చిన్నారిపై లైంగికదాడి.. దేహశుద్ధి | 6 Year Old Girl Allegedly Molested In Anantapur | Sakshi
Sakshi News home page

చిన్నారిపై లైంగికదాడి.. దేహశుద్ధి

Published Sat, Oct 5 2019 12:33 PM | Last Updated on Sat, Oct 5 2019 1:11 PM

6 Year Old Girl Allegedly Molested In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని నార్ప‌లలో దారుణం చోటుచేసుకుంది. కన్నూమిన్నూ కానక చిన్నారిపై లైంగిక దాడికి తెగబడ్డాడో కామాంధుడు. వివరాలు.. నార్పలకు చెందిన ఆరేళ్ల చిన్నారి తమ ఇంట్లో ఆడుకుంటోంది. ఇంతలో అక్కడికి చేరుకున్న నారాయణస్వామి అనే వ్యక్తి తలుపులు మూసి బాలికపై అకృత్యానికి ఒడిగట్టాడు. అతడి చేష్టలతో బెంబేలెత్తిపోయిన చిన్నారి గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో చిన్నారి ఆర్తనాదాలు విన్న స్థానికులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించారు. బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ నారాయణస్వామికి దేహశుద్ధి చేశారు. కాగా దేశ వ్యాప్తంగా యువతులు, మహిళలపైనే కాకుండా పసిపిల్లలపై కూడా అత్యాచార పర్వాలు కొనసాగుతునే ఉన్నాయి. కామాంధుల మృగవాంఛకు ఎంతో మంది చిన్నారులు బలైపోతున్న విషయం విదితమే. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement