ఈ నెల 27 నుంచి టాటా ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ | Tata group to launch its e-commerce venture on 27 May | Sakshi
Sakshi News home page

ఈ నెల 27 నుంచి టాటా ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్

Published Wed, May 18 2016 1:28 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

Tata group to launch its e-commerce venture on 27 May

ముంబై: టాటా గ్రూప్‌కు చెందిన టాటా యునిస్టోర్ తన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్, టాటా క్లిక్‌ను ఈ నెల 27న ప్రారంభిస్తోంది. వెబ్‌సైట్,  మొబైల్ యాప్‌ల ద్వారా టాటా క్లిక్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని టాటా యునిస్టోర్ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్ ప్రారంభోత్సవం సందర్భంగా దుస్తులు, ఎలక్ట్రానిక్స్, పాదరక్షల కేటగిరిల్లో వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లనిస్తున్నామని పేర్కొంది. రానున్న నెలల్లో మరిన్ని కేటగిరీలకు, బ్రాండ్లకు విస్తరిస్తామని వివరించింది. గత కొన్నేళ్లుగా భారత్‌లో ఈ కామర్స్ జోరుగా పెరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement