న్యూఢిల్లీ: టాటా స్టీల్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,529 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.1,254 కోట్లు)తో పోల్చితే 22% వృద్ధి సాధించామని టాటా స్టీల్ తెలిపింది. వాహన, వ్యాల్యూయాడెడ్ ఉత్పత్తుల విభాగాలు మంచి అమ్మకాలను సాధించడం, ఇన్వెస్ట్‌మెంట్ల విక్రయం వల్ల నికర లాభం పెరిగిందని టాటా స్టీల్ ఎండీ(భారత్, ఆగ్నేయ ఆసియా) టి. వి. నరేంద్రన్ చెప్పారు.
గత క్యూ2లో రూ.35,777 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్) 18% క్షీణించి రూ.29,305 కోట్లకు పడిపోయిందని తెలిపారు. ఉత్పత్తి, డెలివరీలకు సంబంధించి భారత విభాగం కార్యకలాపాలు మంచి వృద్ధిని సాధిం చాయని, యూరోప్ కార్యకలాపాలు ముఖ్యంగా ఇంగ్లండ్‌లో మాత్రం అధ్వానంగా ఉన్నాయన్నారు.
టాటా స్టీల్ నికర లాభం 22 శాతం వృద్ధి..
Published Fri, Nov 6 2015 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement