కరోనా దాటికి కుదేలైన స్టాక్ మార్కెట్లు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. గత వారం రోజులుగా దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ సమయంలో షేర్ల కొనుగోలు విక్రయాల విషయంలో తొందరపాటు లేకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని చెబుతూ..కొన్ని షేర్లను కొనుగోలు చేయవచ్చని బ్రోకరేజ్ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. అవి ఈ విధంగా ఉన్నాయి.
కంపెనీ పేరు: హెడల్ బర్గ్ సిమెంట్
బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠీ
రేటింగ్: కొనవచ్చు
టార్గెట్ ధర: రూ.207
ప్రస్తుత ధర: రూ.172
బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ హెడల్‌బర్గ్ సిమెంట్ షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.207గా నిర్ణయించింది.ఈ కంపెనీ పనితీరు బావుందని చెబుతూ.. కంపెనీకి దృడమైన నెట్ డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్ ఉందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. భవిష్యత్తులో మూల ధన నియంత్రణ సామర్థ్యం బాగా పెరుగుతాయని చెబుతూ ఈ షేరును కొనవచ్చని తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.172.75 గా ఉంది.
కంపెనీ పేరు: చోళమండళమ్ ఇన్వెస్ట్‌మెంట్
బ్రోకరేజ్ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్
రేటింగ్: కొనవచ్చు
టార్గెట్ ధర : రూ.225
ప్రస్తుత ధర: రూ.145
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ చోళమండళమ్ షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.225గా నిర్ణయించింది. బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీలలో లిక్విడిటీ, టర్మ్ ఫండింగ్‌లో ఈ కంపెనీ స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. మూల ధనం, రుణాలు పెంచుకునే విషయంలో ఈ కంపెనీ స్థితిగతులకు బావున్నాయని అందువల్ల ఈ షేరు కొనవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ పేర్కోంది.కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.145.35 గా ఉంది.
కంపెనీ పేరు:భారత్ పెట్రోలియం
బ్రోకరేజ్ సంస్థ: నోమురా
రేటింగ్: కొనవచ్చు
టార్గెట్ ధర: రూ.390
ప్రస్తుత ధర: రూ.369
భారత్ పెట్రోలియం షేరుకు బ్రోకరేజ్ సంస్థ బయ్ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.390 గా నిర్ణయించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక అంచనాలను మించి ఫలితాలను వచ్చాయని నోమురా తెలిపింది.కోవిడ్-19 కారణంగా ఆర్థిక సంవత్సరం 2020-21లో పెట్టుబడులు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రైవేటీరణ ఒక ముఖ్యమైన ఉత్ప్రేరకంగా ఉంటుందని వెల్లడించింది. కాగా బీఎస్‌ఈలో ప్రస్తుతం ఈ కంపెనీ షేరు ధర రూ.369.90 గా ఉంది.
కంపెనీ పేరు: సాగర్ సిమెంట్స్
బ్రోకరేజ్ సంస్థ: యస్ సెక్యూరిటీస్
రేటింగ్: కొనవచ్చు
టార్గెట్ ధర: రూ.476
ప్రస్తుత ధర: రూ.333
బ్రోకరేజ్ సంస్థ యస్ సెక్యూరిటీస్ సాగర్ సిమెంట్స్‌కు బయ్ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.476గా నిర్ణయించింది. కోవిడ్-19 వల్ల ఏర్పడిన అంతరాయాలనుంచి సెప్టెంబర్ తర్వాతే సాగర్ సిమెంట్స్ సాధారణ స్థితి చేరుతుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపుల ఇవ్వడం వల్ల సిమెంట్స్ వినియోగం 30 శాతం పెరిగిందని ,ఇకముందు ఇంకా పుంజుకుంటుందని చెబుతూ ఈ షేరును కొనవచ్చని పేర్కొంది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.333.05 గా ఉంది.
కంపెనీ పేరు: కేఈఐ ఇండస్ట్రీస్
బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠీ
రేటింగ్: కొనవచ్చు
టార్గెట్ ధర: రూ.411
ప్రస్తుత ధర: రూ.352
బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ కేఈఐ ఇండస్ట్రీస్‌పై పాజిటివ్‌గా స్పందిస్తూ షేరుకు బయ్‌రేటింగ్‌ను ఇచ్చింది.టార్గెట్ ధరను రూ.411గా నిర్ణయించింది. ఈ కంపెనీ కేబుల్స్ ఆర్డర్లు బాగున్నాయని, వివిధ రకాల కస్టమర్లతో బలమైన బ్యాలెన్స్ షీట్ కలిగిందని చెబుతూ ఈ షేరును కొనవచ్చని తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.352.10 గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment