Anant gite
-
లిథియమ్ బ్యాటరీల తయారీ కోసం నిధి
న్యూఢిల్లీ: లిథియమ్ బ్యాటరీల తయారీని ప్రోత్సహించడానికి టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నామని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వ్యయాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో పావు శాతం వ్యయం లిథియమ్ బ్యాటరీలదేనని, ఇవి తగినంతగా భారత్‌లో తయారు కావడం లేదని పేర్కొన్నారు. వీటిని ఎగుమతి చేసుకుంటే వ్యయాలు మరింత పెరుగుతాయని వివరించారు. -
కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోను: అనంత్ గీతే
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం నుంచి తాను వైదొలగబోనని శివసేన నేత, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విచ్ఛిన్నమైనప్పటికీ.. తమ పార్టీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కొనసాగుతుందని చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆయన పై విధంగా స్పందించారు. అనంత్ గీతే శివసేన నుంచి కేంద్ర కేబినెట్లో ఏకైక మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకంపై ఏర్పడిన ప్రతిష్టంభనతో శివసేనతో పొత్తును బీజేపీ వదులుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నుంచి శివసేన తప్పుకుం టుందని ఊహాగానాలు వినిపించాయి. దీనిపై గీతే స్పందిస్తూ.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో శివసేన కీలక పాత్ర పోషించిందని, అందువల్లే రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత బీజేపీ, శివసేన కలిసే అవకాశం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు. -
వాహన ఎక్సైజ్ రాయితీ పొడిగింపు!
న్యూఢిల్లీ: వాహనాలపై ఇస్తున్న ఎక్సైజ్ సుంకం రాయితీని పొడిగించాలని ప్రభుత్వం యోచి స్తోంది. ఈ విషయమై ఇప్పటికే చర్చించామని భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు. వాహన పరిశ్రమకు ఉత్తేజాన్నిచ్చే చర్యలు చేపట్టనున్నామని, దీంట్లో భాగంగానే వాహన రీకాల్ విధానాన్ని రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఏసీఎంఏ సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఎక్సైజ్ సుంకం రాయితీని వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించాలని కోరుతూ భారీ పరిశ్రమల శాఖ ఒక ప్రతిపాదననను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపనున్నదని సమాచారం. అమ్మకాల్లేక కుదేలవుతున్న వాహన రంగానికి ఊరటనివ్వడానికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకంలో కోత విధించింది. జూన్ వరకూ ఉన్న ఈ రాయితీని ఆ తర్వాత డిసెంబర్ వరకూ పొడిగిం చారు. తాజాగా దీనిని వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించే అవకాశాలున్నాయి. కాగా ఈ ఎక్సైజ్ సుం కం తగ్గింపు ప్రయోజనాలను పలు వాహన కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేశాయి. ఫలితంగా వాహ న విక్రయాలు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. ఖాయిలా పీఎస్‌యూల కోసం కమిటీ ఖాయిలా పడ్డ ప్రభుత్వ రంగ సంస్థల పునరుజ్జీవనానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని గీతే వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై చర్చించడానికి ఎన్టీపీసీ చైర్మన్ ఆరుప్ రాయ్ చౌధురి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కమిటీ రెండు నెలల్లో నివేదికను సమర్పిస్తుందని తెలిపారు.