జాగ్వార్ కొత్త ఎస్‌యూవీ | The new Jaguar SUV | Sakshi
Sakshi News home page

జాగ్వార్ కొత్త ఎస్‌యూవీ

Published Thu, Sep 3 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

జాగ్వార్ కొత్త ఎస్‌యూవీ

జాగ్వార్ కొత్త ఎస్‌యూవీ

♦ డిస్కవరీ స్పోర్ట్.. నాలుగు వేరియంట్లలో లభ్యం
♦ ధరల శ్రేణి రూ. 46.1 లక్షల నుంచి రూ. 62.18 లక్షలు
 
 ముంబై : టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) సంస్థ కొత్త స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యూవీ)ని బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. డిస్కవరీ స్పోర్ట్ పేరుతో ఈ కొత్త ఎస్‌యూవీని  నాలుగు వేరియంట్లలో అందిస్తున్నామని జేఎల్‌ఆర్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ సూరి చెప్పారు. ఐదు, ఏడు సీట్ల వేరియంట్లలో లభ్యమయ్యే ఈ ఎస్‌యూవీల ధరలు రూ.46.1 లక్షల నుంచి ప్రారంభమవుతాయని, హై ఎండ్ మోడల్ ధర రూ.62.18 లక్షలని(అన్ని ధరలూ ఎక్స్‌షోరూమ్, ముంబై) తెలిపారు. 2.2 లీటర్ 4 సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌తో లభిస్తున్న ఈ ఎస్‌యూవీకి మూడేళ్ల వారంటీని ఇస్తున్నామని వివరించారు.

మార్కెట్లోకి విడుదల చేయకముందే ఈ ఎస్‌యూవీకి 300 వరకూ ముందస్తు బుకింగ్‌లు వచ్చాయని పేర్కొన్నారు. 9 గేర్ల ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఈ ఎస్‌యూవీ ప్రత్యేకత అని పేర్కొన్నారు.  పుణే ప్లాంట్‌లో ఈ ఎస్‌యూవీని తయారు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement