కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోను: అనంత్ గీతే | Anant Geete rules out resignation | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోను: అనంత్ గీతే

Published Thu, Oct 2 2014 2:03 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

Anant Geete rules out resignation

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం నుంచి తాను వైదొలగబోనని శివసేన నేత, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విచ్ఛిన్నమైనప్పటికీ.. తమ పార్టీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కొనసాగుతుందని చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆయన పై విధంగా స్పందించారు. అనంత్ గీతే శివసేన నుంచి కేంద్ర కేబినెట్‌లో ఏకైక మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకంపై ఏర్పడిన ప్రతిష్టంభనతో శివసేనతో పొత్తును బీజేపీ వదులుకుంది.

ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నుంచి శివసేన తప్పుకుం టుందని ఊహాగానాలు వినిపించాయి. దీనిపై గీతే స్పందిస్తూ.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో శివసేన కీలక పాత్ర పోషించిందని, అందువల్లే రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత బీజేపీ, శివసేన కలిసే అవకాశం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement