ఫలితాలతో నిరాశ... | The stock market is having its best month in 4 years | Sakshi
Sakshi News home page

ఫలితాలతో నిరాశ...

Published Sat, Oct 31 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

The stock market is having its best month in 4 years

ఐదో రోజూ నష్టాల్లోనే మార్కెట్
* 181 పాయింట్ల నష్టంతో 26,657కు సెన్సెక్స్
* 46 పాయింట్ల నష్టంతో 8,066కు నిఫ్టీ
ముంబై: ఐటీసీ, లార్సెన్ అండ్ టుబ్రో ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేయడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఈ రెండు కంపెనీల ఆర్థిక ఫలితాలతో భారత కంపెనీల ఆర్థిక స్థితిగతులపై తాజాగా ఆందోళనలు తెరమీదకు రావడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్ 181 పాయింట్లు నష్టపోయి 26,657 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 8,066 పాయింట్ల వద్ద ముగిశాయి. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గుతుండడం, బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలు, డాలర్‌తో రూపాయి మారకం తగ్గడం.. ఈ అంశాలు ప్రభావం చూపాయి. క్యాపిటల్ గూడ్స్, వాహన, ఎఫ్‌ఎంసీజీ  షేర్లు నష్టాలపాలయ్యాయి. వరుసగా ఐదో రోజూ స్టాక్ మార్కెట్‌కు నష్టాలొచ్చాయి. ఈ వారంలో సెన్సెక్స్814 పాయింట్లు(3 శాతం), నిఫ్టీ 230 పాయింట్ల (2.84 శాతం)చొప్పున నష్టపోయాయి.
 
లాభాల నుంచి నష్టాల్లోకి...
బీఎస్‌ఈ సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఒక దశలో 105 పాయింట్లు లాభపడింది. ఐటీసీ, ఎల్ అండ్ టీ నిరాశమయ ఫలితాలతో నష్టాల్లోకి జారిపోయింది. చివరకు 181 పాయింట్ల నష్టంతో 26,657 పాయింట్ల వద్ద ముగిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement