
సాక్షి, హైదరాబాద్ : మద్యం తాగి కారు నడుపుతూ ఓ సినీనటుడు కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. రెండు రోజుల కౌన్సిలింగ్ అనంతరం కోర్టుకు తరలించగా జడ్జి సదరు నటుడికి రూ.5వేల జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి కూకట్‌పల్లి ట్రాఫిక్ సీఐ బోసుకిరణ్, ఎస్‌ఐ రామక్రిష్ణ ఆధ్వర్యంలో బాచుపల్లి చౌరస్తా వద్ద డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. ఆ మార్గంలో కారు నడుపుతూ వచ్చిన సినీ నటుడు ప్రిన్స్ సుశాంత్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపి శ్వాస పరీక్ష చేయగా 42 ఎంజీ మద్యం తాగినట్టు నిర్థారణయింది. దాంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని కౌన్సిలింగ్ అనంతరం ప్రిన్స్‌ను మంగళవారం కూకట్‌పల్లిలోని 4వ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment