స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. హత్య | Bengaluru Businessman Shoots Girlfriend Husband to Death | Sakshi

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. హత్య

Oct 9 2019 12:22 PM | Updated on Oct 9 2019 12:29 PM

Bengaluru Businessman Shoots Girlfriend Husband to Death - Sakshi

బెంగళూరు: స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాక.. ఈ విషయం గురించి ప్రశ్నించినందుకు స్నేహితుడిని తుపాకీతో కాల్చి మరి చంపాడో వ్యక్తి. వివరాలు.. బెంగళూరు పరిసర గ్రామానికి చెందిన మునియప్ప, రమేష్‌ బాల్య స్నేహితులు. రమేష్‌ ట్రక్‌ తొలుతూ జీవినం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మునియప్ప, రమేష్‌ భార్య కళావతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాక వీరిద్దరు గతేడాది ఇంటి నుంచి వెళ్లి పోయారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత మునియప్ప గ్రామానికి వచ్చాడు.. కానీ కళావతి, తన భర్త రమేష్‌ దగ్గరకు రాలేదు. దాంతో  గ్రామ పెద్దలతో పంచాయతి పెట్టించిన రమేష్‌.. కళావతిని ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. అంతేకాక విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది.

ఈ క్రమంలో భార్యతో సంబంధం పెట్టుకోవడమే కాక.. విడాకులు కోరేలా చేశాడనే కోపంతో మంగళవారం రమేష్‌, మునియప్పతో గొడవకు దిగాడు. ఈ వివాదం కాస్త పెద్దది కావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మునియప్ప.. తండ్రి తుపాకీతో రమేష్‌ మీద కాల్పులు జరిపాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి రమేష్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మునియప్ప, అతడి తండ్రి, సోదరుడు, రమేష్‌ భార్య కళావతిల మీద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement