సమాచారమేదైనా ఒక్క ఎస్‌ఎంఎస్‌తో..
సెల్‌కాన్ ఫోన్లలో టెక్స్ట్‌వెబ్ యాప్ స్టోర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్ ప్రముఖ ఎస్‌ఎంఎస్ యాప్ స్టోర్ టెక్స్ట్‌వెబ్‌తో చేతులు కలిపింది. ఇంటర్నెట్ సౌకర్యం లేని బేసిక్ ఫోన్ల నుంచి సైతం ఎస్‌ఎంఎస్ పంపి కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు. వార్తలు, విద్య, ఆరోగ్యం, క్రీడలు, తాజా సమాచారం వంటి 3,500లకుపైగా ఎస్‌ఎంఎస్ యాప్స్‌ను కస్టమర్లు ఎంజాయ్ చేయవచ్చు. ఎస్‌ఎంఎస్, ఫేస్‌బుక్ మెసెంజర్, గూగుల్ టాక్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.
ఉదాహరణకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తాజా స్కోర్ తెలుసుకోవాలంటే యాప్‌లోకి వెళ్లి లేటెస్ట్ క్రికెట్ స్కోర్ అని ఇంగ్లీషులో టైప్ చేస్తే చాలు. ఏ నెట్‌వర్క్ అయినప్పటికీ కస్టమర్లు ఒక్కో ఎస్‌ఎంఎస్‌కు 50 పైసలు, లేదా రోజుకు రూ.1 చెల్లించి ఈ సేవలు పొందవచ్చు. టెక్స్ట్‌వెబ్ ఇక నుంచి తమ మొబైల్స్‌లో ఇన్‌బిల్ట్ ఫీచర్‌గా ఉండనుందని సెల్‌కాన్ ఈడీ మురళి రేతినేని తెలిపారు.