వొడాఫోన్ ఐపీఓకు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల ఎంపిక
ముంబై: టెలికా దిగ్గజం వొడాఫోన్ ఇండియా 2 బిలియన్ డాలర్ల తొలి పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) కోసం ఆరు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు ఎంపికయ్యాయి. ఈ భారీ షేర్ ఆఫర్‌కు జాయింట్ గ్లోబల్ కో ఆర్డినేటర్లుగా కొటక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్, యూబీఎస్‌లను ఇండియా సబ్సిడరీకి బ్రిటన్ మాతృసంస్థ అయిన వొడాఫోన్ ఎంపికచేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జాయింట్ బుక్న్న్రర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, హెచ్‌ఎస్‌బీసీ, డాయిష్ బ్యాంక్‌లను నియమించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.