Top Executives
-
బంపర్ ఆఫర్: మొబైల్ ఫోన్ అలవెన్స్ ఏడాదికి రూ.2 లక్షలు
ముంబై: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఉన్నతస్థాయిలోని (మేనేజ్మెంట్) ఉద్యోగులు ఒక్కొక్కరికి మొబైల్ ఫోన్లు కొనుగోలుకు వీలుగా ఏడాదికి రూ.2 లక్షలను అలవెన్స్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలను ఈ మేరకు సవరించింది. దీని ప్రకారం ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ మొబైల్ ఫోన్ అలవెన్స్‌కు అర్హులు. సవరించిన నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు బ్యాంక్ ప్రకటించింది. పీఎన్బీలో ఎండీ, సీఈవోకి సహాయం అందించేందుకు ప్రస్తుతం నలుగు రు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. ఇక చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) స్థాయి అధికారికి గతంలో మాదిరే మొబైల్ ఫోన్ అలవెన్స్ కొనసాగనుంది. సీజీఎం రూ.50,000, జీఎం రూ.40,000ను ఫోన్ అలవెన్స్ పొందొచ్చు. -
పేటీఎంకు ఏమైంది? కీలక ఎగ్జిక్యూటివ్‌లు గుడ్ బై!
సాక్షి, ముంబై: డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎంకు భారీ షాక్ తగిలింది. వేల కోట్ల రూపాయల సమీకరణ నిమిత్తం త్వరలో ఐపీవోకు రానున్న తరుణంలో అయిదుగురు కీలక ఎగ్జిక్యూటివ్‌లు సంస్థకు గుడ్ బై చెప్పారు. పేటీఎం అధ్యక్షుడు అమిత్ నాయర్, మరో 4 గురు సీనియర్ అధికారులు ఐపీఓకు ముందు తమ పదవులకు రాజీనామా చేయడం పరిశ్రమ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎంకు ఇప్పటిదాకా ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై చెప్పారు. తాజాగా పేటీఎం అధ్యక్షుడు అమిత్ నాయర్ పదవినుంచి తప్పకున్నారు. మాజీ గోల్డ్‌మన్ సాచ్స్ ఎగ్జిక్యూటివ్ అయిన నయ్యర్ 2019లో పేటీఎం బోర్డులో చేరారు. పేటీఎం ఆర్థిక అనుబంధ సంస్థను నిర్మించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. బోర్డు నయ్యర్ రాజీనామాను బోర్డు ఇప్పటికే అంగీకరించినట్టు తెలుస్తోంది. చీఫ్ హెచ్ ఆర్ ఆఫీసర్ రోహిత్ ఠాకూర్ ఇప్పటికే సంస్థకు గుడ్‌బై చెప్పగా, మరో ముగ్గురు ఉపాధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయడం గమనార్హం. ఈ జాబితాలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్, యూజర్ గ్రోత్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ వీర్, పేటీఎం మార్కెటింగ్హెడ్ జస్కరన్ సింగ్ కపానీ ఉన్నారు. గతంలో యాక్సెంచర్‌లో హెచ్ఆర్ హెడ్‌గా, మైక్రోసాఫ్ట్, జీఈలో నాయకత్వ పాత్రల్లో పనిచేసిన ఠాకూర్ కూడా తప్పుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, జస్కరన్ సింగ్ కపానీ దాదాపు ఆరు సంవత్సరాల తరువాత సంస్థను విడిచిపెట్టి, షావోమి ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా చేరారు. ప్రస్తుతం, పేటీఎం మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ కుమార్ పనిచేస్తున్నారు. అలాగే పేటీఎం ఫస్ట్ హెడ్, పేటీఎం మనీ సీఈఓ, పేటీఎంమాల్ సీఎఫ్ఓ సంస్థ నుంచి వైదొలిగిన ఏడాది తర్వాత హై-ప్రొఫైల్ నిష్క్రమణలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలపై పరిశ్రమ పరిశీలకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేటీఎం దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, పేటీఎం బోర్డులో ఇటీవల మార్పులు జరిగాయి. ప్రధానంగా చైనాకు చెందిన బోర్డు సభ్యులు తప్పు కున్నారు. అలిపే ప్రతినిధి జింగ్ జియాండాంగ్, యాంట్ ఫైనాన్షియల్ గుమింగ్ చెంగ్, అలీబాబా ప్రతినిధులు మైఖేల్ యుయెన్ జెన్ యావో (యుఎస్ పౌరుడు), టింగ్ హాంగ్ కెన్నీ హో బోర్డునుంచి నిష్క్రమించారు. మరోవైపు సామా క్యాపిటల్ అషిత్ రంజిత్ లిలానీ, సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి వికాస్ అగ్నిహోత్రి,అమెరికా పౌరుడు డౌగ్లస్ ఫీజిన్ యాంట్ గ్రూప్ తరపున పేటీఎం బోర్డు డైరెక్టర్లలో చేరారు. అయితే పేటీఎం వాటాదారుల్లో మార్పులు లేవని కంపెనీ ప్రకటించింది. ఈ రాజీనామాలపై వ్యాఖ్యానించేందుకు పేటీఎం నిరాకరించింది. కాగా పేటీఎం 2.3 బిలియన్ డాలర్ల విలువైన ఐపీఓకు డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది. -
సీఈవోకు క్లీన్ చిట్, షేర్లు జూమ్
సాక్షి,ముంబై: అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం భారీగా లాభపడుతున్నాయి.శుక్రవారం మార్కెట్‌ముగిసిన తరువాత ప్రకటించిన క్యూ3 ఫలితాల్లో మెరుగైన లాభాలను సాధించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇన్ఫీ షేర్లలోకొనుగోళ్లకు ఎగబడ్డారు. దీనికితోడు సవరించిన రెవెన్యూ గైడెన్స్, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సీఈవో సహా, ఇతర ఎగ్జిక్యూటివ్‌లకు క్లీన్చిట్ ఇవ్వడం కూడా సెంటిమెంట్‌ను బాగా ప్రభావితం చేసింది. దీంతో 4 శాతానికి ఎగిసిన ఇన్ఫీ షేరు మార్కెట్లో టాప్ విన్నర్‌గా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఐటీ మేజర్ ఊహించిన దానికంటే మెరుగైన లాభాలను సాధించింది. జనవరి 10న ప్రకటించిన ఫలితాల్లో 2019 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో లాభం 23 శాతం ఎగిసి రూ .4,466 కోట్ల నమోదు చేసింది. ఆదాయం 7.95 శాతం పెరిగి రూ .23,092 కోట్లకు చేరింది. దీనికి తోడు భారీ ఆర్డర్లు లభించడంతో 2020 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ గైడెన్స్ 10 -10.5 శాతానికి సవరించింది. మరోవైపు సంస్థలో ఆర్థిక తప్పులు, దుష్ప్రవర్తనకు సంబంధించి బోర్డు ఆడిట్ కమిటీకి ఎలాంటి ఆధారాలు లభించలేదని సంస్థ తేల్చి చెప్పింది. 2019 అక్టోబర్ 21న విజిల్ బ్లోయర్ ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలంజన్ రాయ్ అనైతిక పద్ధతులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన సంస్థ తాజాగా ఈ విషయాలను సంస్థ వెల్లడించింది. -
ఫ్లిప్‌కార్ట్‌లో ఏం జరుగుతోంది? ఉద్యోగాల కోత?
దేశంలో ఆన్లైన్ కామర్స్‌లో ఫ్లిప్‌కార్ట్, అంతర్జాతీయ రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మధ్య డీల్ ఇండస్ట్రీలో ఓ సంచలనం. సుమారు ఆరు నెలల క్రితం ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటాను(80శాతం) వాల్‌మార్ట్ కొనుగోలు చేయడంతో అమెజాన్ లాంటి గట్టి ప్రత్యర్థులకు ఎదురు దెబ్బేనని అంచనాలు కూడా భారీగానే వచ్చాయి. అయితే ఇంతలోనే ఫ్లిప్‌కార్ట్‌లో తనవాటా మొత్తాన్ని అమ్ముకొని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సల్ రాజీనామా చేసి వెళ్లిపోవడం ఊహించని పరిణామం. కానీ మరో ఫౌండర బిన్నీ బన్సల్ మాత్రం సీఈవోగా కొనసాగారు. ఇది ఇలా ఉండగానే మరో కీలక పరిణామం చోటు చేసుసుకుంది. తీవ్రమైన లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ పదవినుంచి వైదొలిగారు. వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలు, స్వతంత్ర దర్యాప్తు అనంతరం ఆయన రాజీనామాను ఆమోదించామని వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ సంయుక్తంగా ప్రకటించాయి. ఈ అనూహ్య పరిణామం నుంచి ఇంకా తేరుకోక ముందే అదే సంస్థలో భాగమైన మింత్ర సీఈఓ అనంత నారాయణన్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) దీపంజన్ బసు తమ రాజీనామా సమర్పించారన్న వార్తలు కార్పొరేట్ ప్రపంచాన్ని విస్మయ పరిచాయి. బిన్సీ బన్సల్ సంస్థను వీడిన అనంతరం ఫ్లిప్‌కార్ట్ గ్రూపునకు కళ్యాణ్ కృష్ణమూర్తి సీఈవోగా ఎంపికయ్యారు. అయితే ఇంతలోనే బిన్సీకి సన్నహితుడైన అనంత నారాయణన్ కూడా రిజైన్ చేశారనీ, ఈ మేరకు ఆయన రాజీనామాను కొత్త సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తికి పంపించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వార్తలను అనంత్ నారాయణన్ ఖండించారు. ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూనిట్లు మింత్రా-జబాంగ్‌లకు చీఫ్‌గా కొనసాగుతానని స్పష్టం చేశారు. అవన్నీ పుకార్లేనని నారాయణన్ కొట్టి పారేశారు. ఉద్యోగాల కోత వాల్‌మార్ట్ డీల్ అనంతరం సంస్థ పునరుద్ధరణ, ఇతర ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా గుర్గావ్లోని జబాంగ్‌లో 40-50శాతం ఉద్యోగులపై వేటు వేయనుంది. దాదాపు 2వందలనుంచి 250మంది దాకా ఉద్యోగులను తొలగించనుంది. మింత్రా-జబాంగ్ సంయుక్తంగా బెంగళూరు నుంచి కార్యకలాపాలను నిర్వహించనున్న నేపథ్యంలో బెంగళూరుకు షిప్ట్ కావడానికి ఇష్టపడని ఉద్యోగులను కూడా మూడు నెలల జీతం, గ్రాట్యుయిటీ, ప్రతీ ఏడాదీ 15రోజుల జీతం చెల్లించి మరీ ఇంటికి పంపిస్తోందట. బిన్సీ రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే ఈ పరిణామం. గ్రూపు సీఈవో పదవి రద్దు బన్సల్ రాజీనామా తరువాత అసలు గ్రూప్ సీఈవో పదవినే రద్దు చేసి కొత్త నిర్మాణ వ్యవస్థపై వాల్‌మార్ట్ నియంత్రణలోని ఫ్లిప్‌కార్ట్ యోచిస్తోందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. టాప్ ఎగ్జిక్యూటివ్స్ రాజీనామా? ఇది ఇలా ఉంటే ఫ్లిప్‌కార్ట్‌లో అంతర్గత సమస్యలు ముదురుతున్నాయనీ, దీంతో టాప్ గ్జిక్యూటివ్లు రాజీనామా బాట పడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో మింత్రా సీఈఓ, సీఎఫ్ఓ కంపెనీకి గుడ్‌బై చెప్పారని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడాయి. ఫ్లిప్‌కార్ట్‌లో భాగమైన జబాంగ్ సీఈఓ గుంజన్ సోనీ కూడా ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటూ కంపెనీ స్ట్రాటజీ అండ్ కేటగిరీ బిజినెస్ హెడ్ అనన్య త్రిపాఠీ కూడా కంపెనీకి గుడ్ బై చెప్పడంతో అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగులంతా రాజీనామా బాట పడుతోంటే ఫిప్కార్ట్ పరిస్థితి ఏమిటి అనేది చర్చనీయాంశమైంది. అలాగే స్వతంత్ర విచారణలో బిన్సీ తప్పు నిరూపితం కాలేదని ప్రకటించిన వాల్‌మార్ట్, అతని రాజీనామాను ఎందుకు ఆమోదించింది అనేది అనేక అనుమానాలను రేకెత్తించింది. అయితే వివాహేతర సంబంధం ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కొత్త నియామకం ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో కీలక నియామకాన్ని చేపట్టింది. దాదాపు 18నెలలుగా ఖాళీగా ఉన్న టాప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ను భర్తీ చేసింది. ఫ్లిప్‌కార్ట్ చీఫ హెచ్ఆర్గా సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్‌లో పనిచేసిన స్మృతిసింగ్ను నియమించినట్టు తెలుస్తోంది. డిసెంబరు నుంచి స్మృతి సింగ్బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటివరకూ ఈ బాధ్యతలను కూడా ప్రస్తుత సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తే నిర్వర్తించారు. కాగా జబాంగ్ కాంట్రిబ్యూషన్ లేని కారణంగా2018 సంవత్సరానికి సంబంధించి మింత్ర ఆదాయ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైంది. దీంతో ఇకపై స్వతంత్రగా వ్యవహరించాలని మింత్రా భావిస్తోందట. దీనిపై కూడా త్వరలోనే ఒక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. 2016, జులైలో జబాంగ్ మింత్రాలో విలీనమైంది. ఈ ఊహాగానాలపై ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
ఇన్ఫీలో టాప్-పెయిడ్ ఎగ్జిక్యూటివ్‌లు వీరే!
దేశీయ రెండో అతిపెద్ద టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్‌లకు భారీగానే వేతనం ఇస్తోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో తన కంపెనీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్, ఎండీ రంగనాథ్ పరిహారం 60 శాతానికి పైగా జంప్ అయినట్టు ఇన్ఫోసిస్ పేర్కొంది. అధ్యక్షుడు మోహిత్ జోషికి కూడా 50 శాతానికి పైగా పరిహారాలు పెరిగినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీలో అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌లు ఎవరో ఓ సారి తెలుసుకుందాం... సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈవో... విశాల్ సిక్కా రాజీనామా అనంతరం ఇన్ఫోసిస్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సలీల్ పరేఖ్ వార్షిక వేతనంగా రూ.18.6 కోట్లను అందుకుంటున్నట్టు తెలిసింది. దీనిలోనే వేరియబుల్ కాంపొనెంట్ కూడా ఉంది. ఎండీ రంగనాథ్, ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ... 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ సీఎఫ్ఓగా ఉన్న రంగనాథన్ వేతనం గత ఆర్థిక సంవత్సరం కంటే 68 శాతం మేర పెరిగింది. ఈయన తన వేతనంగా రూ.4.7 కోట్లను పొందినట్టు కంపెనీ తెలిపింది. మోహిత్ జోషి, ఇన్ఫోసిస్ అధ్యక్షుడు... 2017-18 ఆర్థిక సంవత్సరంలో మోహిత్ జోషి వేతనం 52 శాతం పెరిగింది. దీంతో ఆయన రూ.6.8 కోట్లను వేతనంగా ఆర్జించారు. రవి కుమార్, ఇన్ఫోసిస్ డిప్యూటీ సీఓఓ... కుమార్ వేతనం 2016-17 కంటే గతేడాది 36 శాతం పెరిగింది. దీంతో ఈయన వేతనం కూడా రూ.7 కోట్లకు ఎగిసింది. క్రిష్ శంకర్, ఇన్ఫోసిస్ గ్రూప్ హెచ్ఆర్ హెడ్.... శంకర్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.3.7 కోట్ల వేతనం ఆర్జించారు. యూబీ ప్రవీణ్ రావు, ఇన్ఫోసిస్ సీఓఓ... రావు వేతనం 2017-18 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం పెరిగి రూ.7.8 కోట్లకు ఎగిసినట్టు కంపెనీ తెలిపింది. -
నీరవ్ కంపెనీకి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు టా..టా
సాక్షి, ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకు కుంభకోణంగా నిలిచిన పీఎన్బీ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి చెందిన ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ కంపెనీ బోర్డుకు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్ బై చెప్పారు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన సంజయ్ రిషి పెప్సికో మాజీ ఎగ్జిక్యూటివ్ గౌతమ్ ముక్కావిల్లి, విప్రో మాజీ సీఎఫ్‌వో సురేష్ సేనాపతి ఉన్నారని విశ్వనీయ వర్గాల సమాచారం. అమెరికాలోని ఫైర్‌స్టార్ సీనియర్ అమెరికా అడ్వైజరీ ఫేస్బుక్ ఇండియా మాజీ ఎండీ క్రితికా రెడ్డి రాజీనామా చేశారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. -
ఇన్ఫీకి మరో ఇద్దరు గుడ్‌బై
బెంగళూరు : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామా పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇన్ఫీకి రాజీనామా చేశారు. సీనియర్ వైస్-ప్రెసిడెంట్ అబ్దుల్ రజక్, ఎడ్జ్ వేర్వే(ప్లాట్‌ఫామ్స్ సబ్సిడరీ) సీఈవో పెర్విందర్ జోహార్లు కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్టు తెలిసింది. కొత్త చైర్మన్ నందన్ నిలేకని సారథ్యంలో కంపెనీలో ఈ పునర్వ్యవస్థీకరణ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది. రజక్ కూడా ఎస్ఏపీ నుంచి ఇన్ఫోసిస్‌కి వచ్చి చేరిన డజను మంది ఉద్యోగుల్లో ఒకరు. విశాల్ సిక్కా నియామకం తర్వాత ఎస్ఏపీలో ఆయన కొలీగ్స్ ఇన్ఫీలో చేరారు. ప్రస్తుతం విశాల్ సిక్కా ఇన్ఫీ నుంచి బయటికి వెళ్లిపోవడంతో, ఆయనతో పాటు కంపెనీలోకి వచ్చిన ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామాలు చేస్తున్నారు. రజక్ నెలక్రితమే రాజీనామా పత్రాలను సమర్పించినట్టు తెలిసింది. టెక్నాలజీ అధినేత నవీన్ బుధిరాజ్, డిజైన్ అధినేత సంజయ్ రాజగోపాలన్, ఎగ్జిక్యూటివ్ వీపీ రితిక సురి వంటి పలువురు టాప్ అధికారులు ఇటీవల కంపెనీ నుంచి నిష్క్రమించారు. జోహార్ కూడా కంపెనీలో చేరి ఎనిమిది నెలలు కాలేదు. ఆయన కూడా ఇన్ఫీకి గుడ్‌బై చెప్పేశారు. స్టీల్వెడ్జ్ సాఫ్ట్వేర్ నుంచి ఎడ్జ్వేర్వేలో ఆయన జాయిన్ అయ్యారు. ఇన్ఫోసిస్ రెవెన్యూలో ఎడ్జ్వేర్వే 5.5 శాతం రెవెన్యూలను అందిస్తోంది. -
ఇరకాటంలో పడ్డ స్నాప్ డీల్
న్యూఢిల్లీ : ఇప్పటికే నిధుల రాక తీవ్ర సంక్షోభంలో కొనసాగుతున్న దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ ఇప్పుడు మరో ఇరకాటంలో పడింది. స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బహల్, మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లపై క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది. దీనిపై వారికి కోర్టు సమన్లు పంపింది. ఈ-ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలుదారులను, విక్రయదారులను కనెక్ట్ చేసే ఐడియాను అనధికారికంగా స్నాప్ డీల్ సంస్థ, దాని అధికారులు వాడుకుంటున్నారంటూ గౌరవ్ దువా అనే వ్యాపారవేత్త ఆరోపించారు. ఈ ఆరోపణలు చేస్తూ స్నాప్ డీల్, ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌లపై క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. నాన్-ఇన్వెంటరీ మార్కెట్ ప్లేస్ మోడల్ ఐడియా తనదేనని వ్యాపారవేత్త చెప్పారు. ఐపీసీ సెక్షన్లు 420 మోసం, 406 నమ్మకానికి భంగం కలిగించడం, 120బీ నేరపూరిత కుట్ర కింద తన ఫిర్యాదును దాఖలు చేశారు. అయితే ఈ కేసును ట్రయల్ కోర్టు తోసిపుచ్చగా.. సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ ను ఆ వ్యాపారవేత్త వేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి, సంస్థ సీఈవో కునాల్‌కి, సీఓఓ రోహిత్ బన్సాల్, మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ విజయ్ అజ్మేరాకు అడిషనల్ సెషన్స్ జడ్జి ఆర్కే త్రిపాఠి నోటీసులు జారీచేశారు. ఫిర్యాదు ప్రకారం దువా, ఇంజనీర్, వ్యాపారవేత్త. 1999లో మార్కెట్స్ఢిల్లీ.కామ్ ను, 2005లో ఇండియారిటైల్.కామ్ ను స్థాపించారు. డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలను రిటైల్ కమ్యూనిటీకి అందించడానికి ఆయన వీటిని తీసుకొచ్చారు. అయితే నాన్-ఇన్వెంటరీ హోల్డింగ్ మార్కెట్ ప్లేస్ మోడల్ ను తీసుకొచ్చిన తనని, స్నాప్‌డీల్ అధికారులు మోసం చేశారని ఆరోపించారు. తన బిజినెస్‌లలో పెట్టుబడులు పెడుతూ తనని చీట్ చేసినట్టు పేర్కొన్నారు. -
టాప్ టెక్ దిగ్గజ సీఈవోలకు ట్రంప్ పిలుపు
టాప్ టెక్ దిగ్గజాలు ఆల్ఫాబెట్ ఇంక్, ఫేస్బుక్, అమెజాన్, మైక్రోసాప్ట్, ఇంటెల్, ఒరాకిల్ వంటి కంపెనీల సీఈవోలు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కాబోతున్నారు. బుధవారం న్యూయార్క్ సిటీ, ట్రంప్ టవర్స్‌లో జరుగబోయే సదస్సుకు ఈ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లకు ఆహ్వానం అందినట్టు రీకోడ్ రిపోర్టు చేసింది. టెక్ లీడర్లతో ట్రంప్ ఈ భేటీ నిర్వహిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ భేటీలో పాల్గొనబోయే కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు డజను కంటే తక్కువగానే ఉంటారని తెలుస్తోంది. టెక్ పరిశ్రమలో దిగ్గజాలుగా ఉన్న కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు మాత్రమే ఈ భేటీకి వెళ్తున్నాయని రీకోడ్ తెలిపింది. బిలీనియర్, టెస్లా మోటార్స్ ఇంక్ సీఈవో ఎలోన్ మస్క్ కూడా ఈ భేటీకి హాజరుకాబోతున్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. సంబంధిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్టు పేర్కొంది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తోనే తాముంటామని, ఎలాంటి సహాయం కావాలన్నా తమకు సాధ్యమైన రీతిలో సాయం చేయడానికి తోడ్పడతామని సదస్సులో చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ఒరాకిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సఫ్రా కాట్జ్ ఓ ఈ-మెయిల్ ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ట్రంప్ ట్యాక్స్ కోడ్‌ను సవరించి, నిబంధనలు సడలించి, మంచి వాణిజ్య ఒప్పందాలను ఏర్పరిస్తే, అమెరికా టెక్నాలజీ కమ్యూనిటీ మరింత బలమైనదిగా రూపాంతరం చెందుతుందని, ముందస్తు కంటే ఇంకా ఎక్కువగా పోటీ వాతావరణం పెరుగుతుందని ఆయన చెప్పారు. అమెజాన్.కామ్ ఇంక్ సీఈవో, వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా ఈ మీటింగ్‌కు ఆహ్వానం అందిందని, ఆయన కూడా హాజరుకానున్నారని రీకోడ్ చెప్పింది. ఫేస్బుక్, ఆపిల్, అమెజాన్, ఆల్ఫాబెట్లు వెంటనే ఈ విషయంపై స్పందించ లేదు. ఇంటెల్, మైక్రోసాప్ట్ అధికార ప్రతినిధులైతే ఈ విషయంపై మాట్లాడటానికే నిరాకరించారు. వలస విధానంలో సవరణలు నుంచి సామాజిక ఆందోళనలు వరకు అన్నీ విషయాలను ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలోనే ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలను వ్యతిరేకించే వారు తమ అభిప్రాయాలను తెలుపనున్నారు. అయితే ఉబర్ సీఈవో ట్రావిస్ కలానిక్, నెట్‌ఫ్లిక్స్ సీఈవో రీడ్ హేస్టింగ్స్, సేల్ఫోర్స్ సీఈవో మార్క్ బెనిఒఫ్ఫ్, డ్రాప్‌బాక్స్ సీఈవో డ్రూ హోస్టన్, ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సేలు ఈ సదస్సుకు హాజరుకావడం లేదని తెలుస్తోంది.