తప్పిపోయిన బాలుడు యశ్వంత్
సాక్షి, వరంగల్ : నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో మధ్యాహ్నం ఖిలావరంగల్ తూర్పు కోటకు చెందిన పెద్దోజు యశ్వంత్(7) అనే బాలుడు తప్పిపోయినట్లు తండ్రి నర్సింహచారి ఫిర్యాదు చేసినట్లు మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ జీవన్‌రెడ్డి తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం తన ఇద్దరు కుమారులతో ఎంజీఎం అస్పత్రికి తీసుకురాగా చిన్నకుమారుడు యశ్వంత్ తప్పిపోయినట్లు తెలిపారు. తప్పిపోయిన బాలుడు చిన్న కటింగ్ క్రాఫ్‌తో మెరూన్ కలర్ నెక్కర్, బ్లూ కలర్ షర్ట్ స్కూల్ డ్రెస్ వేసుకున్నాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎంజీఎం అస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిస్తే మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment