
మేక్ ఇన్ ఇండియా కాదు...క్వాలిటీ ఇన్ ఇండియా కావాలి!
మేక్ ఇన్ ఇండియా కన్నా క్వాలిటీ ఇన్ ఇండియాకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సుజుకీ మోటార్ కార్పొరేషన్ చైర్మన్, సీఈఓ ఒసాము సుజుకీ చెప్పారు...
సుజుకీ చైర్మన్ ఒసాము సుజుకీ సూచన
న్యూఢిల్లీ: మేక్ ఇన్ ఇండియా కన్నా క్వాలిటీ ఇన్ ఇండియాకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సుజుకీ మోటార్ కార్పొరేషన్ చైర్మన్, సీఈఓ ఒసాము సుజుకీ చెప్పారు. ముఖ్యంగా వాహన విడిభాగాల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తే అమెరికా, చైనాలను తోసిరాజని భారత్ అగ్రస్థానంలో ఉంటుందని వివరించారు. వాహన విడిభాగాల తయారీదారుల భారత సమాఖ్య(ఏసీఎంఏ-ఆటోమోటివ్ కాంపొనెంట్స్ మ్యాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సమావేశంలో ఆయన మాట్లాడారు. విడిభాగాల వ్యాపారంలో వచ్చిన లాభాలను వేరొక విభాగాల్లో కాకుండా... తిరిగి ఆ వ్యాపారంలోనే ఇన్వెస్ట్ చేయాలని ఆయన సూచించారు.