టీసీఎస్
బ్రోకరేజ్ సంస్థ:
రిలయన్స్ సెక్యూరిటీస్
ప్రస్తుత ధర: రూ. 2,474
టార్గెట్ ధర: రూ.3,030
ఎందుకంటే: ఈ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగపు ఆదాయం 13 శాతంగా ఉంది. అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే ఈ విభాగపు ఆదాయం రెండంకెల వృద్ధి సాధించింది. ఎనర్జీ/బీమా/ విభాగాల్లో ఆదాయం తగ్గుతుండడం ఆందోళనపరిచే అంశమైనప్పటికీ డిజిటల్ విభాగం ఆదాయం పెరుగుతుండడం సానుకూలాంశం. లాటిన్ అమెరికా, జపాన్‌ల నుంచి ఆదాయం తగ్గడంతో కంపెనీ ఆదాయ వృద్ధి స్వల్పంగా తగ్గింది.
అయితే కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 4 శాతం పెరిగింది. ఈ క్వార్టర్లో కంపెనీ నిర్వహణ పనితీరు బాగా ఉంది. వేతనాలు 8 శాతం పెరిగినప్పటికీ, రూపాయి మారకం క్షీణించడం కంపెనీకి కలసి వచ్చింది. ఉద్యోగుల వలస 15.1 శాతానికి పెరిగింది. రానున్న కాలంలో ఇది తగ్గవచ్చని కంపెనీ భావిస్తోంది. రెండేళ్లలో ఆదాయం డాలర్ టెర్మ్‌ల్లో 11 శాతం, ఈపీఎస్ 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఇక ఇబిటా ఈ ఆర్థిక సంవత్సరంలో 27 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 26 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం.
ఆర్‌ఈసీ
బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ.285
టార్గెట్ ధర: రూ.315
ఎందుకంటే: గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్ట్‌లకు రుణాలివ్వడం, ప్రోత్సాహం అందించడం లక్ష్యాలుగా 1969లో ఈ నవరత్న కంపెనీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం రాష్ట్రాల విద్యుదుత్పత్తి సంస్థలకు రుణాలందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో కంపెనీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.5,333 కోట్లకు పెరగ్గా, నికర లాభం మాత్రం స్వల్పంగా క్షీణించి రూ.1,095 కోట్లకు తగ్గింది.
ఇబిటా 11 శాతం వృద్ధితో రూ.4,753 కోట్లకు పెరిగింది. మరో మూడేళ్ల పాటు ఇదే జోరు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నాం. ఇటీవలనే రూ.24 వేల కోట్ల రుణాలివ్వడానికి తెలంగాణ స్టేట్ జనరేషన్ కార్పొరేషన్(టీఎస్‌జెన్‌కో)తో ఒప్పందం కుదుర్చుకుంది. రెండేళ్లలో నికర అమ్మకాలు 17 శాతం, నిర లాభం 13 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ప్రస్తుత ధరకు, పుస్తక విలువకు నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో 0.94గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 0.80గానూ ఉండొచ్చని భావిస్తున్నాం.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, ఇతర వివరాలు వివిధ బ్రోకరేజి సంస్థల నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
స్టాక్స్ వ్యూ
Published Mon, Jul 13 2015 1:49 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement
Advertisement