో 6 స్థానాలను మెరుగుపర్చుకుంది. నాన్-యూరోపియన్ బి-స్కూల్స్‌లో టాప్ ర్యాంక్ పొందింది. ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్ టాప్ 70లో కేవలం ఐదు నాన్- యూరోపియన్ బి-స్కూల్స్‌కు మాత్రమే స్థానం దక్కింది. భారత్ నుంచి ఐఐఎం-కలకత్తాతో పాటు ఐఐఎం-అహ్మదాబాద్‌కు మాత్రమే ర్యాంక్(16) లభించింది. దేశంలో ప్రముఖ బి-స్కూల్స్‌లో ఒకటైన ఐఐఎం-కలకత్తా ఇప్పటికే అసోసియేషన్ ఆఫ్ ఎంబీఏస్ (ఏఎం బీఏ), అసోసియేషన్ టూ అడ్వాన్స్ కాలేజీయేట్ స్కూల్స్ ఆఫ్ బిజినెస్ (ఏఏసీఎస్బీ) అక్రిడి టేషన్లను, సీఈఎంఎస్ సభ్యత్వాన్ని పొందింది. భారత్‌లో పెరుగుతున్న ఉన్నత విద్యావంతులు భారతదేశంలో ఉన్నత విద్యనభ్యసించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం లభిస్తుండడమే ఇందుకు కారణం. 2008లో ఉన్నత విద్యకోసం కళాశాల లు/విశ్వవిద్యాలయాల్లో చేరినవారి నిష్పత్తి 11 శాతం కాగా 2013 నాటికి అది 16 శాతానికి చేరింది. 2021 నాటికి ఈ నిష్పత్తి 21 శాతానికి చేరుతుందని అంచనా. ఫ్రాస్ట్ అండ్ సలివన్ పరి శోధనలో ఈ విషయం వెల్లడైంది. 2009లో విద్యారంగానికి ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయించాయి. దీనివల్ల కొత్తగా ఉన్నతవిద్యలో 2 మిలియన్ల సీట్లు అందుబాటు లోకి వచ్చాయి. అయితే, ప్రస్తుత అవసరాలు తీరాలంటే 10 మిలియన్ల సీట్లు కావాలని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్త సీట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచి స్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ఆర్థిక తోడ్పాటు, మౌలిక సదుపాయాలు మెరుగుపడు తుండడం, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వంటివాటితో భారత్‌లో ఉన్నత విద్యా రంగం అభివృద్ధి చెందుతున్నట్లు పరిశోధనలో తేలింది. విదేశీ విద్యార్థులు కూడా భారత్‌వైపు అధికంగా దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమైంది. జాబ్ స్కిల్స్ ఇంటర్వ్యూలో చిన్న అంశాలదే పెద్ద పాత్ర మౌఖిక పరీక్ష అంటే కేవలం ప్రశ్నలు, సమాధానాలే కాదు. ఇందులో ప్రతి చిన్న అంశం అభ్యర్థి భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. మీరు ధరించిన దుస్తులు, మీ నడవడిక, హావభావాలు, మీరు మాట్లాడే ప్రతి మాట, మీ ప్రతి కదలికను రిక్రూటర్ నిశితంగా పరిశీలిస్తారు. ఇంటర్వ్యూలో రిక్రూటర్ ఏయే అంశాలను గమనిస్తారో కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. సంస్థను, ఉద్యోగాన్ని బట్టి ఇవి వేర్వేరుగా ఉండొచ్చు. కానీ, కొన్ని ఉమ్మడి అంశాలు మాత్రం ఉంటాయి. అభ్యర్థులు వాటి గురించి తెలుసుకుంటే అందుకనుగుణంగా సన్నద్ధం కావొచ్చు. ఆలస్యం వద్దు: మౌఖిక పరీక్షకు ఆలస్యంగా హాజరైతే అవకాశాలు దెబ్బతింటాయి. అలాగని చాలాముందుగా చేరుకొని నిరీక్షించడం కూడా సమర్థనీయం కాదు. ఈ విషయంలో సమతూకం పాటించాలి. నిర్దేశిత సమయం కంటే 5-10 నిమిషాలు ముందుగా ఇంటర్వ్యూ కార్యాలయానికి చేరుకోవడం మంచిది. ఇలా చేరుకోవడానికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. రిక్రూటర్‌తో కరచాలనం ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? అనేదానిపై ముందుగా స్నేహితులతో కలిసి ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఇంటర్వ్యూలో తడబాటుకు గురయ్యేందుకు ఆస్కారం ఉండదు. వేషధారణ ప్రొఫెషనల్‌గా: శరీరానికి నప్పని దుస్తులు వేసుకుంటే మీకు ఇబ్బందిగా, చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటుంది. రిక్రూటర్ దృష్టిని ఆకర్షించి, మంచి మార్కులు కొట్టేయాలనుకుంటే ప్రొఫెషనల్‌గా కనిపించే దుస్తులనే ధరించండి. మీకు సౌకర్యవంతంగా ఉండేవాటినే ఎంచుకోండి. బిగుతైన బట్టలు వేసుకుంటే నడిచేందుకు, కూర్చునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే రంగురంగుల ఫ్యాషన్లను దూరం పెట్టండి. మహిళలు చీర ధరించడం ఉత్తమం. అలంకరణ అతిగా లేకుండా చూసుకోవాలి. ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టేటప్పుడు చేతిలో అనవసరమైన సంచులు, వస్తువులు ఉండొద్దు. తక్కువ బరువుండే ఒక ఫైల్ మాత్రమే తీసుకెళ్లాలి. అందులో మీ రెజ్యూమె, ఇతర ధ్రువపత్రాలు ఉండాలి. కొందరు మాట్లాడుతుంటే చిత్రవిచిత్రమైన శబ్దాలు వారి నోటి నుంచి వెలువడుతుంటాయి. పదాల కోసం తడుముకుంటూ ఇలా శబ్దాలు చేస్తుంటారు. దీనివల్ల అభ్యర్థిపై రిక్రూటర్‌కు చిన్నచూపు ఏర్పడుతుంది. కనుక స్పష్టంగా మాట్లాడండి. సమాధానం వెంటనే తట్టకపోతే.. ప్రశ్న అర్థం కాలేదు, మరోసారి అడుగుతారా? అంటూ రిక్రూటర్‌ను అభ్యర్థించండి. వారు అడిగేలోగా సమాధానం మనసులో సిద్ధం చేసుకోండి. సెల్‌ఫోన్‌తో జాగ్రత్త: ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మీరు నోట్స్ రాసుకోండి. రిక్రూటర్ చెప్పే ముఖ్యమైన పాయింట్లను ఒక చిన్న నోట్‌బుక్‌లో రాయండి. దీనివల్ల మీరు సీరియస్ అభ్యర్థి అని, ఉద్యోగంపై మీకు నిజంగా ఆసక్తి ఉందని రిక్రూటర్ గుర్తిస్తారు. ఇంటర్వ్యూలో మీ సెల్‌ఫోన్ మోగితే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్ మోగడం రిక్రూటర్‌కు ఆగ్రహం కలిగిస్తుంది. కాబట్టి గదిలోకి అడుగుపెట్టడానికి ముందే ఫోన్‌ను సెలైంట్ మోడ్‌లో ఉంచండి. స్విచ్ఛాఫ్ చేయడం ఇంకా మంచిది. -
డిస్కౌంట్ దెబ్బకు బ్రోకర్లు డీలా
ముంబై: స్టాక్ బ్రోకర్లు లావాదేవీల పరిమాణం ఆధారంగా బ్రోకరేజీ వసూలు చేయడం విదితమే. లావాదేవీల విలువ ఎక్కువైన కొద్దీ చార్జీ పెరుగుతుంటుంది. అయితే కాలం మారింది. స్టాక్ బ్రోకర్ల వ్యాపారాన్ని కుదేలుచేస్తూ డిస్కౌంట్ బ్రోకర్లు తెరపైకి వచ్చారు. లావాదేవీ విలువ ఐదు రూపాయలైనా, ఐదు కోట్ల రూపాయలైనా నిర్ణీత చార్జీయే (సుమారు రూ.20) వసూలు చేస్తారు. గత రెండు మూడేళ్లలో కాంపోజిట్ఎడ్జ్, జీరోధా, ఆర్కేఎస్వీ, అచీవర్స్ ఈక్విటీస్ తదితర డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీలు చిన్న ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. అమ్మకం/ కొనుగోలు విలువతో సంబంధం లేకుండా నిర్ణీత ఫీజుకే షేర్లు, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, కమాడిటీస్లో ఈ కంపెనీలు చిన్న ఇన్వెస్టర్ల తరఫున ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి. హెచ్ఎస్బీసీ, ఐఐఎఫ్ఎల్, బ్రిక్స్ సెక్యూరిటీస్ వంటి భారీ ఫుల్‌టైమ్ బ్రోకింగ్ సంస్థలు రిటైల్ బ్రోకింగ్ నుంచి నిష్ర్కమించాలని నిర్ణయించుకున్న తరుణంలో డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీలు రంగప్రవేశం చేశాయి. జియోజిత్ బీఎన్పీ పారిబా, ఈడెల్వీస్ సెక్యూరిటీస్, ఎమ్కే ఫైనాన్షియల్ సర్వీసెస్, మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ వంటి ఫుల్ సర్వీస్ స్టాక్‌బ్రోకింగ్ కంపెనీలకు రిటైల్, స్మాల్ ఇన్వెస్టర్ విభాగం ద్వారా నమోదయ్యే వ్యాపార పరిమాణం గణనీయంగా తగ్గడం గమనార్హం. షేర్‌ఖాన్, ఐసీఐసీఐ డెరైక్ట్, ఇండియాబుల్స్ వంటి కంపెనీల రిటైల్ బ్రోకింగ్ యూనిట్ల పురోగతి కూడా క్షీణదశలో ఉంది. అమెరికా ఆదర్శంగా: 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభాన్నుంచి అమెరికా, జపాన్, యూరప్ వంటి మార్కెట్లు కోలుకోగా భారతీయ స్టాక్ మార్కెట్ ఇంకా కుదుటపడలేదు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై మొగ్గుచూపి స్టాక్ మార్కెట్‌కు దూరంగా ఉండిపోయారు. 1990వ దశకంలో అమెరికాలో ఈ-ట్రేడ్, టీడీ అమెరిట్రేడ్, చార్లెస్ ష్వాబ్ వంటి డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీల ఆవిర్భావంతో గోల్డ్‌మాన్ శాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి బడా సంస్థలు రిటైల్ బ్రోకింగ్ డివిజన్లను మూసేసుకోవాల్సి వచ్చింది! ఇండియాలోనూ ఇలాంటి పరిస్థితే వచ్చిందని దేశీయ తొలి డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీ జీరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ చెప్పారు. దేశంలో డిస్కౌంట్ బ్రోకర్లు, ఫుల్ సర్వీస్ బ్రోకర్లు విభిన్న వ్యాపార పద్ధతులతో కొనసాగుతున్నారని తెలిపారు. ‘మా కంపెనీకి ఏడువేల మంది ఖాతాదారులున్నారు. కరెన్సీ, కమాడిటీస్, ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్స్‌లో రోజూ రూ.4-5 వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాం. దేశీయ డిస్కౌంట్ బ్రోకింగ్ వ్యాపారంలో 70 శాతం వాటా మాదే...’ అని కామత్ వివరించారు. ‘ఇంట్లో కంప్యూటర్ నుంచి లావాదేవీలు నిర్వహించగలిగిన వివేకవంతమైన ఇన్వెస్టర్ల అవసరాలను మేం తీరుస్తున్నాం...’ అని కాంపోజిట్ఎడ్జ్ సహవ్యవస్థాపకుడు సతీశ్ కుమార్ దత్ చెప్పారు. డిస్కౌంట్ బ్రోకర్ అయిన ఈ కంపెనీ ఒక్కో లావాదేవీకి రూ.18 చొప్పున చార్జీ వసూలు చేస్తోంది. -
కనుమరుగవుతున్న కంపెనీలు!
అక్రమ లావాదేవీలతో స్టాక్ మార్కెట్లను ఒక ఊపుఊపి చివరకు బోర్డు తిప్పేసిన స్టాక్ బ్రోకర్ కేతన్ పరేఖ్ గుర్తున్నాడు కదా? ఇతడు సృష్టించిన బూమ్‌లో మార్కెట్ ఫేవరెట్లుగా ఒక వెలుగువెలిగిన పలు షేర్లు ప్రస్తుతం స్టాక్ ఎక్స్ఛేంజీలలో కనిపించకుండా పోవడం చెప్పుకోదగ్గ పరిణామం! ఈ జాబితాలో సిల్వర్‌లైన్ టెక్నాలజీస్, పరేఖ్ ప్లాటినం, ఎస్కేఎం ఎగ్ ప్రోడక్ట్స్, టెలిడేటా మెరైన్లను ప్రధానంగా ప్రస్తావించవచ్చు. కేతన్ స్కామ్ బయటపడ్డాక ఈ షేర్ల ధరలు పాతాళానికి పడిపోవడమేకాకుండా ఎక్స్ఛేంజీల కన్నెర్రకు కూడా లోనయ్యాయి. వెరసి నిబంధన లు పాటించకపోవడంతో నిషేధానికి(సస్పెన్షన్) గురయ్యాయి. ఈ బాటలో సస్పెండ్ అయిన కంపెనీల సంఖ్య ఇప్పటికే 1,200కు చేరగా, మరికొన్ని కంపెనీలు అదే బాటలో నడుస్తుండటం గమనార్హం! కాగా, ఈ 1,200 కంపెనీలను ఎక్స్ఛేంజీలు ట్రేడింగ్ నుంచి నిషేధించడంతో సుమారు రూ. 2,500 కోట్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు త్రిశంకు స్వర్గంలో ఉండిపోయాయి. పెరుగుతున్న జాబితా గతేడాది నుంచి ఎక్స్ఛేంజీల సస్పెన్షన్‌కు గురవుతున్న కంపెనీల జాబితా పెరుగుతుండటం చెప్పుకోదగ్గ పరిణామం. ఇందుకు ఆర్థిక మందగమనం, డిమాండ్ పడిపోవడం, గరిష్ట వడ్డీ రేట్లు, పెట్టుబడుల ఆవిరి వంటి కారణాలను కంపెనీలు చూపినప్పటికీ యాజమాన్య లోపాలే అధికమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫలితంగా 2011లో నిషేధానికి లోనైన కంపెనీలతో పోలిస్తే గతేడాది ఈ సంఖ్య రెట్టింపునకుపైగా పెరిగింది. ఇక ఈ ఏడాది కూడా ఈ ట్రెండ్ కొనసాగుతూ ఇప్పటివరకూ 48 కంపెనీలు ఎక్స్ఛేంజీల కన్నెర్రకు లోనయ్యాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల నిషేధం కారణంగా లిస్టింగ్‌ను కోల్పోయిన కంపెనీలు సుమారు 1,200 వరకూ ఉన్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ రోజువారీ ట్రేడింగ్‌లో అత్యధికంగా ట్రేడయ్యే షేర్ల సంఖ్యలో ఇవి సగం కావడం విశేషం! ఎక్స్ఛేంజీలలో చివరిసారిగా ట్రేడైన ధరల ప్రకారం చూసినా ఈ కంపెనీలలో రూ. 2,500 కోట్లమేర ఇన్వెస్టర్ల పెట్టుబడులు చిక్కుకుపోయాయి. ఈ పెట్టుబడులు తక్కువగానే కనిపించినప్పటికీ వీటిలో అత్యధిక శాతం కంపెనీలు నష్టాలను నమోదు చేయడంతో వీటి విలువ కనీస స్థాయికి చేరిందన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. సస్పెన్షన్ ఎందుకు? సాధారణ పరిస్థితుల్లో కంపెనీలు లిస్టింగ్ నిబంధనలను అమలు చేయకపోతే స్టాక్ ఎక్స్ఛేంజీలు సస్పెన్షన్‌ను అమలు చేస్తాయి. వీటిలో ఆర్థిక ఫలితాల దాఖలు, వాటాదారుల వివరాలు, కార్పొరేట్ పరిపాలన(గవర్నెన్స్) వంటి అంశాలలో వరుసగా రెండు క్వార్టర్లపాటు కంపెనీలు విఫలంకావడం వంటివి ఉంటాయి. ఇవికాకుండా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సైతం అవకతవకలకు పాల్పడిన ట్లు గుర్తిస్తే ట్రేడింగ్ నుంచి కంపెనీలను నిషేధిస్తుంది. ఇలా నిషేధానికి గురైన సంస్థలలో వత్సా మ్యూజిక్, వత్సా కార్పొరేషన్ తదితరాలున్నాయి. ఈ ఇష్యూలలో రూ. 11,000 కోట్లమేర ఇన్వెస్టర్ల నిధులు చిక్కుకుపోయాయి. ఇక ఐపీవోకు సంబంధించి పిరమిడ్ సాయిమీరాను, షేరు ధర రిగ్గింగ్‌కు పాల్పడిందన్న కారణంతో డీఎస్క్యూ బయోటెక్‌ను సెబీ నిషేధించింది. నిజానికి లిస్టింగ్ నిబంధనలను పాటించలేని కంపెనీలను నిషేధించడమే సరైన ప్రక్రియఅని పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు. తద్వారా ఇన్వెస్టర్లు కొంతలోకొంత తమ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు అవకాశం చిక్కుతుందని అభిప్రాయపడ్డారు. ఇందువల్లనే ఇన్వెస్టర్లు తాము ఎంచుకున్న కంపెనీ నిర్వహిస్తున్న బిజినెస్‌తోపాటు, యాజమాన్య పటిష్టత, ఉత్పత్తుల నాణ్యత వంటి అంశాలను కూడా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.