
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి జస్మిత ఆచూకీని కడప పోలీసులు గురువారం కనుగొన్నారు. చిన్నారి అదృశ్యంపై జస్మిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు చిన్నారి జస్మిత ఆచూకీ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుని గాలించారు. దీంతో అదృశ్యమైన 8 గంటల్లోనే జస్మిత ఆచూకీ దొరకిందని ఎస్సై గాయత్రి తెలిపారు. జస్మిత దొరకడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జస్మిత ఆచూకీ కనుగొన్న పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై గాయత్రీ మీడియాకు తెలిపారు.