mgm hospital in Warangal
-
MGM ఆస్పత్రిలో రౌడీ రాణి రాజమ్మ అరెస్ట్
రామన్నపేట: ఎంజీఎంలో విధులకు వెళ్తున్న ఉద్యోగిని అడ్డగించి బెదిరించి దాడికి పాల్పడిన మహిళను అరెస్ట్ చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ టి.గోపి మంగళవారం తెలిపారు. ఇన్స్పెక్టర్ గోపి కథనం ప్రకారం.. బిల్ల సుమలత 15 సంవత్సరాల నుంచి ఎంజీఎంలో ఔట్సోరి్సంగ్గా, రెండు సంవత్సరాల నుంచి పేషెంట్ కేర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఈనెల 9న మధ్యాహ్నం షిఫ్ట్ విధుల్లో భాగంగా ఎంజీఎంలోని బయోమెట్రిక్ మెషీన్ వద్దకు వచ్చి హాజరు వేస్తుండగా ఆలకుంట రాజమ్మ.. సుమలతను అడ్డుకుంది. ‘నీ నియామకానికి జీఓ తెచ్చింది నేనే.. అందుకే రూ.2 లక్షలు లంచం ఇస్తావా లేదా..లేకుంటే నిన్ను చంపేస్తా’ అంటూ బెదిరిస్తూ చైన్‌తో విచక్షణరహితంగా సుమలతను కొడుతూ తన వద్ద ఉన్న పదివేల రూపాయలు లాక్కొని, ఆమె మొబైల్ ను కింద కొట్టిందని బాధిత మహిళ బిళ్ళ సుమలత ఫిర్యాదు చేసిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మంగళవారం ఉదయం నిందితురాలైన ఆలకుంట రాజమ్మను అరెస్టు చేసి, ఆమె వద్ద ఉన్న వెయ్యి రూపాయల నగదు, దాడికి ఉపయోగించిన ఇనుప చైన్ ను స్వాధీనపరచుకొని రాజమ్మను రిమాండ్ కు తరలించినట్లు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మట్టేవాడ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి, ఎస్సై విటల్ పాల్గొన్నారు. ఎంజీఎం ఘటనపై దోషులను శిక్షించాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డివరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఉద్యోగి సుమలతపై దాడికి పాల్పడిన దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించారు. సుమలతపై దాడికి పాల్పడిన రాజమ్మ గతంలో ఎంజీఎంలో విధులు నిర్వర్తించినప్పటికీ తనపై ఉన్న అభియోగాల నేపథ్యంలో విధుల నుంచి తొలగించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను ఊపేక్షించేది లేదని, నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వైద్యులు, సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్ప డితే రౌడీషీట్ ఓపెన్ చేసి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ప్రీతి ఆత్మహత్యయత్నంపై ప్రీతి ఫ్రెండ్స్ రియాక్షన్
-
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పాము కలకలం
-
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల బెడద
-
ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్ కన్నుమూత
-
ఎంజీఎం దవాఖాన పరిస్థితిపై ఎలుక చెప్పిన కథ.. మీరే చదువుర్రి ఓసారి..
‘ఎలుక తోలుదెచ్చి ఏడాది ఉతికినా.. నలుపు నలుపేగాని తెలుపుగాదు’ అని మా మీద ఎందుకు ఏడ్వడం? మేమెలాగూ మారం! మరి మీరు?. ఈ రోజు ఒకరిని కొర్కినం.. రేపు మరొకర్ని’ అంటూ ఎంజీఎం వైద్యులు, దవాఖాన పరిస్థితిపై ఎలుక చెప్పిన కథ! – ఎంజీఎం/వరంగల్ డెస్క్ ‘‘గీ ఎంజీఎంను.. ధర్మాసుపత్రని చెప్తుండ్రు కదా.. మరి ఇక్కడ్కి రావాల్నంటే రోగులు ఎందుకు భయపడుతుండ్రు. మేం ఎలుకలు, మా పెద్దన్న(పందికొక్కు)లు ఉన్నయనా? దవాఖాన ఆర్ఐసీయూలో ఓ రోగిని కొరికినమనా? సరే.. మొదటిసారి కొరికినం. అది మా తప్పే? ఆ తర్వాత ఐదు దినాల్లో అదే రోగిని మూడుచోట్ల కొరికినం. అధికారులు, వైద్యులు మీరంతా ఏం జేసిండ్రు. కట్టు కట్టి వదిలేసిండ్రు. అది మీ తప్పు కాదా? అంతా మాపై నెట్టేసి.. చేతులు దులుపుకుంటుండ్రు! ఒక్కటి చెప్పుండ్రి మేమిక్కడ(ఎంజీఎంలో) టికానా ఏర్పాటు చేసుకునేతందుకు కారణం మీ నిర్లక్ష్యం కాదా?’’ అని ఎలుక తన మనోగతాన్ని బయటపెట్టింది. సంబంధిత వార్త: రోగి కాళ్లు, చేతులు కొరికిన ఎలుకలు మరో ఎలుక మీసాలు రువ్వుతూ గళమెత్తింది! ‘‘ఇట్లా ఒక్కటేమిటి మీ తప్పులు లెక్కలేనన్ని సూసినం. కొన్ని చెప్త ఇనుండ్రి. ఏ రోజైనా ఇక్కడి సిబ్బంది యాళ్లకు విధులకు హాజరైండ్లా? శానిటేషన్ ఎట్లుంది? వార్డుల నిర్వహణ ఎట్లున్నది? రోగులేమో వందల్లో, వేలల్లో ఉంటరు.. వైద్యులేమో అతి తక్కువ మంది ఉంటరు? యాళ్లపొద్దుగాళ్ల ఇంటికాన్నుంచి అచ్చే రోగులకు సక్కటి వైద్యమందిత్తలేరు! ఎలుకలమై ఉండి మాకే బాధనిపిస్తుంది’’ అంటూ మీసం తిప్పుతూ ఆర్ఐసీయూ వార్డుకు వెళ్లిపోయింది. చిట్టెలుక స్వరం మార్చి(బాధతో) ‘‘ఎంజీఎం ఆస్పత్రిలో ఆర్ఎంఓ–1 గా వైద్యాధికారి డాక్టర్ హరీశ్రాజును గవుర్నమెంటు డిప్యూటేషన్‌పై వేరే జిల్లా డీఎంహెచ్‌ఓగా కొనసాగిస్తండ్లు. ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం ముగ్గురు ఆర్‌ఎంఓలు విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. ఒక్క అధికారి డిప్యుటేషన్లో ఉండగా, మరో ఒక్క ఆర్ఎంఓ స్థాయి అధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో ఒకే ఒక్క ఆర్ఎంఓ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. గీ ముచ్చట్లన్నీ దవాఖాన్ల సదువుకున్నోళ్లు చెప్తే విన్న’’ అంటూ చిట్టెలుక సరసరా ఆవరణలోని కలుగులోకెళ్లింది. ముక్కు మూసుకుంటూ మరో మూషికం.. ‘‘సుట్టపు సూపోలె ఎంజీఎంకు డాక్టర్లు వస్తరు. పోతరు! మేమే(ఎలుకలం) ఎప్పట్నుంచో ఈన్నే ఉంటన్నం. కొంతమంది డాక్టర్లు, సిబ్బంది సుట్టపు సూపోలే.. ఆస్పత్రికి వస్తున్నరు. రిజిస్టర్ల సంతకాలు పెట్టేతందుకే వస్తున్నరేమో అనే అనుమానం కల్గుతంది. వాళ్లతో పోలిస్తే మేమే నయం. మా పని మేం సక్కగ చేసుకుంటున్నం’’ అంటూ మూషికం దవాఖానలోని జంబుఖానను కొరుకుతూ చెబుతోంది! బరాబర్ అల్కిరి చేస్తం! ‘‘ఎంజీఎం మా అడ్డా. అవ్ బరాబర్ ఇక్కడ్నే ఉంటం. అల్కిరి జేస్తం. ఎవ్వర్నైనా కొరుకుతం. ఏ విభాగంలకైనా దూరుతం. అధికార్లు, వైద్యులు ఏం చేస్తరో చేసుకోండ్రి. మా జోలికొచ్చే ముందు శానిటేషన్ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యుండ్రి. ఆస్పత్రి ఆవరణల ఎక్కడపడితే అక్కడ చెత్త వేసుడు మానేయుండ్రి. ఆ తర్వాత మా జోలికి రండ్రి! అంటూ ఎలుకలన్నీ మూకుమ్మడిగా గొంతు కదిపాయి! -
మైనర్ బాలికతో ప్రేమ.. ఆపై పురుగుల మందు తాగి!
వరంగల్ : ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతి మృతి చెందగా, యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు, వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన ఓ కుటుంబం మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో కొంతకాలంగా నివాసముంటోంది. ఇదే జిల్లా గూడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ మైనర్ బాలికను ప్రేమలోకి దింపాడు. వీరి విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. దీంతో ఈనెల 27న నెక్కొండ వట్టెవాగు సమీపాన ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రేమ జంట పురుగుల మందు తాగి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ యువతి సోమవారం ఉదయం మృతి చెందగా, యువకుడు మృత్యువుతో పోరాడుతున్నట్లు సమాచారం. దీనిపై ఎస్సై నాగరాజును వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
యూనివర్సీటీ లైబ్రరీలో చదువుతూ..ఉద్యోగం రాలేదని..
గూడూరు: ఓ నిరుద్యోగ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని కేయూ గ్రౌండ్ వద్ద చోటుచేసుకుంది. ఆ యువకుడు తీసిన వీడియో, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని తేజావత్ రాంసింగ్‌తండాకు చెందిన బోడ సునీల్ నాయక్ 2016లో డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే తపన తో కాకతీయ యూనివర్సీటీ సమీపంలో స్నేహితులతో కల సి ఉంటున్నాడు. తరచూ యూనివర్సిటీ లైబ్రరీకి వచ్చి పోటీ పరీక్షలకోసం చదువుకునేవాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సునీల్ తన సోదరుడికి ‘ఐ మిస్ యూ’ అంటూ ఫోన్లో మెస్సెజ్ పంపించగా.. అతను తిరిగి ఫోన్ చేయడంతో తాను పురుగు మందు తాగినట్లు చెప్పాడు. దీంతో అతని సోదరుడు 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా.. సిబ్బంది మద్యాహ్నం 12 గంటల సమయంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా సునీల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 48 గంటలు దాటితే కాని ఏ విషయం చెప్పలేమని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేస్తున్నారు. -
ఎంజీఎంలో మరింత మెరుగైన సేవలు!
సాక్షి, వరంగల్: ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై ఎంతో నమ్మకముందని, అందుకే ఎక్కడా నయం కాని వ్యాధులతో బాధపడే అనేక మంది ప్రభుత్వ దవాఖానాలకే వస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిపై నమ్మకం మరింత పెరిగేలా సదుపాయాలు క్పలించడమే కాక, కరోనా బాధితుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఒక్కశాతం కూడా మించని రోగులు మాత్రమే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. 99శాతానికి మించి ప్రజలు ప్రభుత్వ వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారని మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా పరిస్థితులు, ఎంజీఎంలో వైద్యసేవలు, వరదల తర్వాత వరంగల్ నగరంలో నాలాలపై కబ్జాల తొలగింపుపై హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండా ప్రకాశ్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సీపీ ప్రమోద్ కుమార్ తదితరులతో మంత్రి దయాకర్‌రావు సోమవారం సమీక్షించారు. ఆ తర్వాత మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. నెల రోజుల్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి వరంగల్ ఎంజీఎంలో సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఎంజీఎంలో ప్రస్తుతం 340 పడకలు అందుబాటులో ఉండగా, అందులో 134 పడకలు ఖాళీగా ఉన్నాయని, 60 వెంటిలేటర్లకు గాను నలుగురు మాత్రమే కరోనా బాధితులు ఉన్నారని చెప్పారు. ఇక 88 ఆక్సీజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం 129 మంది కరోనా బాధితులు, 77 మంది ‘సారీ’ పేషంట్లు కలిపి మొత్తం 206 మంది ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రి వివరించారు. త్వరలోనే మరో 100 వెంటిలేటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. కాగా, కేఎంసీ ఆవరణలోని పీఎంఎస్ఎస్వై ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్ది నెల రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురానున్నామని వెల్లడించారు. కాగా, రోగులకు నమ్మకం కలిగేంచేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని, ప్రజలు కూడా ఎవరో చెప్పే మాటలు విశ్వసించకుండా ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాభీష్టం మేరకే నాలాల కూల్చివేత వరంగల్ నగరంలో వరద పరిస్థితులు అదుపులోకి వచ్చాక ప్రజాభీష్టం మేరకే నాలాల కబ్జాల కూల్చివేత ప్రారంభమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. 27కి.మీ. పొడవున విస్తరించిన నగర ప్రధాన నాలాలపై కబ్జాలను తొలగించేందుకు నాలుగు బృందాలు పని చేస్తుండగా, ఇప్పటి వరకు 23 కబ్జాలను తొలగించామని వివరించారు. మిగతా వాటిని యుద్ధ ప్రాతిపదికన 10 రోజుల్లోగా కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. వరదల సమయంలో తక్షణ సాయంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన రూ.25కోట్లతో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే, వర్షంతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు కార్పొరేషన్ నిధులను వినియోగించుకోవాలని చెప్పారు. ఈనెల 4వ తేదీన వరంగల్ నగరంలో పర్యటించి తిరిగి సమీక్ష చేస్తామని తెలిపారు. విమానాశ్రయం పునరుద్ధరణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో విమానాశ్రయ పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆధికారుల సూచనల మేరకు 1,140 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు కావాల్సిన 430 ఏకరాల భూమిని రైతుల నుంచి సేకరిస్తామని తెలిపారు. ఖిలా వరంగల్ మండలం మామునూరులోని పురాతన కాలం నాటి విమానాశ్రయాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆధికారులు, ప్రభుత్వ చీఫ్‌విఫ్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండా ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి రన్‌వే, మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించారు. ఇప్పటి వరకు ఏయే గ్రామాల్లో ఎంత భూమిని సర్వే చేశారని ఆరా తీశారు. ఆనంతరం మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం రాకముందే 1930లో 706 ఎకరాల విస్థీర్ణంలో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.ఈ విమానాశ్రయాన్ని పునఃప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా రన్‌వే పెంపునకు భూసేకరణ చేయాల్సి ఉందని, ప్రధానంగా నక్కలపెల్లి, గాడిపెల్లి గ్రామ శివారుల్లో రైతుల నుంచి 430 ఎకరాల భూమి సేకరించనున్నట్లు తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులకు మరోచోట భూమి లేదా నగదు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి వెల్లడించారు. కాగా, రన్‌వే విస్తరణకు అడ్డుగా ఉన్న వరంగల్ – నెక్కొండ ప్రధాన ఆర్అండ్బీ రోడ్డును మార్చనున్నామని తెలిపారు. -
పేద ప్రజలకు అందని ద్రాక్ష
గుండెనొప్పితో బాధపడుతున్న ఖిలావరంగల్ చెందిన ఉప్పలయ్య, సంగెంకు చెందిన సాగర్ చికిత్స కోసం 15 రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చారు. వారిని పరీక్షించిన వైద్యులు స్టంట్ అవసరమని గుర్తించారు. గుండె వైద్య నిపుణులు లేకపోవడంతో వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేక హైదరాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. సాక్షి, ఎంజీఎం(వరంగల్) : ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ‘యమ’జీఎంగా మారుతోంది. ధర్మాస్పత్రిలో పూర్తిస్థాయి వైద్యసేవలు అందక రోగుల విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిన సూపర్‌స్పెషాలిటీ వైద్యులు కొనసాగారు.. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆ కాంట్రాక్టు వైద్యులను సైతం తొలగించారు. నాలుగేళ్లుగా సూపర్‌స్పెషాలిటీ వైద్యుల లేమీతో పలు విభాగాలు మూతపడాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలో రోగులకు అందించే సేవలను మెరుగుపరుస్తున్నామని ఎంజీఎంను సందర్శించిన సమయంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పినా.. నెలలు గడుస్తున్నా ఏ మాత్రం మార్పు రాలేదు. ఒక పక్క వైద్యుల లేమి.. మరో ఔషధాల కొరత.. వెరసి రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. విభాగాలకు వైద్యులే లేరు.. ఎంజీఎం ఆస్పత్రికి ఉమ్మడి వరంగల్ నుంచే కాకుండా కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి రోగులు మెరుగైన వైద్యం కోసం వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కీలక విభాగాల్లో వైద్యులు లేకపోవడం గమనార్హం. నాలుగేళ్లుగా కార్డియాలజీ, న్యూరాలజీ, యురాలజీ, నెప్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వంటి విభాగాల్లో ఒక్క వైద్యుడు కూడా లేక ఆయా విభాగాలకు తాళం వేయాల్సిన దుస్థితి నెలకొంది. మెడిసిన్ విభాగానికి చెందిన వైద్యులతో నామమాత్రంగా సేవలు అందిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మెరుగైన వైద్యం అవసరమైతే చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. గుండె జబ్జులకు అందని వైద్యం.. పేద ప్రజలకు గుండె నొప్పి వస్తే ప్రాణాలు గాలిలో కలవాల్సిందే. ఎంజీఎం ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగానికి కొన్నేళ్లుగా వైద్యుల నియమాకం లేక పోవడంతో గుండె నొప్పితో వచ్చే రోగులకు పూర్తి స్థాయి వైద్యం అందడంలేదు. కొద్దోగొప్పో ఆర్థికంగా ఉన్న వారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు. 2006 సంవత్సరంలో ఎంజీఎం ఆస్పత్రిని 600 పడకల నుంచి వెయ్యి పడకలకు అప్‌గ్రేడ్ చేసి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సేవలను ప్రారంభిం చారు. ఆ సమయంలో రెండు సంవత్సరాలు కార్డియాలజీ, న్యూరాలజీ విభాగాల్లో మెరుగైన వైద్యసేవలు అందగా.. అనంతరం ఆ సేవలు రోజురోజుకూ క్షీణిస్తూ పూర్తిస్థాయిలో విభాగాలు మూతపడినా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ఏళ్ల తరబడి అందని కిడ్నీ వైద్యం.. కిడ్నీల వ్యాధితో బాధపడుతూ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే వారికి నెప్రాలజీ, యురాలజీ వైద్యులు చికిత్స అందించాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో 40 పడకల డయాలసిస్ సెంటర్ నిర్వహణకు నెప్రాలజీ వైద్యుడి నియామకం తప్పనిసరి. నెప్రాలజీ, యూరాలజీ వైద్యులు లేకుండానే డయాలసిస్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు గత్యంతరం లేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. మంత్రులు సమీక్షించినా.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని వైద్యారోగశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించిన సమయంలో సమస్యలు తెలుసుకుని సమీక్షలు నిర్వహించారు. సేవలను మెరుగుపరుస్తామని హామీ సైతం ఇచ్చారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఒక పక్క వైద్యులు పదవీ విరమణ పొందుతున్నారు. కొత్తవారిని నియమించడంలేదు. ఉన్నవారిపై పని ఒత్తిడి పెరుగుతోంది. పలు సూపర్ స్పెషాలిటీ విభాగాలు మూతపడుతున్నా ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సమీక్షలు, సందర్శనలనతో సరిపెట్టకుండా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది. క్షతగాత్రులకు కరువైన భరోసా.. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి తలకు తీవ్రగాయాలై ప్రాణపాయ స్థితిలో ఎంజీఎంకు చవ్చే క్షతగాత్రుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే రోగులకు అత్యవసరంగా సీటీ, ఎంఆర్ఐ వంటి స్కానింగ్ నిర్వహించి వారికి ఏ మేర రక్తస్రావం జరిగింది.. ఏ మేరకు రక్తం గడ్డ కట్టిందనే విషయాన్ని న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్ డాక్టర్లు తెలుసుకుని వైద్యసేవలు అందించడంతో పాటు అవసరమైన శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విభాగాల్లో ఒకే ఒక్క అసిస్టెంట్ వైద్యుడు ఉండడంతో పూర్తిస్థాయిలో సేవలు అందక క్షతగాత్రులకు ప్రాణసంకటంగా మారింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. ఎంజీఎం ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వైద్య నిపుణులు, వైద్యుల కొతర తదితర అంశాలను రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నాం. భర్తీ ప్రక్రియ త్వరలో జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వివిధ విభాగాల వైద్యులతో సాధ్యమైనంత వరకు పేద రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. – శ్రీనివాస్, ఎంజీఎం సూపరింటెండెంట్ -
ఎంజీఎంలో తప్పిపోయిన బాలుడు
సాక్షి, వరంగల్ : నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో మధ్యాహ్నం ఖిలావరంగల్ తూర్పు కోటకు చెందిన పెద్దోజు యశ్వంత్(7) అనే బాలుడు తప్పిపోయినట్లు తండ్రి నర్సింహచారి ఫిర్యాదు చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ జీవన్‌రెడ్డి తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం తన ఇద్దరు కుమారులతో ఎంజీఎం అస్పత్రికి తీసుకురాగా చిన్నకుమారుడు యశ్వంత్ తప్పిపోయినట్లు తెలిపారు. తప్పిపోయిన బాలుడు చిన్న కటింగ్ క్రాఫ్‌తో మెరూన్ కలర్ నెక్కర్, బ్లూ కలర్ షర్ట్ స్కూల్ డ్రెస్ వేసుకున్నాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎంజీఎం అస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిస్తే మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
వైద్యులూ... తీరు మార్చుకోవాలి: ఎర్రబెల్లి
సాక్షి, ఎంజీఎం,(వరంగల్) : ‘పేద ప్రజలకు వైద్యసేవలందించేందుకు సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడం బాధాకరం.. ప్రైవేట్ ఆస్ప్రతుల్లో విధులు నిర్వర్తించడాన్ని మేము తప్పు పట్టడం లేదు. ఉదయం 9 గంటలకు హాజరై 8 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సిందే. ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో చాలా పొరపాట్లు కనిపించాయి.. మొదటిసారి తనిఖీ చేశాం కాబట్టి విధులు హాజరు కాని వైద్యులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలో.. ఏ విధంగా వారికి కౌన్సిలింగ్ చేయాలో కలెక్టర్, సూపరింటెండెంట్‌కు వివరించాను. మరోసారి ఈ విధంగా జరిగితే సీరియస్‌గా చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రికి కావాల్సిన వసతులు, సౌకర్యాలు సిబ్బందిని సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంజీఎం ఆస్పత్రిలో మెరుగైన సేవలందించేందుకు ఎన్ని నిధులు ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నారని.. సీనియర్ వైద్యులు అందుబాటులో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. వారం రోజుల్లో దాతలు అందించిన రూ.కోటి విరాళంతో ఫర్నీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. కలెక్టర్‌తో కలిసి ఆకస్మిక తనిఖీ వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌తో కలిసి ఉదయం 10 గంటల సమయంలో ఆకస్మికంగా వచ్చారు. మొదట మెడికల్ ఓపీ విభాగాన్ని సందర్శించి రోగులకు అందుతున్న చికిత్సలను పరిశీలించారు. ఆ సమయంలో ఓపీ విభాగంలో ఉండాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకపోవడంతో ఆరా తీశారు. అయితే, మంత్రి తనిఖీకి వచ్చారని తెలుసుకున్న వైద్యులు పరుగు పరుగున చేరుకున్నారు. అనంతరం కార్డియాలజీ విభాగాన్ని సందర్శించి మంత్రి విధుల్లో ఉండాల్సిన వైద్యురాలు మమత ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. ఆమె విధులు రాకపోవడమేమిటని సూపరింటెండెంట్ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ సాబ్.. ఏం చేద్దాం.. ఎంజీఎం ఆస్పత్రిలో ఓపీ విబాగాన్ని తనిఖీ చేసిన సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాకుండా జూనియర్ డాక్టర్లు, పీజీ వైద్యులు మాత్రమే కనిపించడంతో మంత్రి దయాకర్‌రావు నివ్వెరపోయారు. ‘కలెక్టర్ సాబ్.. ఎంజీఎంను ఎట్టా బాగు చేద్దాం’ అంటూ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో చర్చించారు. అనంతరం ఈఎన్టీ విభాగానికి చేరుకుని ప్రొఫెసర్ ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఈఎన్టీ ప్రొఫెసర్ డాక్టర్ పరశురాములుతో ఫోన్లో మాట్లాడారు. కేఎంసీలో ఉన్నానని ఆయన సమాధానం చెప్పగా సరైన సమాధానం కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సర్జికల్ విభాగానికి వెళ్లగా అక్కడ సైతం వైద్యులు లేకపోవడంతో ఫోన్లో డాక్టర్ రాజారాంతో మాట్లాడారు. తా ను సెలవులో ఉన్నానని సమాధానం వచ్చింది. అభివృద్ధి పనుల పరిశీలన రూ. 4 కోట్లతో దఫాల వారీగా ఎంజీఎం ఆస్పత్రిలో చేపడుతున్న పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఎస్ఎంఎస్ఐడీసి అధికారులతో కలిసి పరిశీలించారు. ఐఎంఎసీ వార్డులో మరమ్మతుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం క్యాజువాలిటీ విభాగానికి చేరుకుని వైద్యం అందుతున్న తీరుపై రోగులతో మంత్రి మాట్లాడి తెలుసుకున్నారు. నలుగురు వైద్యులకు షోకాజ్ నోటీసులు ఎంజీఎం ఆస్పత్రిని మంత్రి దయాకర్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్బంగా విధులకు హాజరుకాని వైద్యులు మమత, రాజారం, పరశురాములు, జె. వెంకటేశ్లర్లకు మంత్రి, కలెక్టర్ ఆదేశాలతో ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం వైద్యులు ఇచ్చే వివరణతో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. బయోమెట్రిక్ అమలు చేయాల్సిందే.. పేద ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది హాజరును నమోదు చేసేందుకు బయోమెట్రిక్ విధానాన్ని నూరు శాతం అమలు చేయాల్సిందేనని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు. మంత్రి తనిఖీ చేసిన అనంతరం వివిధ విభాగాధిపతులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఔట్ పెషెంట్ విభాగంలో వైద్యులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీలో చికిత్స అందించే సమయంలో వైద్యనిపుణులు తప్పకుండా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. విభాగాధిపతులు సక్రమంగా విధులు నిర్వర్తించాలన్నారు. మంత్రి దయాకర్‌రావు వ్యక్తిగత చొరవతో నిధులు సమీకరించి సూపర్‌స్పెషాలిటీ సేవలను అందరికీ అందుబాటులోకు తెచ్చేందుకు చేస్తున్న కృషికి అండగా నిలవాలని సూచించారు. డ్యూటీ సమయంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో స్పందించి వైద్యసేవలందించాలని కోరారు. అనంతరం ఆస్పత్రుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఇంజ నీరింగ్ అధికారులతో కలిసి చర్చించారు. -
గర్భిణి వేదన.. అరణ్య రోదన..
ఏటూరునాగారం: ఓ గర్భిణి డెలివరీ కోసం 4 రోజులపాటు ప్రభుత్వ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా వైద్యులు స్పందించలేదు. చివరకు బిడ్డను గర్భంలోనే పోగొట్టుకున్నా ఆ మృత శిశువునూ తొలగించని ఘటన ములుగు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపల్లికి చెందిన ఎంపెల్లి స్వరూప రెండో కాన్పు కోసం ఈ నెల 1న మంగపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. అదేరోజు ఆమె ఎంజీఎంకు వెళ్లినా చేర్చుకోకపోవడంతో ఆరుబయటే వర్షంలోనే తడుస్తూ రేకులషెడ్డులో కాలం గడిపింది. మరుసటిరోజు వైద్యుల సూచన మేరకు బయట స్కానింగ్ తీసుకుని రిపోర్టులు తెచ్చాక 3వ తేదీ ఉదయం పరిశీలించి గర్భంలో శిశువు మరణించిందని వైద్యులు చెప్పారు. శిశువును కడుపులో నుంచి తొలగించకుండా, పరిస్థితి విషమం గా ఉందని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. చేతిలో చిల్లి గవ్వ లేని ఆ నిరుపేద దంపతులు ఎలాగోలా గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి వైద్యులు ‘సమ్మెలో ఉన్నామని, ఎలాంటి ఆపరేషన్లు చేయబోమని’స్వరూపను బయటకు పంపించి గేట్లు మూసివేశారు. ఆశా వర్కర్ విజయలక్ష్మి సహాయంతో ఉన్నతాధికారులకు సమాచారమివ్వగా ములుగు ఆస్పత్రికి తీసుకురావాలని వారు చెప్పారు. తీరా అక్కడికి వెళ్లాక ఆదివారం సెలవు రోజు కావడంతో గైనకాలజిస్ట్, మత్తు వైద్యులు లేక డెలివరీ చేయలేదు. మృతశిశువు గర్భంలోనే ఉండడంతో ఆ బాధకు తట్టుకోలేక స్వరూప రోదిస్తున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు. -
అందని అత్యవసర సేవలు
ఎంజీఎం : ప్రజా ప్రతినిధుల పట్టింపులేని తనం.. రాష్ట్ర స్థాయి అధికారుల నిర్ణయం పేద రోగుల పాలిట శాపంగా మారాయి. పరికరాల మరమ్మతుకు సేబర్–సిందూరి ఏజెన్సీతో చేసుకున్న ఒప్పందం ఇటూ ఎంజీఎం పరిపాలనాధికారులకు.. అటూ ఆస్పత్రికి వచ్చే బాధితులకు నరకయాతన చూపిస్తున్నాయి. ఇలా ఆస్పత్రి అత్యవసర విభాగంలో సేవలు నిలిచిపోవడం.. ఆస్పత్రి చుట్టు ఉన్న ప్రైవేట్ ల్యాబ్, నర్సింగ్‌హోమ్‌ల దళారులకు వరంగా మారింది. సూపర్‌స్పెషాలిటీ సేవల లేమీతో కొంత మంది దళారులు అత్యవసర కేంద్రం వద్ద నిత్యం అడ్డా వేస్తూ... క్యాజువాలిటీ వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందితో చేతులు కలిపి యథేచ్చగా రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. దీనికి తోడు రక్త పరీక్షల పరికరాలు మరమ్మతులకు నోచుకోకపోవడం సైతం వారికి మరో ఆదాయ వనరుగా మారాయి. దీంతో ఆస్పత్రికి వచ్చే పేద రోగుల జేబులకు చిల్లు పడుతోంది. ఆస్పత్రిలోని సమస్యల పరిష్కారానికి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి 20 రోజులు గడస్తున్న చిన్న పాటి సమస్యలు సైతం పరిష్కారం కాకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కు.. అత్యవసర సేవలకు అపద్బాంధువుగా గుర్తుకు వచ్చే ధర్మాస్పత్రిలో రోజు, రోజుకూ వైద్యసేవలు పరిస్థితి అధ్వానంగా తయారు కావడంతో రోగులు నరకయాతన పడాల్సి వస్తోంది. ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యసవర విభాగానికి (క్యాజువాలిటీ) వివిధ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, క్రిమి సంహారక మందు తాగి ప్రాణాలతో కొట్టుమిట్టాడే బాధితులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. వీరికి మెరుగైనా వైద్య చికిత్సలు అందించేందుకు, పూర్తి స్థాయిలో వారి యొక్క పరిస్థితులను గమనిస్తూ చికిత్సలు అందిచేందుకు క్యాజువాలిటీలోని ఎమర్జెన్సీ ల్యాబ్ ద్వారా పరీక్షలు చేస్తుంటారు. అయితే గత కొన్ని నెలలుగా ఎమర్జెన్నీ ల్యాబ్‌లో లక్షల రూపాయాలు విలువ చేసే పరికరాలు సాంకేతిక లోపం వల్ల పనిచేయడం లేదు. అయితే వీటిని వెంటనే మరమ్మతులు చేయించే పరిస్థితి లేకపోవడంతో అత్యసవరంగా చికిత్సలు అందించేందుకు అవసరమయ్యే రక్తపరీక్షలు కోసం రోగుల బంధుమిత్రులు ప్రైవేట్ కేంద్రాలకు పరుగులు తీసి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. 8 నెలలుగా నిలిచిపోయిన సీబీపీ పరీక్షలు ఎంజీఎం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ ల్యాబ్‌లో గత 8 నెలలుగా సీబీపీ పరికరంలో సాంకేతిక లోపం ఏర్పడి మరమ్మతుకు నోచుకోకపోయిన పట్టించుకునే వారే కరువయ్యారు. ఆస్పత్రికి తీవ్ర కడుపునొప్పి, అపెండక్స్ వ్యాధితో బాధపడే రోగులతో పాటు రక్తహీనత కలిగిన రోగులకు సీబీపీ(కంప్లీట్ బ్లడ్ పిక్చర్) పరీక్షలు తప్పని సరి. ఇలాంటి రోగులకు సీబీపీ పరికరం ద్వారా ప్లేట్లెట్ కౌంట్, హెచ్బి, డిఫినేషియల్ కౌంట్ వంటి రక్త నివేదికల ఆధారంగా వారికి వైద్య చికిత్సలు అందిస్తుంటారు. అంతేకాకుండా ఓపీ విభాగంలోని రోగులకు రక్త పరీక్షలు నిర్వహించే పాథాలాజీ విభాగంలో సుమారు 45 లక్షలతో నూతనంగా కొనుగోలు చేసిన పరికరం సైతం పనిచేయకపోవడంతో అది కాస్తా నిరుపయోగంగా మారింది. అతి కష్టం మీద అక్కడి సిబ్బంది రోజు మ్యానువల్ పద్ధతిలో 40 మంది ఓపీ రోగులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో సుమారు ప్రతి రోజు 100 నుంచి 150 మందికీ సీబీపీ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఈ పరికరాలు పనిచేయకపోవడంతో సుమారు వంద మందికి పైగా రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ఆశ్రయిస్తూ ఒక్కొక్కరు రూ. 300 లు ఖర్చు చేయక తప్పడం లేదు. మరమ్మతులకు నోచుకోని సీబీపీ పరికరం సెమీ ఆటో ఎనలైజర్ పరికరం 4 నెలలుగా మూలకే ఎంజీఎం ఎమర్జెన్సీ ల్యాబ్‌లోని సెమీ ఆటో ఎనలైజర్ పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఆ పరికరం నిరుపయోగంగా మారింది. దీంతో కిడ్నీ వ్యాధితో బాధపడే రోగులకు నిర్వహించే సీరమ్ క్రియాటిన్ పరీక్షలు నాలుగు నెలలుగా చేయడం లేదు. ఈ రక్త పరీక్షల కోసం రోగులు ప్రైవేట్ కేంద్రాలకు వెళ్ళక తప్పడం లేదు. డయాలసిస్ చేసుకునే రోగులకు సిరమ్ క్రియాటిన్ పరీక్షలు తప్పనిసరి. ఈ వ్యాధితో బాధపడే రోగులు కొంత మంది వారానికి రెండు, మూడు సార్లు సైతం సీరమ్ క్రియాటీన్ పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంది. నిరుపయోగంగా సెమీ ఆటో ఎనలైజర్ మూడు నెలలుగా ఏబీజీ పరికరం .. ఎంజీఎం అత్యవసర విభాగంలో ఏబీజీ పరికరం ద్వారా అందించే రక్త పరీక్షల నివేదికలు కీలకం. ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి ప్రతి రోజు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వారిని చికిత్స నిమిత్తం తరలిస్తుంటారు. వీరికి ఏబీజీ పరీక్షలు అవసరం. ఈ పరికరం ద్వారా రక్తంలో బ్లడ్, గ్లూకోజు, హెచ్‌బీ లెవల్స్ తెలిపే నివేదిక ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా వారికి వైద్యచికిత్సలు అందిస్తుంటారు. ఈ పరికరం గత మూడు నెలల క్రితం సాంకేతిక లోపం ఏర్పడి పనిచేయకపోయినా దృష్టి సారించిన దాఖాలా ల్లేవు. ప్రైవేట్ సెంటర్లలో ఏబీజీ పరీక్షల కోసం సుమారు 1100 రూపాయాలు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఈ పరికరాన్ని నిర్ణీత ఉష్ణోగ్రతలో ఉంచి రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ ల్యాబ్ రెండు ఏసీలు ఉండగా..ప్రస్తుతం ఓకే ఒక్క ఏసీ మాత్రమే పనిచేస్తుంది. ఏబీజీ పరికరంలో సాంకేతిక లోపం -
ఎంజీఎం పిల్లల విభాగంలో షార్ట్‌సర్క్యూట్
ఎంజీఎం: వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమో రియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలోని పిల్లల విభాగం లో గురువారం షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. నవజాత శిశు సంరక్షణ కేంద్రంలోని ఏసీలో పొగ లు రావడాన్ని గమనించిన శిశువుల తల్లిదండ్రు లు, కుటుంబీకులు చిన్నారులను ఎత్తుకుని బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని గమనించిన ఎంజీఎం వైద్య సిబ్బంది వార్డులోని విలువైన వైద్యపరికరాలను బయటకు తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఏసీ పేలడంతో వార్డులో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకు న్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనలో చిన్నారులకు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఇటు వైద్యసిబ్బంది.. అటు వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఏసీ పేలిన వార్డులో చికిత్స పొందుతున్న 23 మంది నవజాత శిశువులు సురక్షితంగా ఉన్నారని ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్, పీడియాట్రిక్ విభాగాధిపతి విజయ్‌కు మార్ తెలిపారు. వీరిని ఆస్పత్రిలోని వేరే వార్డుకు తరలించి చికిత్స అందజేస్తున్నట్లు వెల్లడించారు. -
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
-
పైసలిస్తేనే పోస్ట్‌మార్టం..
ఎంజీఎం (వరంగల్): మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రిలోని మార్చురీలో ప్రతి రోజు సుమారు ఐదు నుంచి ఎనిమిది శవాలకు పోస్టుమార్టం జరుగుతుంది. మృతుల కటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం నిత్యం మార్మోగుతూ ఉంటుంది. ఆ హృదయ విదారకర దృశ్యాలు చూస్తే ఎవరికైనా కంట నీరు రాక మానదు. కానీ.. ఎంజీఎం మార్చురీలో కాసులకు కక్కుర్తి పడే పలువురు వైద్యులు, సిబ్బందికి వీరి కన్నీళ్లు కనపడవు.. వీరి ఆర్తనాదాలు వినపడవు. పైసలిస్తేనే పోస్ట్‌మార్టం చేస్తామని కరాఖండీగా చెబుతున్నారు. గతంలోనూ ఇలాం టి ఘటనలు చోటుచేసుకోగా విమర్శలు వెల్లువెత్తాయి. అయినా.. అవినీతికి అలవాటుపడిన కొంత మంది వైద్యు లు, సిబ్బందిలో మార్పు రాలేదనడానికి సోమవారం చోటు చేసుకున్న ఘటనే ఉదాహరణ. 3 గంటలపాటు నిలిచిన సేవలు.. మృతదేహాలకు పోలీసులు పంచనామా నిర్వహించిన తర్వాత ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. సోమవారం ఎంజీఎం మార్చురీలో ఎనిమిది మృతదేహాలు ఉండగా.. ఉదయం కొన్నింటికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మధ్యాహ్న భోజనానికి వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల వరకు కూడా తిరిగి రాలేదు. అప్పటికే పోస్టుమార్టం కోసం పంచనామా పూర్తి చేసుకుని వేచి చూస్తున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మార్చురీ గేటు వద్ద మూకుమ్మడిగా ఆందో ళన చేపట్టారు. వైద్యుల పనితీరుపై మండిపడ్డారు. వైద్యు లు, సిబ్బంది అక్రమ వసూళ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసన మండలిలో చర్చ జరిగినా.. ఎంజీఎం మార్చురీలో పైసలిస్తే పోస్టుమార్టం చేస్తున్నారని గతంలో సోషల్ మీడియాలో క్లిప్పింగ్స్ హల్చల్ చేశాయి. మార్చురీలో కింది స్థాయి సిబ్బంది బహిరంగంగా పైసలు డిమాండ్ చేస్తున్న క్రమంలో మృతుల కుటుంబ సభ్యులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. విస్తృతం ప్రచారం కావడంతో ఇక్కడి వైద్యులు, సిబ్బంది తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై రాష్ట్ర స్థాయి అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు స్పందించారు. దీంతో ఆ వీడియోలో కనిపించినటువంటి నాలుగో తరగతి ఉద్యోగులపై కాకతీయ మెడికల్ కళాశాల అధికారులు చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు. వసూలు చేసిన డబ్బులను పంచుకున్న పలువురు వైద్యులను వదిలేశారని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఎంజీఎం మార్చురీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి రూ. 5 వేలు ఖర్చవుతుందని అప్పటి కలెక్టర్ అమ్రపాలికి ఓ ఎంపీపీ ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ఓ ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి ఎంజీఎం మార్చురీ అవినీతిపై చర్చించారు. ఈ ఘటనల తర్వాత కొద్ది రోజుల పాటు మార్చురీలో పైసల వసూళ్లు ఆగినప్పటికీ.. దందా మళ్లీ మొదలైంది. రూ. 5 వేలు ఖర్చు చేయాల్సిందే.. ఎంజీఎం మార్చురీకి పోస్టుమార్టం కోసం వస్తే రూ.5 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పైసలు ఎందుకని ప్రశ్నిస్తే ఈ రోజు పోస్టుమార్టం కాదు. రేపు అవుతుందని బెదిరిస్తున్నారు. గత్యంతరం లేక డబ్బులివ్వక తప్పడం లేదు. మృతదేహాన్ని కోసే వ్యక్తికి వెయ్యి, వైద్యునికి వెయ్యి, అంబులెన్స్‌కు రెండు వేలు చెల్లిస్తే గానీ.. ఇంటికి మృతదేహాం తీసుకెళ్లలేని దుస్థితి. – జమలాపురం నగేష్, ఓ మృతుడి బంధువు ఫోరెన్సిక్ సిబ్బంది కొరత ఉంది.. కాకతీయ మెడికల్ కళాశాలలో ఫోరెన్సిక్ వైద్యుల కొరత ఉంది. ప్రస్తుతం ఇద్దరు వైద్యులు మాత్రమే ఉన్నారు. విధుల్లో కొనసాగుతున్న అసోసియేట్ ప్రొఫెసర్ కోర్టు డ్యూటీపై వెళ్లగా.. మరో వైద్యుడు మధ్యాహ్నం వైద్యవిద్యార్థులకు తరగుతులు నిర్వహిస్తున్నారు. దీంతో మార్చురీకి నాలుగు గంటలకు వెళ్లాల్సి వచ్చింది. మార్చురీలో అవినీతి నా దృష్టికి రాలేదని, అవినీతి జరుగకుండా సీసీ కెమెరాలతో పాటు అన్ని రకల చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సంధ్య, కేఎంసీ ప్రిన్సిపాల్ మార్చరీ వద్ద ఆందోళన చేస్తున్న మృతుల కుటుంబ సభ్యులు -
వరంగల్ ఎంజీఎంలో దారుణం
ఎంజీఎం : వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమో రియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో మృతదేహాలకు భద్రత కరువైంది. మార్చురీ నిర్వహణపై అధి కారుల పట్టింపులేనితనం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఫ్రీజర్లలో భద్రపరిచిన మృతదేహాలను ఎలుకలు కొరికేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు జరిగినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఓ వికలాంగుడి మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్న ఘటన సోమవారం వెలుగుచూసింది. ఆత్మహత్యకు పాల్పడిన ఒకరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం మార్చురీలో భద్రపరచగా తెల్లవారేసరికి ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఫ్రీజర్‌లోని మృతదేహాన్ని.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సుబే దారి వికలాంగుల వసతిగృహంలో రామ్మోహన్ అనే వికలాంగుడు ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం లేదనే మనస్తాపంతో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వసతి గృహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. రామ్మోహన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని తరలించేది లేదని యాక్షన్ కమిటీ నేతలు భీష్మించుకు కూర్చు న్నారు. ఈ క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదివారం రాత్రి ఎంజీఎం మార్చురీకి తరలించారు. సోమవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు.. ఫ్రీజర్‌లోని మృతదేహం చేతి భాగాన్ని ఎలుకలు కొరకడాన్ని గమనించి నివ్వెరపోయారు. ఎనిమిది ఫ్రీజర్లకు రెండే కొన్ని నెలల క్రితం ఎంజీఎం మార్చురీలో ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరకడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మార్చురీ అభివృద్ధిపై దృష్టి సారిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయినా పరిస్థితి ఏమాత్రం మారలేదు. మార్చురీలో 8 ఫ్రీజర్లు పనిచేయాల్సి ఉండగా.. ప్రస్తుతం రెండే అందుబాటులో ఉన్నాయి. దీంతో మార్చురీకి రెండు కన్నా ఎక్కువ మృతదేహాలొస్తే వాటికి రక్షణ లేకుండాపోతోంది. మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటనపై కుటుంబ సభ్యులు, బం«ధుమిత్రులు సిబ్బందిని ప్రశ్నించగా.. తరుచూ జరిగే ఘటనలేనని పేర్కొనడం గమనార్హం. పాత భవనం.. సిబ్బంది కొరత.. ఎంజీఎం మార్చరీ ప్రాంగణమంతా చెత్తాచెదారంతో నిండిపోయి ఎలుకలకు స్థావరంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. ఫోరెన్సిక్ వైద్యులు ఎనిమిది మంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇద్దరే విధుల్లో ఉన్నారు. ఆరుగురు నాలుగో తరగతి సిబ్బందికిగాను ముగ్గురే ఉండడంతో తిప్పలు తప్పడం లేదు. మార్చురీ భవనం పాతబడటంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని ఫోరెన్సిక్ వైద్యులు చెబుతున్నారు. -
రూ.3 వేలు వసూలు చేశారు!
‘రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మా బంధువుకు పోస్టుమార్టం చేయమంటే డాక్టర్ రూ.3 వేలు లంచం అడిగాడు. ఎమ్మెల్సీ అయి న నేను, ఓ ఎమ్మెల్సీ పీఏ అక్కడే ఉన్నామన్న భయం కూడా ఆ డాక్టర్లో లేదు. ఇదేం పద్ధతి’ – శాసన మండలిలో ఓ ఎమ్మెల్సీ ఫిర్యాదు. ‘ఉమ్మడి రాష్ట్రంలో ఇలా డబ్బులు అడిగే పద్ధతి అన్ని ఆసుపత్రుల్లో ఉండేది. ఇప్పుడు అది కొన్ని ఆసుపత్రులకే పరిమితమైంది’ – వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం. సాక్షి, హైదరాబాద్: ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్యంపై బుధవారం శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలతో వైద్యారోగ్య శాఖ పనితీరు చర్చకు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాళ్ల కీళ్ల మార్పిడి అంశంపై టీఆర్ఎస్ సభ్యులు గంగాధర్‌గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ, భూపతిరెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటనను సభ ముందుంచారు. గత ఆదివారం తన బంధువు రోడ్డు ప్రమాదంలో చనిపోతే చూడ్డానికి వెళ్లానని, పోస్ట్మా ర్టం కోసం సిబ్బంది మధ్యాహ్నం వరకు ఎదురు చూసేలా చేసి చివరకు రూ.3 వేలు వసూలు చేసి ఆ తంతు పూర్తి చేశారని ఫిర్యాదు చేశారు. తాను, మరో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పీఏ అక్కడే ఉండగానే వసూళ్లు సాగాయని, మరి పేదల విషయంలో వేధింపులు ఇంకెలా ఉంటాయని సభ దృష్టికి తెచ్చారు. వీటిని నిరోధించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మంత్రి లక్ష్మారెడ్డి స్పందిస్తూ, ‘ఉమ్మడి రాష్ట్రంలో ఈ అవినీతి ఇంకా ఎక్కువగా ఉండేది. అన్ని ఆసుపత్రుల్లో వసూలు చేసేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది కొన్ని ఆసుపత్రులకే పరిమితమైంది’ తెలిపారు. ఈ సమాధానంపై లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ విరామ సమయంలో మంత్రిని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబసభ్యులు చనిపోయి దుఃఖంలో ఉంటే, వైద్యులు పోస్టుమార్టం కోసం వేధిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. -
వివాహితపై లైంగికదాడి ?
దుగ్గొండి( దుగ్గొండి): పంట చేను వద్ద ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ వ్యక్తి లైంగికదాడికి యత్నించగా ఆమె స్పృహ కోల్పోయిన సంఘటన మండలంలోని తొగర్రాయి గ్రామంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 35 సంవత్సరాల వివాహిత ఆదివారం ఇదేగ్రామానికి చెందిన ఓ రైతు పంట చేను వద్ద పనులు చేయడానికి వెళ్లింది. సదరు మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి అక్కడికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించినట్లు తెలిసింది. ఈ క్రమంలో సదరు మహిళ స్పృహ కోల్పోయినట్లు సమాచారం. రాత్రి 7 గంటలు దాటిన అనంతరం గమనించిన వ్య క్తులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే మహిళను కొట్టారా లేక సామూహికంగా కొంతమంది లైంగికదాడికి యత్నించారా అనే విషయాలు తెలియరాలేదు. అయితే ఈ విషయమై ఎస్సై భాస్కర్‌రెడ్డిని వివరణ కోరగా అపస్మారక స్థితిలో ఉన్న మహిళను కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ఆదివారం రాత్రి పొద్దుపోయాక వైద్యులు తమకు సమాచారం ఇచ్చారన్నారు. దీంతో వెంటనే బాధితురాలి వద్దకు వెళ్లామని, అయితే సదరు మహిళ స్పృహలో లేకపోవడంతో ఏం జరిగిందో తెలియడం లేదన్నారు. మహిళ స్పృహలోకి వస్తే కొట్టిగాయపరిచారా.. లేక లైంగికదాడి చేశారా అనే విషయాలు తెలుస్తాయన్నారు. బాధితురాలి పక్షాన ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. అయితే పోలీసు ఉన్నతాధికారుల ఆదేశంతో వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
రోదనలతో మిన్నంటిన మార్చురీ
అంతటా అలుముకున్న విషాదం కంట తడి పెట్టిన మహిళలు పోచమ్మమైదాన్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని మార్చురీ గురువారం రోదనలతో మిన్నం టింది. గురువారం ఉదయం 11గంటలకు మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, మనుమలు అభినవ్, అయాన్, శ్రీయాన్ మృతుదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తామని వైద్యులు ప్రకటిం చడంతో ఉదయం 10గంటల సమయానికే మహిళా, కుల సంఘాల బాధ్యులతో పాటు నగర ప్రజలు, మహిళలు పెద్దసంఖ్యలో మా ర్చురీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దుఃఖసాగరంలో మునిగిపోయిన సారిక తల్లి లలిత, ఆమె సోదరి, బంధువులను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. అయ్యా.. నాబిడ్డ, నా మనుమలు పాయే, అందరూ నా బిడ్డల లాంటి వారే... అందరి ఆడోళ్లకు న్యా యం చేయండి.. అంటూ లలిత రోదిస్తున్న తీరి పలువురు మహిళలు ఆమెను ఓదార్చేందు కు యత్నించారు. అలాగే, సారిక, ఆమె కుమారుల మృతదేహాలు బొగ్గు ముద్దల్లా మార్చురీలో ఉం డడాన్ని చూసి... కన్నుమూసిన సమయంలో ఎంత వేదన అనుభవించారోనంటూ కన్నీరు మున్నీరయ్యారు. అలాగే, మరికొందరు రాజ య్యతో పాటు ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజయ్య కుటుంబానికి ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు. -
పేదల ఆస్పత్రిపై పట్టింపేది..?
అధ్వానంగా ఎంజీఎం దవాఖానా అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్న రోగులు అమలుకు నోచుకోని గత తీర్మానాలు జాడలేని అభివృద్ధి కమిటీ సమావేశం ఏడాది పాలనలో ముందుకుసాగని పనులు ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్దదిక్కుగా వర్ధిల్లుతున్న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి.. సమస్యలతో కునారిల్లుతోంది. నిత్యం వందలాది మంది రోగులు వస్తున్న ఆస్పత్రిని అభివృద్ధి చేస్తూ, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన పాలకులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పేదలకు వైద్య సేవలందిస్తున్న ధర్మాస్పత్రి అచేతనా వస్థలో కొట్టుమిట్టాడుతోంది. ఎంజీఎం : తెలంగాణలోని నాలుగు జిల్లాలకు కేంద్ర బిందువుగా కొనసాగుతున్న ఎంజీఎం ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నారుు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు గుప్పించిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు.. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తరుునా అభివృద్ధిపై దృష్టి సారించడంలేదు. ఆస్పత్రిలో నెలకొన్న అసౌకర్యాలతోపాటు వైద్య సిబ్బంది పనితీరుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గతంలో సమీక్ష సమావేశం నిర్వహించినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. కాగా, మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన హెచ్‌డీఎస్ సమావేశానికి ప్రజాప్రతినిధులు సమయం కేటాయించకపోవడంతోపాటు అధికారుల పట్టింపులేనితనం రోగులకు శాపంగా మారింది. ఇదిలా ఉండగా, 2014 జనవరి 19న ఉమ్మడి రాష్ట్రంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కాగా, దీనికి ఐదేళ్ల ముందు 2009 నంబర్ 4న సమా వేశం నిర్వహించారు. ఏడాది పాలనలో ఏమీ లేవు.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఎం జీఎం ఆస్పత్రి అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదు. కాగా, రూ.9 కోట్లతో నిర్మించిన మదర్ అండ్ చైల్డ్ హెల్త్‌కేర్ భవనాన్ని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ప్రారంభించినా నేటికి అమలులోకి రాలేదు. దీంతోపాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి స్వయంగా ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించి వైద్య సిబ్బం ది కొరతపై మెడికల్ రిక్రూట్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ‘కడియం’ నోట.. హెచ్‌డీఎస్ మాట.. కాకతీయ మెడికల్ కళాశాలలోని అదనపు 50 సీట్లను కాపాడుకునేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు కేఎంసీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు నాలుగేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన సమయంలో హెచ్‌డీఎస్ సమావేశం నిర్వహించాలనే మాట.. తాజా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నోట వెలువడింది. అరుుతే ఇంత వరకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంపై అడుగులు పడకపోవడం గమనార్హం. ఆస్పత్రిలో సమస్యలు తాండవిస్తున్నా రోగులకు మెరుగైనా సేవలందించే దిశలో హెచ్‌డీఎస్ సమావేశం నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. అప్పటి తీర్మానాల అమలేది.. ? గత ఏడాది జనవరి 19న ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన హెచ్‌డీఎస్ సమావేశ తీర్మాణాలు ఒక్కటి కూడా అములుకు నోచుకోలేదు. హెచ్‌డీఎస్ సమావేశం నిర్వహించిన ఆనంతరం ఆస్పత్రి సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమా వేశం నిర్వహించాలన్నా తీర్మాణం సైతం అమలుకు నోచుకోలేదు. కాగా, రూ.400 కోట్లతో యూనిటరీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని, ఆస్పత్రిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని, క్యాజువాలిటీ విభాగంలో పడకల సంఖ్యను పెంచాలని, పేద రోగులు ప్రైవేట్‌కు తరలకుండా చర్యలు తీసుకోవాలని, రోగులు, వారి బంధువుల కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వపరంగా సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్ ఏర్పాటు చేయాలని అప్పట్లో తీర్మాణించారు. వీటితోపాటు ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించేలా చూడాలని హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ప్రతిపాదించారు. పెరుగుతున్న రోగుల సం ఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంది.