వాషింగ్టన్: చైనాతో అమెరికా వాణిజ్య పోరు అగ్ర దేశంలో ఉద్యోగాలకు గండి కొడుతోంది. ఆగస్ట్ నెలలో ఏకంగా 10,000కు పైగా ఉగ్యోగులను కేవలం వాణిజ్య యుద్ధంతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగానే అమెరికన్ కంపెనీలు తొలగించుకోవాల్సి వచ్చినట్టు గ్రే అండ్ క్రిస్‌మస్ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు 2009 ఆగస్ట్ తర్వాత... ఇంతగా ఉద్యోగుల తొలగింపు ఈ ఏడాది ఆగస్ట్‌లోనే జరిగినట్టు గ్రే అండ్ క్రిస్‌మస్ సంస్థ అంటోంది.
జూలైతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్ట్‌లో ఉగ్యోగాల కోత 38 శాతం పెరిగింది. మొత్తం మీద 53,480 మందిని పేరోల్స్ నుంచి తొలగించాయి. వాణిజ్య యుద్ధం, టారిఫ్‌ల ప్రభావం కంపెనీలపై చూపించడం ఆరంభమైందని గ్రే అండ్ క్రిస్‌మస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ యాండ్ర్యూ చాలెంజర్ పేర్కొన్నారు. తమ ఉత్పత్తులు, సేవలకు డిమాండ్ తగ్గడంతో ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నాయని చెప్పారు. అయితే, అమెరికాలో నిరుద్యోగ రేటు అన్నది చారిత్రకంగా కనిష్ట స్థాయిల్లోనే ప్రస్తుతానికి ఉండడం గమనార్హం. కాకపోతే నూతన ఉద్యోగాల కల్పన తగ్గింది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా చైనాతో అమెరికా వాణిజ్య పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment