పేదల ఆస్పత్రిపై పట్టింపేది..?
అధ్వానంగా ఎంజీఎం దవాఖానా
అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్న రోగులు
అమలుకు నోచుకోని గత తీర్మానాలు
జాడలేని అభివృద్ధి కమిటీ సమావేశం
ఏడాది పాలనలో ముందుకుసాగని పనులు
ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్దదిక్కుగా వర్ధిల్లుతున్న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి.. సమస్యలతో కునారిల్లుతోంది. నిత్యం వందలాది మంది రోగులు వస్తున్న ఆస్పత్రిని అభివృద్ధి చేస్తూ, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన పాలకులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పేదలకు వైద్య సేవలందిస్తున్న ధర్మాస్పత్రి అచేతనా వస్థలో కొట్టుమిట్టాడుతోంది.
ఎంజీఎం : తెలంగాణలోని నాలుగు జిల్లాలకు కేంద్ర బిందువుగా కొనసాగుతున్న ఎంజీఎం ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నారుు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు గుప్పించిన టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు.. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తరుునా అభివృద్ధిపై దృష్టి సారించడంలేదు. ఆస్పత్రిలో నెలకొన్న అసౌకర్యాలతోపాటు వైద్య సిబ్బంది పనితీరుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గతంలో సమీక్ష సమావేశం నిర్వహించినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. కాగా, మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన హెచ్‌డీఎస్ సమావేశానికి ప్రజాప్రతినిధులు సమయం కేటాయించకపోవడంతోపాటు అధికారుల పట్టింపులేనితనం రోగులకు శాపంగా మారింది. ఇదిలా ఉండగా, 2014 జనవరి 19న ఉమ్మడి రాష్ట్రంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కాగా, దీనికి ఐదేళ్ల ముందు 2009 నంబర్ 4న సమా వేశం నిర్వహించారు.
ఏడాది పాలనలో ఏమీ లేవు..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఎం జీఎం ఆస్పత్రి అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదు. కాగా, రూ.9 కోట్లతో నిర్మించిన మదర్ అండ్ చైల్డ్ హెల్త్‌కేర్ భవనాన్ని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ప్రారంభించినా నేటికి అమలులోకి రాలేదు. దీంతోపాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి స్వయంగా ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించి వైద్య సిబ్బం ది కొరతపై మెడికల్ రిక్రూట్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.
‘కడియం’ నోట.. హెచ్‌డీఎస్ మాట..
కాకతీయ మెడికల్ కళాశాలలోని అదనపు 50 సీట్లను కాపాడుకునేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు కేఎంసీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు నాలుగేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన సమయంలో హెచ్‌డీఎస్ సమావేశం నిర్వహించాలనే మాట.. తాజా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నోట వెలువడింది. అరుుతే ఇంత వరకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంపై అడుగులు పడకపోవడం గమనార్హం. ఆస్పత్రిలో సమస్యలు తాండవిస్తున్నా రోగులకు మెరుగైనా సేవలందించే దిశలో హెచ్‌డీఎస్ సమావేశం నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.
అప్పటి తీర్మానాల అమలేది.. ?
గత ఏడాది జనవరి 19న ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన హెచ్‌డీఎస్ సమావేశ తీర్మాణాలు ఒక్కటి కూడా అములుకు నోచుకోలేదు. హెచ్‌డీఎస్ సమావేశం నిర్వహించిన ఆనంతరం ఆస్పత్రి సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమా వేశం నిర్వహించాలన్నా తీర్మాణం సైతం అమలుకు నోచుకోలేదు. కాగా, రూ.400 కోట్లతో యూనిటరీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని, ఆస్పత్రిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని, క్యాజువాలిటీ విభాగంలో పడకల సంఖ్యను పెంచాలని, పేద రోగులు ప్రైవేట్‌కు తరలకుండా చర్యలు తీసుకోవాలని, రోగులు, వారి బంధువుల కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వపరంగా సిటీ, ఎంఆర్‌ఐ స్కానింగ్ ఏర్పాటు చేయాలని అప్పట్లో తీర్మాణించారు. వీటితోపాటు ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించేలా చూడాలని హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ప్రతిపాదించారు. పెరుగుతున్న రోగుల సం ఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంది.