ఉచితంగా షార్ట్ కోడ్ మెసేజ్లు | Telcos make mobile short code messages, such as bank alerts, free | Sakshi
Sakshi News home page

ఉచితంగా షార్ట్ కోడ్ మెసేజ్లు

Published Wed, Nov 23 2016 1:57 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

ఉచితంగా షార్ట్ కోడ్ మెసేజ్లు

ఉచితంగా షార్ట్ కోడ్ మెసేజ్లు

వచ్చే నెల 31 వరకూ ఇవ్వాలని ఆపరేటర్ల నిర్ణయం
న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో మొబైల్ బ్యాంకింగ్, నగదు రహిత సేవల జోరు పెంచడానికి టెలికం కంపెనీలు షార్ట్ కోడ్ మెసేజ్‌లు ఉచితంగా ఇవ్వనున్నారుు. ఖాతాలో నగదు ఎంత ఉందో చెక్ చేసుకోవడం, విత్‌డ్రాయల్స్, డిపాజిట్లు, నగదు బదిలీలు వంటి మొబైల్ బ్యాంకింగ్ సర్వీసుల కోసం  ఈ షార్ట్ కోడ్ మెసేజ్‌లను ఫీచర్ ఫోన్లలో వినియోగిస్తారు. బ్యాంకింగ్  సర్వీస్‌లకు ప్రధానంగా వినియోగించే ఈ షార్ట్ కోడ్ మెసేజ్‌లను వచ్చే నెల 31 వరకూ ఉచితంగా ఇవ్వాలని  టెలికం సంస్థలు నిర్ణరుుంచారుు. ఈ షార్ట్ కోడ్ మెసేజ్‌ల చార్జీలను టెలికం నియంత్రణ సంస్థ, ట్రాయ్ రూ.1.50 నుంచి 50 పైసలకు తగ్గించిన నేపథ్యంలో టెలికం కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నారుు.

 నగదు కొరత పరిస్థితులను ఎదుర్కొనడానికి డిజిటల్ చెల్లింపులు, నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. ప్రస్తుతం టెలికం కంపెనీలు మొబైల్ బ్యాంకింగ్ సర్వీసుల కోసం కొంత చార్జీ(యూఎస్‌ఎస్‌డీ చార్జీ)ను వసూలు చేస్తున్నాయని టెలికం మంత్రి మనోజ్  సిన్హా ట్వీట్  చేశారు. సగటు మనిషి ఇక్కట్లను తగ్గించడానికి, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సౌకర్యాలను వినియోగించుకోవడానికి వీలుగా టెలికం కంపెనీలు ఈ చార్జీలను రద్దు చేశాయని వివరించారు.

 ఫీచర్ ఫోన్లు ఉపయోగించే పలువురు ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని వచ్చే నెల 31 వరకూ ఉచితంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement