దేశీ విమాన ప్రయాణికుల రద్దీలో భారత్‌ టాప్‌ | Strong air passenger demand growth returns in November 2016: IATA | Sakshi
Sakshi News home page

దేశీ విమాన ప్రయాణికుల రద్దీలో భారత్‌ టాప్‌

Published Thu, Jan 12 2017 12:46 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

దేశీ విమాన ప్రయాణికుల రద్దీలో భారత్‌ టాప్‌

దేశీ విమాన ప్రయాణికుల రద్దీలో భారత్‌ టాప్‌

న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల పెరుగుదల్లో భారత్‌.. ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రయాణికుల సంఖ్య నవంబర్‌లో 22.3%మేర పెరిగింది. ప్రయాణికుల సంఖ్య పెరగుతూ రావడం ఇది వరుసగా 20వ నెల. అలాగే ప్రయాణికుల సంఖ్యలో గత వరుస 13 నెలలుగా 20%కి పైగా వృద్ధి నమోదవుతూ వస్తోంది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) గణాంకాల ప్రకారం..  భారత్‌తోపాటు కేవలం రష్యా, చైనాల్లో మాత్రమే నవంబర్‌ నెల ప్రయాణికుల సంఖ్య పెరుగుదలలో రెండంకెల వృద్ధి నమోదయ్యింది. విమాన ప్రయాణికుల వృద్ధి రష్యాలో 15.5%గా, చైనాలో 14.9%గా ఉంది. ముడిచమురు ధరలు తక్కువగా ఉండటం, ఆర్థిక వ్యవస్థ రికవరీ అంశాలు ఈ ఏడాదిలో డిమాండ్‌ పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement