న్యూఢిల్లీ: యువతను విశేషంగా ఆకర్శించిన చైనాకు చెందిన టిక్‌టాక్ తాజాగా భారత్, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. సరిహద్దు వివాదాలే కాకుండా, వూహాన్‌లో ఉద్భవించిన కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చైనాపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ యాజమాన్యం చైనా బ్రాండ్‌ను తగ్గించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే టిక్‌టాక్ కేంద్ర కార్యాలయాన్ని లండన్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
అయితే భారత్‌లాగే అమెరికాకు కూడా చైనాతో ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రెండు కీలక దేశాలు టిక్‌టాక్‌ను నిషేదించడంతో సంస్థ తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. అయితే టిక్‌టాక్‌ను యూకేలో కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసే విషయంలో కీలక ముందడుగు పడినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment