సాక్షి, తూర్పుగోదావరి : కాట్రేనికోన మండలంలోని పల్లం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అరవై ఏళ్ల వృద్ధుడు ఓ మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కృష్ణారామా..! అనుకోవాల్సిన వయసులో కీచకుడిగా మారాడు. వివరాలు.. డొక్కాడి మహాలక్ష్మి (38)పై డొక్కాడి తాతయ్య (60) సోమవారం అత్యాచారయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన మహాలక్ష్మిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment