బెంగళూరు : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామా పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇన్ఫీకి రాజీనామా చేశారు. సీనియర్ వైస్-ప్రెసిడెంట్ అబ్దుల్ రజక్, ఎడ్జ్ వేర్వే(ప్లాట్‌ఫామ్స్ సబ్సిడరీ) సీఈవో పెర్విందర్ జోహార్‌లు కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్టు తెలిసింది. కొత్త చైర్మన్ నందన్ నిలేకని సారథ్యంలో కంపెనీలో ఈ పునర్వ్యవస్థీకరణ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది. రజక్ కూడా ఎస్‌ఏపీ నుంచి ఇన్ఫోసిస్‌కి వచ్చి చేరిన డజను మంది ఉద్యోగుల్లో ఒకరు. విశాల్ సిక్కా నియామకం తర్వాత ఎస్‌ఏపీలో ఆయన కొలీగ్స్ ఇన్ఫీలో చేరారు.
ప్రస్తుతం విశాల్ సిక్కా ఇన్ఫీ నుంచి బయటికి వెళ్లిపోవడంతో, ఆయనతో పాటు కంపెనీలోకి వచ్చిన ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామాలు చేస్తున్నారు. రజక్ నెలక్రితమే రాజీనామా పత్రాలను సమర్పించినట్టు తెలిసింది. టెక్నాలజీ అధినేత నవీన్ బుధిరాజ్, డిజైన్ అధినేత సంజయ్ రాజగోపాలన్, ఎగ్జిక్యూటివ్ వీపీ రితిక సురి వంటి పలువురు టాప్ అధికారులు ఇటీవల కంపెనీ నుంచి నిష్క్రమించారు. జోహార్ కూడా కంపెనీలో చేరి ఎనిమిది నెలలు కాలేదు. ఆయన కూడా ఇన్ఫీకి గుడ్‌బై చెప్పేశారు. స్టీల్‌వెడ్జ్ సాఫ్ట్‌వేర్ నుంచి ఎడ్జ్‌వేర్వేలో ఆయన జాయిన్ అయ్యారు. ఇన్ఫోసిస్ రెవెన్యూలో ఎడ్జ్‌వేర్వే 5.5 శాతం రెవెన్యూలను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment