Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan To Meet With Party Local Body Leaders1
రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

తాడేపల్లి : రాష్ట్రంలోఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన నేతలతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు. పార్టీ విజయానికి సహకరించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను వైఎస్ జగన్ స్వయంగా కలవనున్నారు. వీరితో రేపు(బుధవారం) ప్రత్యేకంగా సమావేశమై.. వారిందరికీ అభినందనలు తెలపనున్నారు వైఎస్ జగన్. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు చేసినా, కేసులు పెట్టి వేధించినా.. అన్ని ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి అంకితభావాన్ని గుర్తిస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లోని 8 నియోజకవర్గాల్లోని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కో–ఆప్షన్‌ సభ్యులు హాజరవుతారు. ఇటీవలి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అప్రజాస్వామిక పరిణామాలు చర్చించడంతో పాటు, భవిష్యత్‌ కార్యాచరణపైనా సమావేశంలో పార్టీ అ«ధ్యక్షుడు దిశా నిర్దేశం చేస్తారు. ముఖ్యంగా కష్టకాలంలో పార్టీ కోసం అన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడిన నాయకులు, ప్రజా ప్రతిని«ధులకు మరింత స్ఫూర్తినిచ్చేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.‘ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన మిమ‍్మల్ని చూసి గర్వపడుతున్నా’

IPL 2025: Punjab kings vs Lucknow Super Giants live Updates and Highlights2
ల‌క్నో నాలుగో వికెట్ డౌన్‌.. పూర‌న్ ఔట్‌

IPl 2025 PBKS vs LSG Live Updates: ల‌క్నో నాలుగో వికెట్ డౌన్‌.. పూర‌న్ ఔట్‌నికోల‌స్ పూర‌న్ రూపంలో ల‌క్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 44 ప‌రుగులు చేసిన పూర‌న్.. చాహ‌ల్‌ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి డేవిడ్ మిల్ల‌ర్ వ‌చ్చాడు. 12 ఓవ‌ర్ల‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 4 వికెట్లు కోల్పోయి 91 ప‌రుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న పూర‌న్‌..10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి లక్నో సూప‌ర్ జెయింట్స్ మూడు వికెట్ల న‌ష్టానికి 76 ప‌రుగులు చేసింది. నికోల‌స్ పూర‌న్‌(23 బంతుల్లో 33) దూకుడుగా ఆడుతున్నాడు. క్రీజులో పూర‌న్‌తో పాటు బ‌దోని(11) ఉన్నారు.క‌ష్టాల్లో ల‌క్నో.. పంత్ ఔట్‌ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. కేవ‌లం 2 ప‌రుగులు మాత్ర‌మే చేసిన పంత్‌.. మాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో మూడు వికెట్ల న‌ష్టానికి 39 ప‌రుగులు చేసింది.ల‌క్నో రెండో వికెట్ డౌన్‌..ఐడెన్ మార్క్రామ్ రూపంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 28 ప‌రుగులు చేసిన మార్క్రామ్.. ఫెర్గూస‌న్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో రెండు వికెట్లు కోల్పోయి 33 ప‌రుగులు చేసింది. క్రీజులో రిష‌బ్ పంత్‌, నికోల‌స్ పూర‌న్ ఉన్నాడు.తొలి వికెట్ డౌన్‌.. మార్ష్ ఔట్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ త‌గిలింది. అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న మార్ష్‌.. ఈ మ్యాచ్‌లో ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. క్రీజులోకి నికోల‌స్ పూర‌న్ వ‌చ్చాడు.ఐపీఎల్‌-2025లో ల‌క్నో వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్‌ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున లాకీ ఫెర్గూస‌న్ అరంగేట్రం చేశాడు. అజ్మ‌తుల్లా ఓమ‌ర్జాయ్ స్ధానంలో ఫెర్గూస‌న్ పంజాబ్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. మ‌రోవైపు ల‌క్నో మాత్రం త‌మ తుది జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేదు.తుది జ‌ట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్.లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్‌), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్.

Auto Settlement Limit For PF Withdrawals To Rs 5 Lakh3
EPFO విత్‌డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలని యోచిస్తోంది. ఇదే జరిగితే.. 7.5 కోట్ల కంటే ఎక్కువ ఈపీఎఫ్ఓ సభ్యులకు లబ్ది చేకూరుస్తుంది.గత వారం జరిగిన సమావేశంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి 'సుమితా దావ్రా' ఈ పరిమితిని పెంచే ప్రతిపాదనను ఆమోదించారు. అయితే ఈ సిఫార్సును ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఆమోదం కోసం సమర్పించనున్నారు. ఇవన్నీ పూర్తయిన తరువాత ఈపీఎఫ్ఓ సభ్యులు ఆటో సెటిల్మెంట్ ద్వారా రూ. 5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ మోడ్‌ను ఏప్రిల్ 2020లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి వైద్య ఖర్చుల కోసం, విద్య, వివాహం, గృహనిర్మాణం వంటి వాటి కోసం అడ్వాన్స్‌గా నగదు తీసుకునేందుకు అవకాశం లభించింది. అయితే మే 2024లో ఆటో అప్రూవ్డ్ క్లెయిమ్‌ల పరిమితిని రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచారు. ఆ తరువాత చాలామంది దీనిని ఉపయోగించుకున్నారు.ఇదీ చదవండి: ఈ రూల్ అతిక్రమిస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్!: నితిన్ గడ్కరీమార్చి 6, 2025 నాటికి 2.16 కోట్ల ఆటో క్లెయిమ్‌లు ప్రాసెస్ చేయబడ్డాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు కేవలం మూడు రోజుల్లోనే 95 శాతం ఆటో మోడ్ క్లెయిమ్‌లు పరిష్కారమయ్యాయి. తిరస్కరణ రేటు 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గింది.

India And China Ties Should Take Form Of Elephant Dragon Tango 4
భారత్‍-చైనా అధ్యక్షులు అభినందనలు తెలియపరుచుకున్న వేళ..

బీజింగ్: గతంలో భారత్-చైనా అంటే ఒక యుద్ధ వాతవారణమే కనిపించేది. భారత్ తో పాకిస్తాన్ ఏ రకంగా కయ్యానికి కాలు దువ్వుతుందో ఆ రకంగానే ఉండేది చైనాతో కూడా. అయితే భారత్-చైనా సంబంధాలు ఇప్పుడు దాదాపు మెరుగైన స్థితిలోనే కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఎక్కడా కనిపించకపోవడమే ఇందుకు ప్రధాన ఉదాహరణగా చెప్పొచ్చు.అయితే భారత్ తో స్నేహ హస్తం కోసం చైనా కొన్ని నెలల నుంచి ఎదురుచూస్తోంది. భారత్ తో కలిసి ఎలిఫెంట్ డ్రాగన్ డ్యాన్స్ చేయాలంటూ ఇప్పటికే చైనా చాలా సార్లు స్నేహ హస్తాన్ని ఇవ్వమని నేరుగానే అడిగేసింది. దీనికి భారత్ కూడా సానుకూలంగానే స్పందించింది. చైనాతో స్నేహ పూర్వకంగా కలిసి పని చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ప్రధాని మోదీ కూడా ఇటీవలే స్సష్టం చేశారు. ఇరు దేశాలది ఘనమైన చరిత్ర అని, ప్రపంచ జీడీపీలో ఇరు దేశాలది సగం వాట ఉందంటే భారత్-చైనాలు ఎంత బలమైన దేశాలో అర్థం చేసుకోవచ్చని కూడా ఆ సందర్భంలో మోదీ పేర్కొన్నారు.భారత్ చైనాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షుడు మంగళవారం అభినందనలు తెలుపుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల అధ్యక్షులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.ఇరు దేశాలు మరింత స్నేహ పూర్తకంగా కలిసి పని చేయాలని, భారత్ చైనాల బంధం ఎలిఫెంట్ డ్రాగన్ టాంగో రూపంలో ఉండాలని ఈ సందర్భంగా జిన్ పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల సంబంధాలు శాంతియుతంగా, స్నేహపూర్వకంగా మారడానికి మార్గాలను కనుగొనాలని, అంతర్జాతీయ వ్యవహారాల్లో కమ్యూనికేషన్ తదితర వాటిల్లో మరింతగా పెంచుకోవాలని జిన్‌పింగ్ సూచించారు. సరిహద్దు ప్రాంతాలలో శాంతిని కాపాడడంలో భారత్‌తో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నానని అన్నారు.భారత ప్రధాని మోదీ ‘మంచి మాట’ చెప్పారు: చైనా

Ambati Rambabu Clarity On Kodali Nani Health Condition5
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రాంబాబు క్లారిటీ

సాక్షి, గుంటూరు: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గుండె నొప్పితో బాధపడుతున్నారని.. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని.. ఈ వ్యవహారాన్ని టీడీపీ ట్రోల్‌ చేస్తూ వికృత ఆనందాన్ని పొందుతుందని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఆయన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్‌లో ఆపరేషన్ చేస్తే ఒత్తిడి పెరుగుతుందని భావంతో ఆయన్ను ముంబైకి తీసుకువెళ్లారని అంబటి వివరించారు.‘‘కొడాలి నానికి ఆపరేషన్ చేసే డాక్టర్ రమాకాంత్ పాండే సర్జరీలు చేయడంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి. మా అమ్మ కూడా అక్కడే ఆపరేషన్ చేయించాం. ఇవాళో, రేపో నాని పరిస్థితిని పరిశీలించి డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి డేట్ ఇస్తారు. ఆయన సంతోషంగా ఇంటికి వస్తారు.. అందులో ఎటువంటి సందేహం లేదు. టీడీపీ చేసే దుష్ప్రచారాలను నమ్మొద్దు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.‘‘జైల్లో ఉన్న వంశీ జుట్టుకు రంగు వేయటం మానేశారు. దీంతో ఆయన ఏదో దిగులు పడిపోయినట్టు, కృంగిపోయినట్టు టీడీపీ నాయకులు ప్రచారం చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ధైర్యం కోల్పోయే వ్యక్తులు కాదు. వాళ్లిద్దరూ క్షేమంగా వస్తారు.. టీడీపీని ఎదురిస్తారు. వాళ్ళిద్దరిని ట్రోల్ చేస్తూ టీడీపీ శ్రేణులు పైశాచిక ఆనందం పొందుతున్నాయి.’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.

Ysrcp Leaders Sit Demand In Rajahmundry Pharmacy Student Incident6
రాజమండ్రి ఘటనపై సిట్‌తో దర్యాప్తు చేయించాలి : వరుదు కళ్యాణి

తూర్పుగోదావరి జిల్లా,సాక్షి: మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోనన్న డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఎక్కడా? అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ప్రశ్నించారు. రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడిన బాధితురాలి కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, అధికార ప్రతినిధి శ్యామల, మాజీ ఎంపీ భరత్ రామ్‌లు పరామర్శించారు. బొల్లినేని ఆసుపత్రి ఘటనపై సిట్‌ వేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వరుదు కళ్యాణి: మాట్లాడుతూ.. ఘటన జరిగి పది రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ఘటనను పట్టించుకోరా. యువతిని దారుణంగా హింసించి ఆత్మహత్యకు పురిగొలిపేలా చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు. ఏ హాస్పిటల్లో అయితే బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందో అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం దారుణం. జిల్లా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదు. సీసీటీవీ ఫుటేజ్‌ను ఇప్పటిదాకా ఎందుకు తల్లిదండ్రులకు చూపించలేదు. ఈ ఘటనపై సిట్ వేసి దర్యాప్తు జరపాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని హెచ్చరించారు.ఆరే శ్యామల అధికార ప్రతినిధి:బాధిత కుటుంబ తల్లడిల్లిపోతుంది. సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది. మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోమన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ. బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. అంజలికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాటు చేయాలి. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి.మాజీ ఎంపీ మార్గాని భరత్: బాధితురాల్ని దారుణంగా హింసించిన దీపక్‌ను శిక్షించాలి. నిందితుడు అధికార తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడు కావడంతోనే ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఘట్టంపై సమగ్ర విచారణ జరగాలి. బాధిత యువతి తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదు.. ఎవరు చేశారన్న విషయాన్ని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేయాలి. ప్రభుత్వాధికారులు ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు. గతంలో దీపక్ ఎవరెవరిని హింసించాడన్న అంశాన్ని కూడా పోలీసులు పరిశీలించాలి. ఈ ఘటనలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి బాధితురాలి తల్లిదండ్రులు :మా బిడ్డను ఆరోగ్యంగా మాతో పంపాలి. లేదంటే అదే ఇంజక్షన్ మాకు ఇవ్వండి. మాకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం’అని హెచ్చరించారు.

Story On ChatGPT Ghibli Studio7
మీకు దండం పెడతా ఆ ఫొటోలు ఆపండ్రా బాబు

మార్కెట్లోకి ఏ కొత్త ప్రాడక్ట్ వచ్చినా జనం ఊరుకోరు.. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వచ్చే అప్డేట్స్.. మార్పులు.. కొత్తకొత్త ఆవిష్కరణలు వంటివి జనాన్ని మరింతగా ఆకట్టుకుంటాయి. ఎంతలా అంటే కొత్త ఆవిష్కరణ తీసుకొచ్చిన కంపెనీకి సైతం నిద్రపట్టని స్థాయిలో మనోళ్లు వాడకం ఉంటుంది. ఐ ఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే చాలు తిండి నిద్రమానేసి దానికోసం లైన్లో నిలబడి చివరకు దాన్ని దక్కించుకునేవరకూ ఊపిరిసలపని వాళ్ళు కొందరు. దానికోసం ఏకంగా కిడ్నీలు అమ్ముకునేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఫోన్ కొనకపోతే ఉరేసుకుంటాను అని తల్లిదండ్రులను బెదిరించిన కేసులూ ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా చాట్‌జీపీటీలో వచ్చిన కొత్త ఆవిష్కరణ జిబ్లీ స్టూడియో ఫోటోలు.. అంటే మనం ఏదైనా ఫోటోను దానిలోకి అప్లోడ్ చేస్తే అది కార్టూన్ మాదిరి మార్చేసి మనకు తిరిగి ఇస్తుందన్నమాట. అంటే ఒక చిత్రకారుడు పెన్సిల్.. కుంచెతో వేసినట్లు ఆ ఫోటోలు ఉంటాయి.ఈ కొత్త ఫీచర్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం ఐంది. ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఫోటోలు అప్లోడ్ చేసేసి వాటిని జిబ్లీ స్టూడియో ఫొటోలుగా మార్చేసుకుని ఫేసుబుక్ ట్విట్టర్.. ఇన్‌స్టాలో పోస్టు చేసుకుంటున్నారు. మనిషికి తనని తాను చూసుకోవడం ప్రతిసారీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందేమో..అద్దంలో ఒకసారి ఫోటోలో ఒకసారి.. బొమ్మ గీయించుకొని ఒకసారి..చూసుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా కార్టూన్ లో ఎలా ఉంటానో అనే కుతూహలంతో.. చాట్‌జీపీటీలో అందరూ స్టూడియో గిబ్లీ ఆర్ట్ స్టైల్ లో తమ ఫొటోలు మారుస్తూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ ఫోటోల పిచ్చి ఏకంగా ఆ చాట్జిపిటి సంస్థను సైతం కుదిపేసింది.మనం అప్లోడ్ చేసిన మన మామూలు ఫోటోలను ఏకంగా జపానీస్ యానిమేషన్ స్టూడియో డైరెక్టర్లు హయావో మిజజాకి, ఇసావో టకహట రూపొందించిన పాపులర్ సినిమాలు స్పిరిటెడ్ అవే , ప్రిన్సెస్ మోనోనొకే వంటి సినిమా క్యారెక్టర్లను పోలి ఉండేలా మార్చేసి మనకు అందిస్తోంది. . ఈ కార్టూన్ చిత్రాలు మంచి జనాదరణ పొందడంతో కోట్లకొద్దీ ఫోటోలు చాట్‌జీపీటీలోకి వచ్చి పడుతున్నాయి. దీంతో అక్కడి సిబ్బందికి తిండి నిద్ర కూడా లేదంట. దీంతో ఈ ట్రేండింగ్ ను చూసి విసుగెత్తిపోయిన చాట్ జిపిటి వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్‌మాన్ బాబూ కాస్త గ్యాప్ ఇవ్వండి.. మా సిబ్బంది కూడా కాస్త నిద్రపోవాలి కదా అని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. అంటే కొత్త ట్రెండ్ మొదలైతే జనం ఎంతలా వేలం వెర్రిలా ఉంటారన్నదానికి ఇదో ఉదాహరణ అన్నమాట.- సిమ్మాదిరప్పన్న

Supreme Court Fire On Up CM Yogi Government Over Bulldozer Action8
‘మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. 2023లో యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య గురయ్యాడు. హత్యకు గురైన అతిక్‌ చెందిన స్థిరాస్థుల్ని అధికారులు కూల్చివేశారు. వాస్తవానికి బుల్డోజర్‌తో కూల్చేసిన నిర్మాణాలతో అతిక్‌కు సంబంధం లేదు. ఆ ఇళ్లు లాయర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర రంగాల్లో విధులు నిర్వహిస్తున్నవారివి. ఎప్పటిలాగే సంఘ విద్రోహ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపే సీఎం యోగి ప్రభుత్వం (Yogi Adityanath) పొరపాటున బాధితుల ఇళ్లను బుల్డోజర్లతో (Bulldozer justice) కూల్చేసింది. దీంతో బాధితులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.రూ.10లక్షల నష్టపరిహారం ఆ పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టు జస్టిస్ ఎస్ ఓకా,జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బూల్డోజర్‌ చర్యలపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి సర్కార్‌తో పాటు ప్రయాగ్‌రాజ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. తక్షణమే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని సూచించింది.అది మా పొరపాటేఅంతకుముందు అడ్వకేట్‌, ప్రొఫెసర్‌ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ల గురించి అత్యున్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. నిబంధనలకు విరుద్ధంగా బుల్డోజర్లతో ఇళ్లను ఎలా కూల్చేస్తారు? కూల్చేవేతకు ఓ రోజు ముందు నోటీసులు ఎలా అంటిస్తారని ప్రశ్నించింది. అయితే, సుప్రీం ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు యూపీ అధికారులు బదులిచ్చారు. మేం కూల్చేసిన ఇళ్లు గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ నిర్మించుకున్నాడేమోనని పొరపాటున బుల్డోజర్‌ చర్యలకు దిగినట్లు వివరణ ఇచ్చారు.రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదుకూల్చివేత నోటీసులు అందజేసిన తీరుపై అధికారులను కోర్టు మందలించింది. కూల్చేసిన ఇళ్లనకు నోటీసులు అతికించామని రాష్ట్ర న్యాయవాది చెప్పగా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదని అడిగింది. అదే సమయంలో ఈ తరహా చర్యల్ని వెంటనే ఆపాలి. బాధితులు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వారికి నష్టపరిహారం కింద రూ.10 లక్షల పరిహారం చెల్లించండి. పరిహారం ఇస్తే వారికి న్యాయం జరిగినట్లవుతుందని జస్టిస్‌ ఎస్‌.ఓకా అభిప్రాయం వ్యక్తం చేశారు.మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయిఈ కేసులు మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయి. పిటిషనర్ల ‌ ఇళ్లను నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేశారని కోర్టు అభిప్రాయ పడినట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇళ్లు కూల్చేస్తున్నట్లు నోటీసులు గాని, నోటీసులు తీసుకున్న వారికి వివరణ ఇచ్చేందుకు తగిన అవకాశం ఇవ్వలేదని ప్రస్తావించింది. అందరూ కలత చెందుతున్నారుఅదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లో బుల్డోజర్‌ కూల్చివేతల సమయంలో వైరలైన ఓ వీడియో గురించి కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. అధికారులు బుల్డోజర్లతో ఇళ్లను కూల్చే సమయంలో సదరు ఓ ఇంటికి చెందిన బాలిక తన పుస్తకాల్ని చేతపట్టుకుని ఉండడాన్ని చూడొచ్చు. ఇలాంటి దృశ్యాలతో అందరూ కలత చెందుతున్నారు’ అని జస్టిస్ భుయాన్ అన్నారు.

Chandrababu Gets A Shock During His Visit To Bapatla District9
‘బాబ్బాబు.. మీకు పుణ్యం ఉంటుంది.. నా మీటింగ్‌కు రండమ్మా’

బాపట్ల జిల్లా,సాక్షి: దేశంలో తనకున్న రాజకీయనుభవం ఎవరికీ లేదు. మైక్‌ దొరికితే చాలు తనది 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటూ డబ్బా కొట్టుకుంటూ సంపద సృష్టిస్తానని చెప్పుకునే చంద్రబాబు బాపట్ల జిల్లా పర్చూరు జిల్లా ప్రజలు షాకిచ్చారు. అంతేకాదు, నాలుగుసార్లు సీఎంగా చేశానని తన డప్పు గ్యాప్‌ లేకుండా ఎల్లోమీడియాలో ప్రచారం చేయించుకుంటుంటారు. కానీ తన మాటల్ని ఎవరూ వినడం లేదని, అందుకే సభలకు ఎవరూ రావడం లేదని చంద్రబాబుకు అర్థమైంది.ఇటీవల నిర్వహించిన పీ4 సభ అట్టర్‌ ప్లాప్‌ అవ్వడంతో బాబుకు విషయం త్వరగానే బోధపడింది. అంతే నా మీటింగ్‌కు రండి అంటూ పిల్లల్ని, మహిళల్ని బతిమలాడుకుంటున్నారు చంద్రబాబు. కొత్తగొల్లపాలెంలో సీఎం చంద్రబాబు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో మీరే చూడండి అంటూ స్థానికులు పర్యటన వీడియోల్ని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇక ఆ వీడియోల్లో.. హే పిల్లలంతా మీటింగ్‌కు రండి. అందరూ నా మీటింగ్‌కు రండమ్మా అంటూ చంద్రబాబు స్థానికుల్ని ప్రాధేయపడుతుండడం మనం గమనించవచ్చు.

Producer Suryadevara Naga Vamsi Fires On Review Writers10
దమ్ముంటే నన్ను, నా సినిమాలను బ్యాన్‌ చేయండి: నాగవంశీ

ఇటీవల విడుదలైన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ (mad square) చిత్రం మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. మూడురోజుల్లోనే ఈ మూవీ రూ. 50.2 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టి ఈ మధ్యకాలం అత్యధిక వసూళ్లను రాబట్టిన చిన్న చిత్రంగా రికార్డు సృష్టించింది. బ్రేక్‌ ఈవెన్‌ సాధించడంతో పెంచిన టికెట్ల ధరను సాధారణ స్థాయికి తీసుకువచ్చామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ( Suryadevara Naga Vamsi) తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమా గురించి నెగెటివ్‌ ప్రచారం చేస్తున్న వారిపై గ్రహం వ్యక్తం చేశాడు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించరని ఆయన ప్రశ్నించారు.‘సినిమా రిలీజ్‌ తర్వాత రివ్యూలు వచ్చాయి. అప్పుడు ప్రెస్‌ మీట్‌పెట్టాను కానీ నేను ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ల పని వాళ్లు చేశారు అనుకున్నాను. కానీ, సినిమా బాగా ఆడుతున్నప్పటికీ.. ఆ రివ్యూల మీద సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘కంటెంట్‌ లేకపోయినా సీక్వెల్‌ కాబట్టి ఆడుతోందని అంటున్నారు. ఈ సినిమ ఎలా ఉన్నా చూడటానికి ఇదేమైనా ‘బాహుబలి2’, ‘పుష్ప2’, ‘కేజీఎఫ్2’ కాదు కదా! సినిమా ఆశించినంత లేకపోయినా చూడటానికి ఇందులో నటించిన వాళ్లేమీ పెద్ద హీరోలు కాదు. ‘మ్యాడ్ స్క్వేర్‌’ బాగుంది కాబట్టి చూస్తున్నారు. వేరే మూవీలు బాగోలేవని దీన్ని చూడటం లేదు. ఇది అందరూ తెలుసుకోవాలి. కంటెంట్‌ లేదు. సెకండాఫ్‌ పండలేదని అంటున్నారు. నేను థియేటర్‌లో చాలాసార్లు సినిమా చూశా. ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. జనాలకు తెలిసినంత బాగా రివ్యూవర్‌లకు తెలియడం లేదా?మీరు (మీడియా) మేమూ కలిసి పనిచేయాలి. నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ వెబ్‌సైట్స్‌ రన్‌ అవుతున్నాయి. నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్‌ ఛానళ్లు పనిచేస్తున్నాయి. మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్‌ పనిచేస్తాయి. ద‌మ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేసి చూపించండి. నా సినిమా ఆర్టిక‌ల్స్ రాయ‌కండి. నా సినిమాను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో నాకు బాగా తెలుసు.సినిమాలు ఆడితేనే మీరూ ఉంటారు. లేకపోతే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి’ అని నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement