కంపెనీల చట్టంపై కేంద్రం సమీక్ష
21న సమావేశం: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కొత్తగా రూపొందించిన 2013 కంపెనీల చట్టంపై ఉన్న ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటామని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తద్వారా చట్టానికి సవర ణలు అవసరమా లేదా అనే విషయాన్ని నిర్దారిస్తామని ఒక చానెల్ తెలి పారు. చట్టానికి సవవరణలు చేయాలని గత కొన్ని నెలలుగా డిమాండ్లు వస్తున్నాయని, అవసరమైతే నిబంధనలను సరళతరం చేయడం, మార్పులు చేపట్టడం వంటి అంశాలపై దృష్టిపెడతామని చెప్పారు. ఈ విషయమై ఈ నెల 21న సంబంధిత వర్గాలతో సమావేశాన్ని నిర్వహించనున్నామని తెలిపారు.
రైల్వేలో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపుపై కసరత్తు
రైల్వే రంగంలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కసరత్తు ప్రారంభించింది. హై స్పీడ్ ట్రెయిన్ సిస్టమ్స్, రవాణా కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడంలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించే దిశగా ముసాయిదా క్యాబినెట్ నోట్ సిద్ధం చేసింది. దీనిపై చర్చించేందుకు మంత్రిత్వ శాఖలకు పంపింది. రైల్వే రంగం వృద్ధికి తోడ్పడేలా ఏయే విభాగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించవచ్చనే అవకాశాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మాస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ మినహా రైల్వే రంగంలో ఎఫ్‌డీఐలకు ఏ రూపంలోనూ అనుమతి లేదు.