లిథియమ్ బ్యాటరీల తయారీ కోసం నిధి
న్యూఢిల్లీ: లిథియమ్ బ్యాటరీల తయారీని ప్రోత్సహించడానికి టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నామని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వ్యయాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో పావు శాతం వ్యయం లిథియమ్ బ్యాటరీలదేనని, ఇవి తగినంతగా భారత్‌లో తయారు కావడం లేదని పేర్కొన్నారు. వీటిని ఎగుమతి చేసుకుంటే వ్యయాలు మరింత పెరుగుతాయని వివరించారు.