విమల్
తమిళనాడు, పెరంబూరు: నటుడు విమల్ మద్యం మత్తులో రగడ చేశాడు. తన అనుచరులతో కలిసి మరో నవ నటుడిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆ నటుడు విమల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూర్‌కు చెందిన అభిషేక్ అనే వర్థమాన నటుడు స్థానిక విరుగంబాక్కంలో నివసిస్తున్నాడు. ఇతను అవన్ ఇవళ్ ఆదు అనే చిత్రంలో నటించాడు. కాగా శనివారం రాత్రి అభిషేక్ తను నివశిస్తున్న అపార్ట్‌మెంట్ పైభాగంలో ఫోన్‌లో మాట్లాడుకుంటున్నాడు. ఆ సమయంలో నటుడు విమల్ నలుగురు అనుచరులతో అక్కడికి వచ్చి కాసేపు ఇక్కోడ కూర్చోవచ్చా అని అభిషేక్‌ను అడిగాడు.
అందుకు అతను తాను ఇంటి ఓనర్‌ను కాదనీ, కాబట్టి తాను బాధ్యుడిని కాదనీ బదులిచ్చాడు. దీంతో విమల్ గొడవకు దిగాడు. విమల్ మద్యం మైకంలో ఉన్నట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. విమల్ తన అనుచరులతో కలిసి అభిషేక్‌పై దాడి చేశారు. దీంతో గాయాల పాలైన అభిషేక్ స్థానిక వడపళనిలోని ఒక ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. అనంతరం విరుగంబాక్కం పోలీస్‌స్టేషన్‌లో విమల్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment