child missing case
-
‘కానరాని లోకాలకు చిట్టితల్లి’
చిత్తూరు, సాక్షి: పోలీసులకు సవాల్‌గా మారిన పుంగనూరు చిన్నారి అదృశ్యం కేసు.. విషాదాంతం అయ్యింది. నాలుగు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక అస్పియా ఇవాళ శవంగా కనిపించింది. తన చిట్టితల్లి సురక్షితంగానే ఉండి ఉంటుందని, ఏ క్షణంలోనైనా తిరిగి వస్తుందని ఆశగా ఎదురు చూసిన ఆ తల్లికి.. చివరకు కడుపు కోతే మిగిలింది. సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటోంది ఆస్పియా. కరెంట్ పోయి వచ్చాక చిన్నారి కనిపించలేదు. కంగారుపడిన తల్లి.. తండ్రి అజ్మతుల్లాకు ఫోన్ చేసి సమాచారం అందించింది. స్థానికంగా వెతికినా ఆమె కనిపించలేదు. దీంతో అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. మూడు రోజులుగా బాలిక ఆచూకీ కనిపెట్టడం కోసం పోలీసులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఏకంగా 11 ప్రత్యేక బృందాలతో, డాగ్ స్క్వాడ్‌తో పుంగనూరు చుట్టుపక్కల జల్లెడ పట్టారు. అయితే ఇవాళ (బుధవారం) ఉదయం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఓ శవం తేలుతుందని పోలీసులకు సమాచారం అందింది.హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. అదొక చిన్నారి మృతదేహంగా తేల్చారు. అస్పియా తండ్రిని పిలిపించి.. ఆ చిన్నారిదేనని నిర్ధారణకు వచ్చారు. తిరిగి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు.. బిడ్డ మృతితో రోదించారు. చిన్నారి విగత జీవిగా మారిందని తెలియడంతో పట్టణమంతా శోకసంద్రంలో మునిగింది. అయితే బాలిక అక్కడికి ఎలా వెళ్లింది? ప్రమాదవశాత్తు చెరువులో పడిందా..? లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి చంపి పడేసారా?.. ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
నెల్లూరు: హారిక మిస్సింగ్ కేసు విషాదాంతం
సాక్షి, నెల్లూరు: గుర్రాలమడుగు సంఘం చిన్నారి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. నాలుగు రోజుల కిందట ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి ప్లేస్‌లో ఓ బొమ్మ ఉంచి.. పాపను ఎత్తుకెళ్లిన ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే.. చిన్నారి హారిక ఆచూకీ కోసం చేపట్టిన గాలింపులో చివరికి ఆమె మృతదేహం లభ్యం అయ్యింది. సర్వేపల్లి కాలువలో చిన్నారి హారిక మృత దేహం లభ్యం అయ్యింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. మంగళవారం అర్థరాత్రి దాటాక గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. దీంతో.. ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మరోవైపు ఈ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా రక్త సంబంధీకుల పనే అయ్యి ఉంటుంది భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల విచారణలో అందిన సమాచారం మేరకే కాలువలో గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి.. పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. గుర్రాలమడుగు సంఘానికి చెందిన అనూష, రావూరుకు చెందిన మణికంఠకు నాలుగేళ్ల కిందట వివాహం అయ్యింది. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు. మణికంఠ హోటల్ నడుపుతుండగా. అనూష భర్తకు దూరంగా ఉంటూ ఎంసీఏ చదువుతూ గుర్రాల మడుగు సంఘంలోనే ఉంటోంది. భర్త మణికంఠ అప్పుడప్పుడూ వచ్చి భార్యాపిల్లలను చూసి పోతుంటాడు. ఈ క్రమంలో.. ఆదివారం తన తల్లి బయటకు వెళ్లడంతో.. దగ్గర్లో ఉన్న తన పిన్ని ఇంటికి పిల్లలతో వెళ్లింది అనూష. అర్ధరాత్రి కరెంట్ పోవడంతో డోర్లు తీసి పడుకుందామె. ఉదయం లేచి చూసేసరికి.. ఊయలలో ఏడాదిన్నర వయసున్న హారికకు బదులు.. బొమ్మ ఉంది. దీంతో ఆందోళనకు గురై భర్తకు సమాచారం అందించగా.. అంతా కలిసి చుట్టుపక్కల గాలించారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే చిన్నారిని బలి తీసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
‘అదృశ్యం’లో చిక్కుముడులు.. ‘బూచోడు కొట్టాడు’.. సమాధానం లేని ప్రశ్నలెన్నో?
కుప్పం(చిత్తూరు జిల్లా): మండలంలోని నక్కలగుట్ట గ్రామంలో మణి, కవిత దంపతులు నివసిస్తున్నారు. వారికి జోషిక(4) అనే కుమార్తె. శనివారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి హఠాత్తుగా కనపడకుండా పోయింది. అటవీప్రాంతానికి ఆనుకునే వీరి నివాసం ఉండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. స్థానికులతో కలిసి చుట్టపక్కల గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. శరవేగంగా స్పందించి సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు బృందాలు విడిపోయి అటవీప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: ఫస్ట్‌నైట్ అంటే భయపడ్డాడు.. అందుకే ఇలా చేశాడు: వరుడి తల్లి అంతలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. శనివారం రాత్రి గడిచింది. ఆదివారం కూడా బాలిక ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తుల్లో ఆందోళన పెరిగిపోయింది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం అడవిలోకి మేకలు తోలుకెళ్లిన కాపరులకు చిన్నారి జోషిక కనిపించింది. ఈ ప్రాంతం పాప ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒంటిపై దుస్తులు లేని స్థితిలో ఉన్న బాలికను వెంటనే వారు గ్రామానికి తీసుకువచ్చారు. తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. క్షేమంగా చిన్నారి జోషిక ఇంటికి చేరినా పరిస్థితి దయనీయంగానే ఉంది. కాళ్లు, చేతులపై ముళ్ల కంపలు గీసుకున్న గాయాలున్నాయి. ఆహారం తీసుకోవడం లేదు. జ్యూస్ ఇస్తే కొద్దిగా తాగుతోంది. తనను పలకరిస్తే భయపడిపోతోంది. చుట్టూ చేరిన జనాలను చూసి ఏడుస్తోంది. ఏం జరిగిందని తల్లి కవిత ఆరాతీస్తే బూచోడు కొట్టాడు అని సమాధానమిస్తోంది. తినడానికి ఎవరు ఏమిచ్చినా నోటికి చేయి అడ్డుపెట్టుకుని వద్దని చెబుతోంది. నిద్రబుచ్చిన కాసేపటికే ఉలిక్కిపడి లేస్తోంది. అనుమానాలు లేవు చిన్నారి జోషిక అదృశ్యం వెనుక ఎలాంటి అనుమానాలు లేవని ఎస్ఐ ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. 36 గంటల మిస్టరీపై ‘సాక్షి’ ఎస్ఐ వివరణ కోరగా మిస్సింగ్ కేసు మాత్రమే నమోదు చేశామన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. పాప చెబుతున్న బూచోడు, గాయాల విషయమై ప్రశ్నించగా అదేం లేదని సమాధానం దాటవేశారు. సమాధానం లేని ప్రశ్నలెన్నో..? మాటలు కూడా సరిగా రాని చిన్నారి అంతలా ఎందుకు భయపడుతోంది. అడవిలో అన్ని గంటలపాటు ఎలా ఉండగలిగింది. అందులోనూ శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఎలా తట్టుకుంది. అనే ప్రశ్నలు స్థానికులు, తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా బాలికను అపహరించారా..? పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టడం చూసి చిన్నారిని వదిలేశారా..? బాలిక చెబుతున్న బూచోడే ఎత్తుకెళ్లాడా..? తిండి, నీరు లేకుండా ముక్కుపచ్చలారని పసిబిడ్డ ఒంటరిగా అడవిలో ఎలా ఉండగలిగింది. ఎలాంటి అమానుష అనుభవం ఎదురై ఉంటే చిన్నారి అంతలా వణికిపోతోంది. మొత్తం విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
జస్మిత ఆచూకీ లభ్యం: తల్లిదండ్రుల చెంతకు చిన్నారి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి జస్మిత ఆచూకీని కడప పోలీసులు గురువారం కనుగొన్నారు. చిన్నారి అదృశ్యంపై జస్మిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు చిన్నారి జస్మిత ఆచూకీ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుని గాలించారు. దీంతో అదృశ్యమైన 8 గంటల్లోనే జస్మిత ఆచూకీ దొరకిందని ఎస్సై గాయత్రి తెలిపారు. జస్మిత దొరకడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జస్మిత ఆచూకీ కనుగొన్న పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై గాయత్రీ మీడియాకు తెలిపారు. -
ఎంజీఎంలో తప్పిపోయిన బాలుడు
సాక్షి, వరంగల్ : నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో మధ్యాహ్నం ఖిలావరంగల్ తూర్పు కోటకు చెందిన పెద్దోజు యశ్వంత్(7) అనే బాలుడు తప్పిపోయినట్లు తండ్రి నర్సింహచారి ఫిర్యాదు చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ జీవన్‌రెడ్డి తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం తన ఇద్దరు కుమారులతో ఎంజీఎం అస్పత్రికి తీసుకురాగా చిన్నకుమారుడు యశ్వంత్ తప్పిపోయినట్లు తెలిపారు. తప్పిపోయిన బాలుడు చిన్న కటింగ్ క్రాఫ్‌తో మెరూన్ కలర్ నెక్కర్, బ్లూ కలర్ షర్ట్ స్కూల్ డ్రెస్ వేసుకున్నాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎంజీఎం అస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిస్తే మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
కలకలం రేపిన బాలుడి దుస్తులు
సాక్షి, గురజాల(గుంటూరు) : పల్నాడులో చిన్నారుల అదృశ్యం... ఆపై హత్యగావించబడటం కలకలం రేపుతోంది. ఆరు నెలల కిందట మాచర్ల పట్టణంలో బాలుడు అపహరణకు గురై అనంతరం నాలుగు రోజుల వ్యవధిలోనే చెరువులో శవమై తేలాడు. పోలీస్ సబ్ డివిజన్లో ఆ ఘటన మరువక ముందే గురజాలలో ఆదివారం అదృశ్యమైన నాలుగేళ్ల బాలుడు సుభాష్ జాడ నేటికీ తెలియలేదు. బాలుడి దుస్తులు రక్తపు మరకలతో ఇంటికి కూతవేటు దూరంలోనే శుక్రవారం లభ్యమవ్వడం కలకలం రేపింది. ముళ్లకంపపై బాలుడు సుభాష్ అదృశ్యమైన సమయంలో వేసుకున్న లాగు, మరికొంత దూరంలో ముళ్లకంపలో రక్తపు మరకలతో కూడిన టీ షర్టు దొరికింది. అదే విధంగా ఓ పుర్రె దర్శనమివ్వడం ఆందోళనకు గురిజేసింది. అక్కడక్కడ రక్తపు మరకలు , ఒక కత్తెర, ఆ ప్రాంతంలోనే తల వెంట్రుకలు వంటి ఆనవాళ్లు కనిపించాయి. బాలుడిని ఎవరైనా కిడ్నాప్‌చేసి తీసుకెళ్లి హత్యచేశారా.. ? కావాలనే ఈ విధంగా ఆ ప్రాంతంలో బాలుడి దుస్తులు వేసి వెళ్లారా....? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా వ్యక్తులు బాలుడిని ఎత్తుకెళ్లి హత్యచేసి ఆ ప్రాంతంలో దుస్తులు వేశారా..? మరి మృతదేహం ఎక్కడ ఉంది అనేది తేలాల్సి ఉంది. మూడు రోజుల కిందట పోలీసులు డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ , సిబ్బందితో కలిసి పరిశీలించిన సమయంలో ఎక్కడా కనిపించని ఈ దుస్తులు ఇప్పుడు ఎలా దర్శనమిచ్చాయనే సందేహాలొస్తున్నాయి. రంగంలోకి దిగిన క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్. అదృశ్యమైన బాలుడి దుస్తులు కనిపించగానే ఆ ప్రాంతానికి డీఎస్పీ ఆర్ శ్రీహరిబాబు, పట్టణ సీఐ దుర్గాప్రసాద్, రూరల్ సీఐ కోటేశ్వరరావు, పట్టణ ఎస్ఐ పి.బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఒక చోట బాలుడు లాగు మరికొంత దూరంలోనే రక్తంతో వున్న బాలుడి టీ షర్టు లభ్యమయ్యాయి. అక్కడక్కడ రక్తపు మరకలు, వెంట్రుకలు కనిపించాయి. గుంటూరు నుంచి క్లూస్ టీంను రంగంలోకి దింపారు. బాలుడికి సంబంధించిన వివరాలు , రక్తపు మరకల నమూనాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ ఆ ప్రాంతంలో పడివున్న కత్తెర, రక్తపు మరకలు వాసన చూసి రెండు మార్లు బాలుడి ఇంటి వద్దకు మూడు మార్లు ఆ ప్రాంతంలోనే ముళ్లపొదల వద్దకు వెళ్లి ఆగిపోయింది. -
కన్నా.. కనిపించరా..!
రెండేళ్ల బాలుడు తోటి పిల్లలతో ఆరుబయట ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. అప్పటి వరకు కళ్ల ముందే ఉన్నవాడు కనిపించకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. బిడ్డ జాడ కోసం చుట్టు పక్కలంతా వెదికింది. ఎంతకీ ఆచూకీ తెలియక కన్నీరు మున్నీరవుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదంతా నెల రోజుల కిందటి మాట. అప్పటి నుంచీ కంటి మీద కునుకు లేదు. కుమారుడి కోసం వెదకని చోటు లేదు. ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి చేరతాడని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆ బాలుడి తల్లిదండ్రులు. మూడు రోజుల కిందట కిడ్నాపైన తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన బాలుడు జసిత్ క్షేమంగా ఇంటికి చేరడంతో తమ బిడ్డ కూడా తిరిగొస్తాడని ఆశ చిగురిచింది. దీంతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సాక్షి, దర్శి (ప్రకాశం): దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలోని రెడ్డినగర్‌కు చెందిన మేడగం అశోక్‌రెడ్డి, జ్యోతి దంపతుల కుమారుడు 25 నెలల వయసున్న ఆరూష్‌రెడ్డి. జూన్ 24 తేదీన ఇంటి వద్ద ఆరుబయట ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. దీనిపై ముండ్లమూరు ఎస్ఐ అంకమ్మ కేసు నమోదు చేశారు. దర్శి డీఎస్పీ రాంబాబు, సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. పలు చోట్ల వెదికినా ఫలితం లేదు. దీంతో ప్రతి రోజు ఆరూష్ కోసం తల్లిదండ్రులు తమ బంధువుల గ్రామాలలో చుట్టు పక్కల పట్టణాలలో, తండాలలో, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్, ఇతర పట్టణాలలో వెదుకుతూనే ఉన్నారు. 32 రోజులు అయినా ఫలితం లేక పోవటంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని ముక్కోటి దేవతలను వేడుకున్నారు. తమ వంతుగా ఎస్పీని కలసి విన్నవించుకున్నారు. అదే రోజు డీఎస్పీతో మాట్లాడి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట బాలుడు జసిత్ గురువారం తల్లిదండ్రుల చెంతకు చేరడంతో ఆరూష్‌రెడ్డి తల్లిదండ్రుల్లో కొత్త ఆశలు చిగురించాయి. దీంతో గురువారం ఒంగోలు వచ్చి, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్‌ను కలిసి, తమ బిడ్డ ఆచూకీ గుర్తించాలని విన్నవించుకున్నారు. ఒడిశా వారి పైనే అనుమానం... మొదటగా తల్లిదండ్రులు వెలు బుచ్చిన పలు అనుమానాల ప్రకారం పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఈ సమయంలో దర్శి కేంద్రంగా పలు పరీక్షలు రాయటానికి వచ్చిన ఒడిశాకు చెందిన వారిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదిశగా విచారణ చేస్తే ఫలితం ఉండొచ్చని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలతో దర్యాప్తు జాప్యం.. బాలుడు అదృశ్యమైన సమయంలో ఉన్న పోలీస్ అధికారులు తర్వాత వరస బదిలీలు కావటంతో ఈ కేసు దర్యాప్తు జాప్యమైందని స్థానికులు భావిస్తున్నారు. కిడ్నాప్ సమయంలో ఉన్న ఎస్ఐ అంకమ్మ రావు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో రామక్రిష్ణ వచ్చారు. దర్శి డీఎస్పీ నాగరాజు బదిలీపై వెళ్లి ప్రకాశరావు వచ్చారు. దర్శి సీఐ శ్రీనివాసరావు బదిలీపై వెళ్లిన సీఐ కరుణాకర్‌రావు ఆయన వెళ్లి సీఐ ఎండీ మొయిన్ వచ్చారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. -
ఇంకా దొరకని పసికందు ఆచూకీ
-
36 గంటల్లో కిడ్నాప్‌ను ఛేదించారు
-
త్వరలోనే బాలుడిని గుర్తిస్తాం : సీఐ
విజయవాడ: బెజవాడ ప్రభుత్వాసుపత్రిలో అదృశ్యమైన బాలుడిని త్వరలోనే గుర్తిస్తామని గవర్నర్‌పేట సీఐ పవన్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఈ కేసు విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ...దర్యాప్తులో ఎవరినైనా అనుమానితులుగానే పేర్కొంటామన్నారు. దర్యాప్తు జరిగే క్రమంలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయని సీఐ చెప్పారు. ఎవరిని ఉద్దేశపూర్వకంగా దోషులుగా చూపించే ప్రయత్నం చేయలేదని వివరణ ఇచ్చారు. అదృశ్యమైన బాలుడి కోసం దర్యాప్తు కొనసాగుతూనే ఉందన్నారు. కొన్నిసార్లు దర్యాప్తులో నిర్దోషులుంటే వారిని తొలగించుకుంటూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తామని సీఐ పవన్‌కుమార్‌రెడ్డి చెప్పారు. -
బాబు అదృశ్యం కేసులో ట్విస్టులు కంటిన్యూ
విజయవాడ: బెజవాడ ప్రభుత్వాసుపత్రిలో ఐదు రోజుల పసికందు అదృశ్యం కేసులో పోలీసులకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. నెహ్రూ బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా బాబు అదృశ్యానికి సంబంధించిన అనుమానితుల దృశ్యాలను పోలీసులు హడావుడిగా విడుదల చేశారు. దీంతో ఆ దృశ్యాల్లో ఉన్న మహిళ శుక్రవారం పోలీసులను ఆశ్రయించడంతో కంగుతిన్నారు. పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకునే పనిలో పడ్డారు. గుంటూరుకు చెందిన ధాన్యశబరి అనే మహిళ శుక్రవారం విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. బాబు కిడ్నాప్‌తో మాకెలాంటి సంబంధం లేదని... ఫిబ్రవరి 27న గుంటూరు ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చానని చెప్పారు. నిందితులను నిర్థారించుకోకుండా పోలీసులు ఫోటోలను ఏ విధంగా విడుదల చేస్తారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పరువు గల కుటుంబాన్ని రోడ్డుకీడ్చారని, సంబంధిత పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని ధాన్యశబరి డిమాండ్ చేశారు. ధాన్యశబరి వాదనతో పోలీసులు విభేదిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్న వారు, పోలీసులను ఆశ్రయించిన వారు ఒక్కరు కాదని పోలీసులు చెబుతున్నారు. గురువారం విడుదల దృశ్యాలకు కట్టుబడి ఉన్నామని.. ఆ దృశ్యాల్లో ఉన్న వారే బాబుని కిడ్నాప్ చేసి ఉంటారని చెబుతున్నారు. గుంటూరుకు చెందిన మహిళలు మీడియా ముందుకు వచ్చిన వారు ఎందుకు వచ్చారో తెలియదంటున్నారు. బాబు ఆచూకీ కోసం ఆరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అదృశ్యమైన చిన్నారి బంధువులు ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాబు అదృశ్యం కేసులో నిందితులను పట్టుకోక పోవడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రభుత్వాస్పత్రి సిబ్బంది పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. -
బాబు అదృశ్యం కేసులో ట్విస్టులు కంటిన్యూ