ఎంజీఎం: వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమో రియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలోని పిల్లల విభాగం లో గురువారం షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. నవజాత శిశు సంరక్షణ కేంద్రంలోని ఏసీలో పొగ లు రావడాన్ని గమనించిన శిశువుల తల్లిదండ్రు లు, కుటుంబీకులు చిన్నారులను ఎత్తుకుని బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని గమనించిన ఎంజీఎం వైద్య సిబ్బంది వార్డులోని విలువైన వైద్యపరికరాలను బయటకు తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఏసీ పేలడంతో వార్డులో మంటలు వ్యాపించాయి.
సమాచారం అందుకు న్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనలో చిన్నారులకు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఇటు వైద్యసిబ్బంది.. అటు వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఏసీ పేలిన వార్డులో చికిత్స పొందుతున్న 23 మంది నవజాత శిశువులు సురక్షితంగా ఉన్నారని ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్, పీడియాట్రిక్ విభాగాధిపతి విజయ్‌కు మార్ తెలిపారు. వీరిని ఆస్పత్రిలోని వేరే వార్డుకు తరలించి చికిత్స అందజేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment