సాక్షి, ముంబై : ఒకవైపు అధిక పన్నుల చెల్లింపు, మరోవైపు జియో రాకతో భారత టెలికాం పరిశ్రమలోని ఇతర నెట్‌వర్క్ కంపెనీలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్- ఐడియా కంపెనీలు ఆర్ధికంగా తీవ్ర నష్టాలకు గురయ్యాయి. ఒక రకంగా టెలికాం పరిశ్రమలో సంక్షోభం తలెత్తే పరిస్థితులు కనిపించాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్ సూచనల ప్రకారం డిసెంబర్ నుంచి చార్జీలు పెంచుతామని ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వరుసలో జియో కూడా పయనిస్తోంది.
ఇప్పటివరకు అత్యంత చౌకగా కాల్స్, డాటా సౌకర్యాన్ని ఇచ్చిన జియో కూడా చార్జీలను పెంచనుంది. ఈ మేరకు జియో కంపెనీ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సూచనల ప్రకారం పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తాము కూడా చార్జీలను పెంచుతున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే వినియోగదారులపై అధిక భారం పడకుండా చూసుకుంటామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment