
సాక్షి, చిత్తూరు: జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కలకడ-పీలేరు మార్గంలో ఐషర్ వాహనం ఆటో ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల బంధువొకరు ఇవాళ మధ్యాహ్నం చనిపోవడంతో వారంతా చివరి చూపుల కోసం వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారంతా కలకడ మండలం కొత్త గాండ్ల పల్లికి చెందిన వెంకటరమణ కుటుంబ సభ్యులుగా సమాచారం. వెంకటరమణ, పార్వతమ్మ, సుగుణమ్మ, రెడ్డి గోవర్దిని, దామోదరం ప్రాణాలు విడువగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. (చదవండి: బొమ్మల షాపులో మహిళపై దారుణం)
Comments
Please login to add a commentAdd a comment