Quarterly financial results
-
అనుకున్నదొకటి అయినదొకటి..
ప్రముఖ కంపెనీలు కొన్ని క్యూ4లో ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కానీ అనుకున్న విధంగా లాభాలు పోస్ట్ చేయలేకపోయాయి. సిమెంట్ తయారీ దిగ్గజం ఏసీసీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. గతంలో ఈ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు వెలువడుతాయని అంచనా వేసినా లాభం లేకుండా పోయింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 20 శాతంపైగా క్షీణించి రూ.751 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ.943 కోట్లు ఆర్జించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ.7.5 డివిడెండ్ ప్రకటించింది. సిమెంట్ అమ్మకాల ఆదాయం మాత్రం 11 శాతం ఎగసి రూ. 5,686 కోట్లకు చేరింది. రెడీమిక్స్ కాంక్రీట్ ఆదాయం 32 శాతం జంప్‌చేసి రూ. 420 కోట్లను తాకింది. దీంతో మొత్తం టర్నోవర్ 12 శాతం మెరుగుపడి రూ. 6,067 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు 13 శాతం పెరిగి రూ. 5,515 కోట్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో అమ్మకాల పరిమాణం 14 శాతం పుంజుకుని 11.9 మిలియన్ టన్నులను తాకింది. వెరసి ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు సాధించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 3 శాతం వృద్ధితో రూ. 2,402 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 12 శాతం బలపడి రూ. 22,835 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: ‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’నెస్లే ఇండియా లాభం డౌన్న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 6 శాతంపైగా క్షీణించి రూ. 873 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 934 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం వృద్ధితో రూ. 5,448 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 5,254 కోట్ల అమ్మకాలు సాధించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ.3,208 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2025 జులైలో పదవీ విరమణ చేయనున్న చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ స్థానే 2025 ఆగస్ట్ 1 నుంచి మనీష్ తివారీ ఎండీగా బాధ్యతలు చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. -
ప్రముఖ టెక్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఇలా..
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టెక్ మహీంద్రా గతేడాది (2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 77 శాతం జంప్‌చేసి రూ. 1,167 కోట్లను తాకింది. మార్జిన్లు 3.5 శాతం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 661 కోట్లు ఆర్జించింది. ఈ కాలంలో 79.8 కోట్ల డాలర్ల(రూ. 6,800 కోట్లు) విలువైన ఆర్డర్లు కొత్తగా పొందింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి 42 శాతం అధికంగా 2.7 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 27,000 కోట్లు) విలువైన డాలర్లు సాధించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ మోహిత్ జోషీ తెలియజేశారు. చివరి త్రైమాసిక ఆర్డర్లలో 60 శాతం వృద్ధిని అందుకున్నట్లు వెల్లడించారు. వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 12,871 కోట్ల నుంచి రూ. 13,384 కోట్లకు బలపడింది. పూర్తి ఏడాదికి నికర లాభం 80 శాతం ఎగసి రూ. 4,251 కోట్లను అధిగమించింది. 2023–24లో రూ. 2,358 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 2 శాతం మెరుగై రూ. 52,988 కోట్లను తాకింది. కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 3,276 తగ్గి 1,48,731కు చేరింది. 2025 మార్చి31కల్లా చేతిలో నగదు, తత్సమాన నిల్వలు 89.6 కోట్ల డాలర్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది.సైయెంట్ డివిడెండ్ రూ. 14హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజినీరింగ్, టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ సైయెంట్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 186 కోట్ల లాభం ప్రకటించింది. క్రితం క్యూ4లో ఇది రూ. 197 కోట్లు. ఆదాయం రూ. 1,861 కోట్ల నుంచి రూ. 1,909 కోట్లకు చేరింది. 2024–25కి గాను రూ. 5 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై కంపెనీ రూ.14 తుది డివిడెండ్ ప్రకటించింది. డీఈటీ వ్యాపార విభాగంలో సుమారు 371 కోట్ల డాలర్ల విలువ చేసే 24 భారీ కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కృష్ణ బోదనపు తెలిపారు. కొత్తగా సెమీకండక్టర్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇది ప్రధానంగా ఏఐ ఆధారిత టెక్నాలజీ డెవలప్మెంట్పై దృష్టి పెడుతుందని తెలిపారు. ఇక డీఈటీ (డిజిటల్, ఇంజినీరింగ్, టెక్నాలజీ) విభాగం టెక్నాలజీ సరీ్వసులు, ఇంజినీరింగ్ కార్యకలాపాలపై, డీఎల్ఎం వ్యాపార విభాగం ఇంజినీరింగ్ ఆధారిత ప్రోడక్ట్ తయారీపై ఫోకస్ పెడుతుందని వివరించారు. డిమాండ్‌పరంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ తాము మెరుగైన పనితీరు కనపర్చినట్లు చెప్పారు. సమీప భవిష్యత్తులో కొంత అనిశ్చితి నెలకొన్నా సవాళ్లను అధిగమించేందుకు కస్టమర్లతో కలిసి పని చేస్తున్నట్లు కృష్ణ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం వరకు ఈ పరిస్థితి కొనసాగవచ్చన్నారు. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ లాభం అప్క్యూ4లో రూ.396 కోట్లుముంబై: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం పెర్సిస్టెంట్ సిస్టమ్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 25 శాతం జంప్‌చేసి రూ. 396 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 315 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 25 శాతం ఎగసి రూ. 3,242 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,591 కోట్ల టర్నోవర్ అందుకుంది. నిర్వహణ లాభ మార్జిన్లు 14.5 శాతం నుంచి 15.6 శాతానికి బలపడ్డాయి. అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో 2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించగలమని భావిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో వినీత్ టి. పేర్కొన్నారు. ఈ కాలంలో 51.75 కోట్ల డాలర్ల విలువైన కొత్త డీల్స్ కుదుర్చుకుంది. కంపెనీ 700 మంది ఉద్యోగులను జత కలుపుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 24,594కు చేరింది. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: దేశీయ కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు, బడ్జెట్‌కు ముందు కొనుగోళ్లు అంశాల నేపథ్యంలో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. మొహర్రం సందర్భంగా బుధవారం (జూన్ 17న) ఎక్సే్చంజీలకు సెలవ కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. ‘‘వృద్ధి ఆధారిత బడ్జెట్ ఉహాగానాలు, క్యూ1 ఆర్థిక ఫలితాలపై మిశ్రమ అంచనాల నడుమ మార్కెట్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి ఎగువ స్థాయిలో 24,600 వద్ద నిరోధం ఉంది. దిగువున 24,150 – 24,200 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది. ఫలితాల సీజన్ సందర్భంగా స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నందున ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించవచ్చు.’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణులు నాగరాజ్ శెట్టి తెలిపారు. గతవారం స్టాక్ సూచీలు దాదాపు ఒక శాతం ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రభావం మార్కెట్ ముందుగా గత వారాంతాన వెల్లడైన హెచ్‌సీఎల్ టెక్, డీమార్ట్ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ ఇండెక్స్‌లో 36% వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, ఏసియన్ పేయింట్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్ కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితో పాటు జియో ఫైనాన్సియల్ సరీ్వసెస్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్, ఏంజెల్ వన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్పైస్‌జెట్, ఆదిత్య బిర్లా కంపెనీ, ఎల్అండ్టీ ఫైనాన్స్ హావెల్స్, ఎల్అండ్టీ సరీ్వసెస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, పాలీక్యాబ్ ఇండియా, టాటా టెక్నాలజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, పేటీఎం, పీవీఆర్, యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్, యస్ బ్యాంక్ సహా మొత్తం 197 కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయ జూన్ హోల్‌సేల్ ద్రవ్యల్బణ డేటా, చైనా క్యూ1 జీడీపీ, జూన్ రిటైల్ అమ్మకాలు, యూరోజోన్ మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు(జూన్ 15న) విడుదల కానున్నాయి. మంగళవారం మే నెల యూరోజోన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, జూన్ అమెరికా రిటైల్ అమ్మకాల డేటా, బుధవారం బ్రిటన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, అమెరికా జూన్ పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి కానుంది. గురువారం బ్రిటన్ మే నిరుద్యోగ గణాంకాలు, జపాన్ జూన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా, యూరోజోన్ ఈసీబీ వడ్డీరేట్ల నిర్ణయం వెలువడునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ జూన్ 12తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. బ్రిటన్ జూన్ రిటైల్ అమ్మకాల డేటా, జపాన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ మే కరెంట్ ఖాతాల గణాంకాలు వెలువడునున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.రెండు వారాల్లో రూ.15వేల కోట్ల పెట్టుబడులువిదేశీ ఇన్వెస్టర్లు జూలై తొలి రెండు వారాల్లో దేశీయ మార్కెట్లో రూ.15,352 కోట్ల పెట్టుబడి పెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, కొనసాగుతున్న సంస్కరణలు ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ‘‘రాబోయే కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాలకు సంబంధించి ప్రోత్సహకాలు, రాయితీలు ఉండే అవకాశం ఉంది. అలాగే, అమెరికా ఫెడరల్ తన వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కూడా ఉన్నాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లను జరుపుతున్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్‡్ష శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు సమీక్షా కాలంలో డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.8,484 కోట్ల పెట్టుబడులు పెట్టారు. విదేశీ కొనుగోలుదారులతో పాటు దేశీయ కొనుగోలు దారులు సైతం 2024లో ఈక్విటీల్లో స్థిరమైన కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎఫ్‌పీఐలు జనవరి, ఏప్రిల్, మే నెలల్లో రూ.60,000 కోట్లు ఉపసంహరించుకోగా, ఫిబ్రవరి, మార్చి, జూన్లలో కలిపి రూ.63,200 కోట్లు కొనుగోళ్లు జరిపారు.బడ్జెట్‌పై ఆంచనాలు ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్ తరహాలోనే ఈసారి ఆర్థిక లోటు, రుణ లక్ష్యాలపై దృష్టి సారించవచ్చు. గ్రామీణ ఆర్థికావృద్ధిని బలోపేతం దిశగా సానుకూల ప్రకటనలు ఉండొచ్చు. తక్కువ ఆదాయ శ్రేణి వర్గాలకు పన్ను ప్రయోజనాలు ఉండొచ్చు. మూలధన వ్యయాలకు పెద్దపీట వేయవచ్చు. మొత్తంగా ప్రభుత్వ విధానాలు కొనసాగించే వీలుంది. బడ్జెట్ ఆధారిత వార్తలకు అనుగుణంగా ఆయా రంగాల షేర్లలో కదిలికలు ఉండొచ్చు. మొహర్రం సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు -
ఆరు వారాల్లో అతిపెద్ద నష్టం
ముంబై: స్టాక్ మార్కెట్ సోమవారం ఆరు వారాల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ షేర్ల భారీ పతనం సూచీల నష్టాలను శాసించాయి. దేశీయంగా వినిమయ, టోకు ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరడంతో ఆర్బీఐ వడ్డీరేట్లు పెంపు ఆందోళనలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం భయాలతో పాటు తాజాగా పెరుగుతున్న కోవిడ్ కేసులు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఫలితంగా ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండు శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1,172 పాయింట్లు పతనమై 57,167 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లకు గానూ 20 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ 302 పాయింట్లను కోల్పోయి 17,174 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. మరోవైపు ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.6,387 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.3,342 కోట్ల షేర్లను కొన్నారు. ఆరంభ నష్టాలను పూడ్చుకున్న రూపాయి డాలర్ మారకంలో ఆరు పైసలు బలహీనపడి 76.25 స్థాయి వద్ద ముగిసింది. 1,000 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభం నాలుగు సెలవు రోజుల అనంతరం ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూలతలను అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 1,000 పాయింట్లను కోల్పోయి 57,339 వద్ద, నిఫ్టీ 293 పాయింట్ల పతనంతో 17,183 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి దశలో కాస్త కోలుకునే ప్రయత్నం చేసినా.., రికవరీకి తోడ్పాటును అందించే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,497 పాయింట్లు క్షీణించి 56,842 వద్ద, నిఫ్టీ 408 పాయింట్లను కోల్పోయి 17,068 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ► మ్యూచువల్ ఫండ్ పంపిణీ ప్లాట్‌ఫామ్ ‘బీఎస్ఈ స్టార్ ఎంఎఫ్’పై సోమవారం 30.11 లక్షల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ 11 తర్వాత ఒకరోజులో ఇదే గరిష్టస్థాయి అని బీఎస్ఈ తెలిపింది. ► సూచీలు రెండు శాతం పతనంతో స్టాక్ మార్కెట్లో రూ. 2.58 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. తద్వారా బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.269 లక్షల కోట్లకు దిగివచ్చింది. బలహీనంగా అంతర్జాతీయ మార్కెట్లు చైనా ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ 4.8 శాతం వృద్ధికి పరిమితం కావడంతో పాటు కోవిడ్ కేసులు శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. జపాన్, సింగపూర్, చైనా, తైవాన్, దక్షిణ కొరియా, స్టాక్ సూచీలు ఒకశాతం వరకు పతనమైంది ఇండో నేసియా మార్కెట్ మాత్రం నష్టాల నుంచి తేరుకొని అరశాతం లాభపడింది. హాంగ్‌కాంగ్ మార్కెట్ సెలవు. ఈస్టర్ హాలిడేస్ సందర్భంగా యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్‌కు రూ.53,509 కోట్ల నష్టం మార్చి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఇన్ఫోసిస్ షేరు సోమవారం ఏడుశాతానికి పైగా క్షీణించి రూ.1,621 వద్ద స్థిరపడింది. గత బుధవారం (ఏప్రిల్ 13)మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ క్యూ4 ఫలితాలను వెల్లడించింది. బలహీనమైన నిర్వహణ మార్జిన్ నమోదు నేపథ్యంలో షేరు ఉదయం 8% నష్టంతో రూ.1592 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో తొమ్మిది శాతం క్షీణించి రూ.1,592 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మార్చి 16, 2020 తర్వాత షేరు ఈ స్థాయిలో దిగజారడం ఇదే తొలిసారి. షేరు భారీ పతనంతో కంపెనీకి ఒక్కరోజులోనే రూ.53,509 కోట్ల నష్టం వాటిల్లింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 5 శాతం పతనం ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ఐదు శాతం నష్టపోయి రూ. 1,395 వద్ద స్థిరపడింది. క్యూ4లో నికర లాభం అంచనాలను అందుకోలేకపోవడం షేరు పతనానికి కారణమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఐదు శాతం నష్టపోయి రూ.1,390 స్థాయిని తాకింది. బీఎస్ఈలో 4.94 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.38,542 కోట్లు కుచించుకుపోయి రూ.7.73 లక్షల కోట్లు వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► తన అనుబంధ సంస్థలో యూఎస్ కంపెనీ బ్లాక్‌రాక్ రియల్ అసెట్స్ రూ. 4,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు టాటా పవర్ ప్రకటనతో ఈ షేరులో లాభాల స్వీకరణ జరిగింది. బీఎస్ఈలో ఆరు శాతం నష్టంతో రూ.258 వద్ద స్థిరపడింది. ► ఈ వేసవి సీజన్లో విద్యుత్ డిమాండ్ ఉంటుందన్న అంచనాతో ఎన్టీపీసీ షేరు ఆరుశాతం లాభపడి రూ.163 వద్ద స్థిరపడింది. ‘‘ఐటీ, బ్యాంకింగ్ రంగ దిగ్గజాలు నిరాశాజనకమైన గణాంకాలతో ఆర్థిక ఫలితాల సీజన్‌ను ప్రారంభించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. భారత్‌లో కోవిడ్ కేసుల నమోదు, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ ఆందోళనలు రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్‌కు దిశానిర్ధేశాన్ని చూపుతాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. -
స్టాక్స్ వ్యూ
టీసీఎస్ బ్రోకరేజ్ సంస్థ: రిలయన్స్ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ. 2,474 టార్గెట్ ధర: రూ.3,030 ఎందుకంటే: ఈ సాఫ్ట్వేర్ దిగ్గజం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగపు ఆదాయం 13 శాతంగా ఉంది. అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే ఈ విభాగపు ఆదాయం రెండంకెల వృద్ధి సాధించింది. ఎనర్జీ/బీమా/ విభాగాల్లో ఆదాయం తగ్గుతుండడం ఆందోళనపరిచే అంశమైనప్పటికీ డిజిటల్ విభాగం ఆదాయం పెరుగుతుండడం సానుకూలాంశం. లాటిన్ అమెరికా, జపాన్ల నుంచి ఆదాయం తగ్గడంతో కంపెనీ ఆదాయ వృద్ధి స్వల్పంగా తగ్గింది. అయితే కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 4 శాతం పెరిగింది. ఈ క్వార్టర్లో కంపెనీ నిర్వహణ పనితీరు బాగా ఉంది. వేతనాలు 8 శాతం పెరిగినప్పటికీ, రూపాయి మారకం క్షీణించడం కంపెనీకి కలసి వచ్చింది. ఉద్యోగుల వలస 15.1 శాతానికి పెరిగింది. రానున్న కాలంలో ఇది తగ్గవచ్చని కంపెనీ భావిస్తోంది. రెండేళ్లలో ఆదాయం డాలర్ టెర్మ్‌ల్లో 11 శాతం, ఈపీఎస్ 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఇక ఇబిటా ఈ ఆర్థిక సంవత్సరంలో 27 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 26 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ఆర్ఈసీ బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.285 టార్గెట్ ధర: రూ.315 ఎందుకంటే: గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్ట్‌లకు రుణాలివ్వడం, ప్రోత్సాహం అందించడం లక్ష్యాలుగా 1969లో ఈ నవరత్న కంపెనీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం రాష్ట్రాల విద్యుదుత్పత్తి సంస్థలకు రుణాలందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో కంపెనీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.5,333 కోట్లకు పెరగ్గా, నికర లాభం మాత్రం స్వల్పంగా క్షీణించి రూ.1,095 కోట్లకు తగ్గింది. ఇబిటా 11 శాతం వృద్ధితో రూ.4,753 కోట్లకు పెరిగింది. మరో మూడేళ్ల పాటు ఇదే జోరు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నాం. ఇటీవలనే రూ.24 వేల కోట్ల రుణాలివ్వడానికి తెలంగాణ స్టేట్ జనరేషన్ కార్పొరేషన్(టీఎస్జెన్కో)తో ఒప్పందం కుదుర్చుకుంది. రెండేళ్లలో నికర అమ్మకాలు 17 శాతం, నిర లాభం 13 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ప్రస్తుత ధరకు, పుస్తక విలువకు నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో 0.94గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 0.80గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, ఇతర వివరాలు వివిధ బ్రోకరేజి సంస్థల నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.