సాక్షి, చిత్తూరు: జిల్లాలోని బీఎన్ కండ్రిగ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో గాయపడిన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను బీఎన్ కండ్రిగ మండలం వీఎస్‌పురం వాసులుగా గుర్తించారు. చనిపోయిన వారిని వెంకటరమణయ్య, అనంత్, బింధు, రామారావుగా గుర్తించారు. గాయపడ్డవారిని తిరుపతిలోని రుయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆల్విన్ చౌరస్తాలో..
హైదరాబాద్: మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో మంగళవారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు విడిచారు. సంగారెడ్డి నుంచి ఎస్‌ఆర్ నగర్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతులను ఖాజా, ఆంజనేయులుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment