బురారీ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబపు పెట్ డాగ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బురారీ ఆత్మహత్యల కేసులో ఆ కుటుంబపు పెట్ డాగ్ కీలకంగా మారింది. ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రస్తుతం ఆ పెట్ డాగ్ సైగలతో మరింత సమాచారన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దానిని జంతు సంరక్షణ కేంద్రంలో ఉంచారు. మీడియా ద్వారా ఈ పెట్ డాగ్ గురించి తెలుసుకు సంజయ్ మొహపాత్ర అనే జంతు హక్కుల పోరాట కార్యకర్త దానిని పోలీసుల అనుమతితో తన జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే తొలుత ఆ డాగ్ చాలా కోపంగా ఉండేదని, ఎవరిని దగ్గరికి రాణించేదని కాదని అతను మీడియాకు తెలిపారు. అది ఆనారోగ్యానికి గురైందని గ్రహించి వైద్యం అందించనట్లు సంజయ్ పేర్కొన్నారు. ప్రస్తుంత కాలేయం సంబంధిత వ్యాధితో బాధపడుతుందని, ప్రస్తుతం కోలుకుంటుందన్నారు. కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు యత్నించే సమయంలో ఆ పెట్ డాగ్‌ను గ్రిల్‌కు కట్టేసి ఉంటారని సంజయ్ అభిప్రాయపడ్డారు. డాగ్ ఆరోగ్యంపై పోలీసులు ఎప్పటికప్పుడూ ఆరాతీస్తున్నారని, అది కోలుకోగానే డాగ్‌స్క్వాడ్ ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని దాని నుంచి రాబట్టే అవకాశం ఉందన్నారు.
ఇక ఈ కేసులో రాతలతో దొరికిన ఓ నోట్ బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని, అందులో రాసిపెట్టినట్లుగానే వాళ్లు ఉరి వేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బురారీలోని సంత్ నగర్‌లో గత ఆదివారం ఉదయం ఒకే ఇంట్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. భాటియా కుటుంబం ఇంటి పెద్ద నారాయణ్ దేవి(77) గొంతు తెగి రక్తపుమడుగులో పడి ఉండగా, ఆమె కూతురు ప్రతిభా(57), కొడుకులు భావనేశ్(50), లలిత్ భాటియా(45)తోపాటు వాళ్లిద్దరి భార్య, పిల్లలు ఉరికి వేలాడుతూ కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment