దేవాస్(మధ్యప్రదేశ్): మానవత్వం మంట కలిసింది. కామాంధుని దాహానికి మరో చిన్నారి బలైంది. కూతురు వయసుండే ఆ అమాయకురాలిపై మదం ఎక్కిన మనుషులు లైంగిక దాడికి దిగారు. ఆపసిబిడ్డను చిత్రహింసలు పెట్టి, నిండు జీవితాన్ని ఎవరికీ తెలియకుండా పొలాల మద్య పాతిపెట్టారు. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో దారుణం జరిగింది. తండ్రికి భోజనం ఇచ్చేందుకు పొలానికి వెళ్లిన బాలికను గుర్తు లియని వ్యక్తి రేప్ చేయటంతోపాటు దారుణంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సండ్రెల్ గ్రామానికి చెందిన బాలిక(10)శుక్రవారం మధ్యాహ్నం పొలంలో ఉన్న తండ్రికి భోజనం తీసుకుని వెళ్లి, కనిపించకుండాపోయింది. శనివారం పొలాల సమీపంలోని చెట్లపొదల్లో ఆమె మృతదేహమై కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తి బాలికపై అత్యాచారం చేయటంతోపాటు గొంతు నులిమి చంపి పొలాల్లో పడేసి వెళ్లాడు. దీనిపై మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం స్థానిక ఆస్పత్రికి నిమిత్తం తరలించారు. తెలిసిన వ్యక్తే బాలికపై దురాగతానికి పాల్పడ్డాడని, నేరం బయటపడకుండా ఉండేందుకు ఆమెను బలి తీసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment