ఇన్‌సైడర్‌.ఇన్‌లో పేటీఎమ్‌కు మెజారిటీ వాటా! | The majority share of PATM in Insider.in! | Sakshi
Sakshi News home page

ఇన్‌సైడర్‌.ఇన్‌లో పేటీఎమ్‌కు మెజారిటీ వాటా!

Published Tue, May 9 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

ఇన్‌సైడర్‌.ఇన్‌లో పేటీఎమ్‌కు మెజారిటీ వాటా!

ఇన్‌సైడర్‌.ఇన్‌లో పేటీఎమ్‌కు మెజారిటీ వాటా!

డీల్‌ విలువ రూ.193 కోట్లు
న్యూఢిల్లీ: డిజిటల్‌  చెల్లింపుల సంస్థ పేటీఎమ్, ముంబైకి చెందిన ఈవెంట్స్, ప్రోపర్టీస్‌కు సంబంధించి టికెటింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ సంస్థ ఇన్‌సైడర్‌డాట్‌ఇన్‌లో వాటా కొనుగోలు చేయనున్నది.

ఇన్‌సైడర్‌డాట్‌ఇన్‌లో మెజారిటీ వాటా కొనుగోలు కోసం పేటీఎమ్‌ సంస్థ 3 కోట్ల డాలర్లు(రూ.193 కోట్లు) వెచ్చించనున్నదని సమాచారం. రానున్న కొన్ని వారాల్లో ఈ డీల్‌కు సంబంధించి ప్రకటన రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై ఇరు సంస్థలు స్పందించలేదు. ఈ డీల్‌ కుదిరితే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యాపారంలో పేటీఎమ్‌ మరింత బలపడుతుంది. బుక్‌మైషో వంటి సంస్థలకు గట్టిపోటీనివ్వగలుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement