సాక్షి, ముంబై: దేశీయ మూడవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో లిమిటెడ్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మంగళవారం ప్రకటించిన రెండవ త్రైమాసిక ఫలితాల్లో ఆరుశాతం లాభాన్ని నమోదు చేసింది. రూ. 13,469 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఐటి సేవల ఆదాయం రూ. 13,169 కోట్లుగా నమోదు చేసింది. బ్యాంకింగ్ , ఆర్థిక సేవల విభాగంలో పెరుగుదల ఈ త్రైమాసిక లాభాలకు మద్దతు ఇచ్చిందని విప్రో వెల్లడించింది.
సెప్టెంబర్ 30 తో ముగిసిన మూడు నెలల ఫలితాల్లో లాభం రూ. 2,192 కోట్ల (337.5 మిలియన్ డాలర్లు)కు పెరిగింది. గత ఏడాది ఇదే కాలానికి రూ. 2,067 కోట్ల లాభాన్ని విప్రో ప్రకటించింది. కాగా కంపెనీ సగటున రూ. 2,080 కోట్లు సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment