ముంబై : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగే దెబ్బ ఇటు ఆర్థిక వ్యవస్థలతో పాటు అటు కార్ల కంపెనీలపై పడనుంది. టాటా మోటార్స్ యూకే సబ్సిడిరీ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) కార్యకలాపాలపై ఈ ప్రభావం ఉండనుందని ఈ కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. సంస్కరించబడిన యూరోపియన్ యూనియన్ లో యూకే మెంబర్ షిప్ కొనసాగించడంపై జేఎల్ఆర్ మద్దతు పలుకుతోంది. అయితే బ్రిటన్ ఎగ్జిట్ తో ఏదైనా మార్పు సంభవిస్తే తమ కార్ల అమ్మకాలు, ఖర్చులు, స్కిల్ బేస్ పై తీవ్ర ప్రభావం పడనుందని పేర్కొన్నారు. 23 జూన్ లో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ పై రెఫరాండంలో యూకే ఎలక్ట్రోరేట్ కూడా పాల్గొననుంది. ఇప్పటికే ఈ ఫలితాలు స్టాక్ మార్కెట్లపైనా, కరెన్సీలపై, గ్లోబల్ ఎకనామీలపై, కార్పొరేట్లపై ఎఫెక్ట్ చూపనున్నాయని ఆర్థికవేత్తలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఈవెంట్ ను టాటా మోటార్స్ పెట్టుబడిదారులు దగ్గరగా పర్యవేక్షిస్తున్నారని జేఎల్ఆర్ పేర్కొంది. ఏదైనా మార్పు సంభవిస్తే కొంత ప్రతికూల ప్రభావమే చూపొచ్చని తెలిపింది. ఇప్పటివరకూ యూరోపియన్ యూనియన్ లో ఉత్పత్తులకు ఫ్రీ మూవ్ మెంట్ ఎక్కువగా కలిగి ఉన్నాయని, దీంతో యూరోపియన్ దేశాల్లో కార్లను అమ్మినందుకు జేఎల్ఆర్ ఎటువంటి టారిఫ్ లను చెల్లించలేదని చెప్పింది. ఈ ఈవెంట్ జేఎల్ఆర్ పై నెగిటివ్ ప్రభావం చూపే అవకాశాలున్నాయని, ఆర్థికలోటు పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూకే వృద్ధి తక్కువ నమోదవుతుందని , ఉద్యోగాలు తగిన స్థాయిలో ఉండక పడిపోతాయని పేర్కొంటున్నారు. వలసదారులపై ఆంక్షలు పెరుగుతాయని, దీంతో నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను కంపెనీ కోల్పోయే ప్రమాదం ఉందని స్థానిక బ్రోకరేజ్ సంస్థలు పేర్కొంటున్నాయి. బ్రిగ్జిట్ మొదలైనప్పటి నుంచి గ్రేట్ బ్రిటీష్ పౌండ్ క్షీణిస్తుంది. ఒకవేళ బ్రిటన్ వైదొలిగితే మరింత పడిపోయే అవకాశాలున్నాయి. ఈ క్షీణతతో ఎగుమతుల వల్ల కొంత ప్రయోజనం చేకూరినా.. కంపెనీ దిగుమతుల బిల్లు మాత్రం పెరిగిపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
జాగ్వార్ పై బ్రిగ్జిట్ దెబ్బ..!
Published Mon, Jun 20 2016 1:19 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement
Advertisement