‘నా మెడ పట్టి లాక్కెళ్లారు.. ఉరి తీయాలి’ | Alwar Molestation Victim Said They Dragged Me From My Neck Hang Them | Sakshi
Sakshi News home page

రాజకీయ దుమారం రేపుతోన్న ఆల్వార్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటన

Published Wed, May 8 2019 8:34 AM | Last Updated on Wed, May 8 2019 8:39 AM

Alwar Molestation Victim Said They Dragged Me From My Neck Hang Them - Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌లోని ఆల్వార్‌లో ఓ వివాహితపై పట్టపగలు ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఈ దారుణం గత నెల 26న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న వివరాలు.. ‘గత నెల 26న నేను నా భర్తతో కలిసి వెళ్తున్నాను. ఆ సమయంలో కొందరు వ్యక్తులు మా బైక్‌ను అడ్డగించారు. నా మెడ పట్టి లాక్కెళ్లారు. నా భర్త కళ్ల ముందే నన్ను వివస్త్రగా మార్చి నాపై దారుణానికి ఒడిగట్టారు. ఈ గ్యాంగ్‌కు ఓ సభ్యుడు లీడర్‌గా వ్యవహరించాడు. వారి పైశాచికత్వం అంతటితో ఆగలేదు. ఈ ఘోరాన్ని వీడియో తీశారు. పోలీసులకు చెప్తే ఈ వీడియోను బయటపెట్టి మమ్మల్ని అ‍ల్లరి చేస్తామని బెదిరించడమే కాకుండా మా వద్ద నుంచి డబ్బులు కూడా డిమాండ్‌ చేశార’న్నారు.

బాధితురాలి భర్త మాట్లాడుతూ.. ‘ఈ దారుణం నుంచి కోలుకోవడానికి మాకు సమయం పట్టింది. నా భార్య మెడ పట్టి లాక్కెళ్లిన వారికి ఉరి శిక్ష పడాలి. అప్పుడే నా భార్యకు కాస్త మనశ్శాంతి లభిస్తుంది. అయితే ఈ విషయం గురించి బయటకు తెలిస్తే.. మాకు అండగా నిలబడాల్సిన సమాజం.. నా భార్యనే అవమానిస్తుంది. దాంతో ఈ విషయం గురించి నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశాను. అయితే నేను గత నెల 30న ఫిర్యాదు చేస్తే.. వారు ఈ నెల 2న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశార’ని తెలిపాడు. అంతేకాక ‘ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో కూడా నిందితులు మాకు ఫోన్‌ చేసి బెదిరించడం ప్రారంభించారు. దాని గురించి కూడా ఎస్పీతో చెప్పాను. ఆయన నిందితులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చార’ని బాధితురాలి భర్త తెలిపాడు.

‘మా ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం అధికారులంతా ఎన్నికల విధుల్లో విధుల్లో బిజీగా ఉన్నారు.. ఎలక్షన్‌లు ముగిసిన తర్వాత చర్యలు తీసుకుంటామ’ని ఎస్పీ తమతో చెప్పినట్లు బాధితురాలి భర్త వెల్లడించాడు. ఈ విషయం గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం స్టేషన్‌లో ముగ్గురు అధికారులు మాత్రమే ఉన్నారు. అయినప్పటికి ఈ కేసు గురించి దర్యాప్తు ప్రారంభించాము. నిందితుల్లో ఇద్దరిని చోటేలాల్‌, అశోక్‌గా గుర్తించాము. వారిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశామ’ని వెల్లడించారు.

అయితే ఈ కేసు రాజస్తాన్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. నిర్భయ ఘటన కన్నా ఇది దారుణమైన సంఘటన అని బీజేపీ పేర్కొంది. అంతేకాక మహిళల భద్రత విషయంలో రాజస్తాన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించింది. ఈ ఘటన పట్ల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుండటమే కాక బాధితులు ఫిర్యాదు చేసినప్పటికి.. ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ప్రభుత్వం ఎస్పీని సస్పెండ్‌ చేయడమే కాక.. మహిళల రక్షణకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement