బెజవాడ ప్రభుత్వాసుపత్రిలో అదృశ్యమైన బాలుడిని త్వరలోనే గుర్తిస్తామని గవర్నర్పేట సీఐ పవన్కుమార్ రెడ్డి చెప్పారు.
విజయవాడ: బెజవాడ ప్రభుత్వాసుపత్రిలో అదృశ్యమైన బాలుడిని త్వరలోనే గుర్తిస్తామని గవర్నర్పేట సీఐ పవన్కుమార్ రెడ్డి చెప్పారు. ఈ కేసు విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ...దర్యాప్తులో ఎవరినైనా అనుమానితులుగానే పేర్కొంటామన్నారు.
దర్యాప్తు జరిగే క్రమంలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయని సీఐ చెప్పారు. ఎవరిని ఉద్దేశపూర్వకంగా దోషులుగా చూపించే ప్రయత్నం చేయలేదని వివరణ ఇచ్చారు. అదృశ్యమైన బాలుడి కోసం దర్యాప్తు కొనసాగుతూనే ఉందన్నారు. కొన్నిసార్లు దర్యాప్తులో నిర్దోషులుంటే వారిని తొలగించుకుంటూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తామని సీఐ పవన్కుమార్రెడ్డి చెప్పారు.