యోగి మహిమ: ఆ స్టాక్ దూసుకెళ్తోంది!
ఇటీవల దలాల్ స్ట్రీట్లో కొన్ని స్టాక్స్ భారీగా దూసుకెళ్తున్నాయి. లిస్టింగ్ రోజే బంపర్ రికార్డులు మోత మోగిస్తున్నాయి. అదే బాటలో యోగి మహిమతో ఓ స్టాక్ సంచలనాలు సృష్టిస్తుందట. అది వెంకీస్(ఇండియా) లిమిటెడ్. ఇండియాలో లిస్టు అయిన ఏకైక ఫౌల్ట్రీ సంస్థ. ఈ స్టాక్లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారి పెట్టుబడులు కేవలం 73 సెషన్స్లోనే 2.80 లక్షల రూపాయలకు ఎగిశాయని వెల్లడైంది. ఈ స్టాక్ ఇంతలా పైకి పెరగడానికి ప్రధాన కారణం ఉత్తరప్రదేశ్ ఇటీవల ఎన్నికైన కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథేటన. అక్రమ కబేళాలపై యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యలు ఈ స్టాక్కు బూస్టు ఇస్తున్నాయని విశ్లేషకులంటున్నారు.
ఫౌల్ట్రీ, ఫౌల్ట్రీ ప్రొడక్ట్లు, పశువుల ఆరోగ్యం, నూనె గింజలు వంటి ఉత్పత్తులను వెంకీస్ ఇండియా విక్రయిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యా అక్రమ కబేళాలపై తీసుకుంటున్న చర్యలతో నార్త్ ఇండియాలో చిక్కెన్ ధరలు చుక్కలు చూస్తున్నాయి. దీంతో ఆ స్టాక్ కూడా 180 శాతం పైకి ఎగిసి 1,244 రూపాయలుగా నమోదైంది. యూపీ, ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఫౌల్ట్రీ ధరలు కేజీకి 180 రూపాయలు నుంచి 240 రూపాయలు పెరిగాయని తెలిసింది. గత కొన్ని త్రైమాసికాలుగా ఈ స్టాక్ విదేశీ పెట్టుబడిదారులకూ ఇష్టంగా మారిందని విశ్లేషకులు చెప్పారు. వెంకీస్ ఇండియా ఆర్జించే సగానికి పైగా రాబడులు ఫౌల్ట్రీ బిజినెస్ల నుంచే వస్తున్నాయట.