వాహన ఎక్సైజ్ రాయితీ పొడిగింపు!
న్యూఢిల్లీ: వాహనాలపై ఇస్తున్న ఎక్సైజ్ సుంకం రాయితీని పొడిగించాలని ప్రభుత్వం యోచి స్తోంది. ఈ విషయమై ఇప్పటికే చర్చించామని భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు. వాహన పరిశ్రమకు ఉత్తేజాన్నిచ్చే చర్యలు చేపట్టనున్నామని, దీంట్లో భాగంగానే వాహన రీకాల్ విధానాన్ని రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఏసీఎంఏ సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఎక్సైజ్ సుంకం రాయితీని వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించాలని కోరుతూ భారీ పరిశ్రమల శాఖ ఒక ప్రతిపాదననను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపనున్నదని సమాచారం.
అమ్మకాల్లేక కుదేలవుతున్న వాహన రంగానికి ఊరటనివ్వడానికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకంలో కోత విధించింది. జూన్ వరకూ ఉన్న ఈ రాయితీని ఆ తర్వాత డిసెంబర్ వరకూ పొడిగిం చారు. తాజాగా దీనిని వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించే అవకాశాలున్నాయి. కాగా ఈ ఎక్సైజ్ సుం కం తగ్గింపు ప్రయోజనాలను పలు వాహన కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేశాయి. ఫలితంగా వాహ న విక్రయాలు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి.
ఖాయిలా పీఎస్‌యూల కోసం కమిటీ
ఖాయిలా పడ్డ ప్రభుత్వ రంగ సంస్థల పునరుజ్జీవనానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని గీతే వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై చర్చించడానికి ఎన్‌టీపీసీ చైర్మన్ ఆరుప్ రాయ్ చౌధురి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కమిటీ రెండు నెలల్లో నివేదికను సమర్పిస్తుందని తెలిపారు.