Burari area
-
20 రూపాయిల కోసం దారుణం..
న్యూఢిల్లీ: రానురాను మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా లేకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలు కూడా తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి దారుణం ఒకటి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. కేవలం 20 రూపాయలు ఇవ్వనందుకు ఓ వ్యక్తిని అతడి కుమారుడి కళ్ల ముందే దారుణంగా కొట్టి చంపేశారు కర్కోటకులు. వివరాలు.. రూపేష్(38) అనే వ్యక్తి ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో తన భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతం ఘోరమైన నేరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలో రూపేష్ కటింగ్ చేయించుకోవడం కోసం తన ఇంటి పక్కనే ఉన్న బార్బర్ షాప్‌కి వెళ్లాడు. యాభై రూపాయల బిల్లు అయ్యింది. రూపేష్ రూ.30 చెల్లించి మిగతా ఇరవై రూపాయలు తర్వాత ఇస్తా అన్నాడు. దాంతో ఆగ్రహించిన షాపు ఓనర్ తన సోదరుడితో కలిసి అతడిపై దాడి చేశాడు. (చదవండి: పోలీసు ఉన్నతాధికారి దారుణం : వైరల్ వీడియో) ఈ దారుణం జరిగినప్పుడు రూపేష్ కుమారుడు అక్కడే ఉన్నాడు. దాడిని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ వారు ఆగలేదు. జనాలు చూస్తూ ఉన్నారు కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. చివరకు అతడు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితులు సంతోష్, సరోజ్‌లను అరెస్ట్ చేశారు. -
బురారీ ఉదంతం: ఒంటరిని.. పోరాడలేను
న్యూఢిల్లీ : గత ఏడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్యల ఉందతాన్ని అంత సులభంగా మర్చిపోలేం. ముఢవిశ్వాసంతో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కుటుంబానికి సంబంధించి ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు. మరణించిన నారాయణ దేవి పెద్ద కుమారుడు దినేష్ చుందావత్ మాత్రమే ప్రస్తుతం బతికి ఉన్నాడు. జరిగిన దారుణాన్ని నేటికి కూడా అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ విషయం గురించి దినేష్ మాట్లాడుతూ.. ‘వ్యాపార నిమిత్తం నేను మా స్వస్థలం రాజస్తాన్ చిత్తోర్‌గఢ్‌లో ఉంటున్నాను. జరిగిన దారుణం గురించి తెలిసి షాక్‌కు గురయ్యాను. మా కుటుంబ సభ్యులు అందరు చాలా మంచివారు. బయటి వ్యక్తులను ఎప్పుడు కనీసం ‘థూ’ అని కూడా ఎరగరు. పైగా మాది విద్యావంతుల కుటుంబం. అలాంటిది కేవలం మూఢనమ్మకంతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే నమ్మశక్యంగా లేదు. పోలీసుల విచరణ పట్ల నేను సంతృప్తిగా లేను. కానీ ప్రస్తుతం నేను ఒంటరిగా మిగిలాను.. పోరాడే ఓపిక లేదు’ అన్నాడు. (చదవండి : 11 మంది మరణం: అతడే సూత్రధారి) అంతేకాక ‘మా కుటంబంలో జరిగిన విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. తాంత్రిక శక్తులంటూ ఏవేవో పుకార్లు వ్యాపించాయి. ప్రస్తుతం మా ఇంటికి సంబంధించి కూడా ఇలాంటి వార్తలే ప్రచారం చేస్తున్నారు. మా ఇంటిని తక్కువ రేటుకు కొట్టేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నార’ని దినేష్ ఆరోపించాడు. ఇంతమంది మృతికి నారాయణ దేవి(77) చిన్న కుమారుడు లలిత్ భాటియా(45)నే కారణం. అతడు మరణించిన తండ్రి తనకు కనిపిస్తున్నాడని, తనతో మాట్లాడుతున్నాడని.. తనకు సందేశాలు ఇస్తున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పేవాడు. ఈ క్రమంలోనే తండ్రి సందేశాలను రిజిస్టర్లో రాసి మిగతా కుటుంబ సభ్యులకు తెలిపేవాడు. అందులో భాగంగానే రిజిస్టర్లో ఒక చోట ‘త్వరలోనే మీ ఆఖరి కోరికలు నెరవేరతాయి. అప్పుడు ఆకాశం తెరుచుకుంటుంది. భూమి కంపిస్తుంది. కానీ ఎవరూ భయపడకండి. గట్టిగా మంత్రాన్ని జపించండి నేను మిమ్మల్ని కాపాడతాను’ అని తండ్రి తనతో చెప్పినట్లు కాగితంలో రాసి కుటుంబ సభ్యులకు తెలిపాడు. లలిత్ భాటియా చెప్పిన విషయాలను మిగతా కుటుంబ సభ్యులు కూడా నమ్మి అతడు చెప్పినట్లే ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు పోలీసులు. -
బురారీ ఉదంతం : ఆత్మలు తిరుగుతున్నాయి
న్యూఢిల్లీ : అహ్మద్ అలీ, అస్ఫర్ అలీల వృత్తి కార్పెంటర్ పని.. ప్రవృత్తి హాంటెడ్ హౌస్(దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారం జరిగే ఇళ్లు)ల్లో నివసించడం. సాధరణంగా ఇలాంటి వారి గురించి ఎక్కువగా సినిమాల్లోనే చూస్తూంటాం. దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారంతో విలువైన ఇంటిని ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడం.. ఈ క్రమంలో హీరో అక్కడ కొన్ని రోజుల పాటు గడిపి.. అవన్ని ఒట్టి పుకార్లే అని నిరూపిస్తుంటారు. సరిగా అలీ బ్రదర్స్ పని కూడా ఇదే అన్నమాట. ప్రస్తుతం వీరు ఇద్దరు బురారీ కుంటుంబ సభ్యుల ఇంట్లో ఉంటున్నారు. గత ఏడాది దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన బురారీ కుటుంబ సభ్యుల ఆత్మహత్య ఉదంతాన్ని అంత తొందరగా మర్చిపోలేం. (చదవండి : తండ్రి కాపాడుతాడని...) అతీత శక్తుల భ్రమలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి మరణాంతరం గత ఏడాది అక్టోబర్‌లో దినేష్ చుంద్వాత్ అనే వ్యక్తి ఈ ఇంటిని కోటిన్నర రూపాయలకు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం డబ్బు అవసరం ఉండటంతో.. ఇంటిని అమ్మేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఈ ఇంటిలో ఆత్మలు తిరుగుతున్నాయనే పుకార్లు వ్యాపించాయి. దాంతో కోటిన్నర పెట్టి కొన్న ఇంటిని కొనడానకి ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక వేళ వచ్చినా.. చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు. ఈ క్రమంలో ఇంటి మీద వచ్చిన పుకార్లు నిజం కాదని నిరూపించి.. మంచి రేటుకు ఇంటిని అమ్మాలని భావించిన దినేష్, అలీ సోదరులకు కబురుపెట్టాడు. కొన్ని రోజులు పాటు తన ఇంట్లో ఉండాల్సిందిగా దినేష్ వారిని కోరాడు. రెంట్ ఇవ్వాల్సిన పని లేదని చెప్పాడు. దినేష్ కోరిక మేరకు అలీ సోదరులు ప్రస్తుతం ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు. మూడంతస్థుల భవనంలో కింది ఫ్లోర్‌ను తమ కార్పెంటర్ విధుల కోసం వాడుకుంటుండగా.. మిగతా రెండంతస్థుల్లో వారు నివాసం ఉంటున్నారు. ఈ విషయం గురించి అలీ సోదరులు మాట్లాడుతూ.. ‘తొలి రోజు మేం నారాయణి దేవి రూంలో ఆమె మంచం మీద పడుకున్నాం. మాకేం తేడగా అన్పించలేదు. తరువాత మేం ఇంట్లో ఉన్న వేర్వేరు బెడ్రూంల్లో ఒంటరిగా పడుకుంటున్నాం’ అన్నారు. అయితే తాము బురారీ కుటుంబ సభ్యుల ఇంట్లో ఉండటం తమ ఇంట్లోవారికి కూడా ఇష్టం లేదని తెలిపారు. మమ్మల్ని ఇక్కడకు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు. కానీ తాము అందుకు ఒప్పుకోలేదన్నారు. గ్రామాల్లో ఇలాంటి మూఢనమ్మకాలు అధికంగా ఉంటాయని.. కానీ తాము వాటిని నమ్మమని తెలిపారు అలీ సోదరులు. అయితే అర్థరాత్రి సమయంలో ఆత్మలు తిరుగుతుంటాయని తాము బలంగా విశ్వసిస్తామన్నారు. ఈ విషయం గురించి ఓ ప్రాపర్టీ డీలర్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి దారుణాలు జరిగిన ఇళ్లను కొనడానికి జనాలు ఆసక్తి చూపరు. ఒక వేళ ఎవరైనా కొందామని భావించిన చాలా తక్కువ రేటుకు కొందామనే భావిస్తారు. బురారీ ఇళ్లు రోడ్డుకు దగ్గర్లో ఉంది. పెయింట్ వేసి.. చిన్న చిన్న మార్పులు చేస్తే.. మంచి ధర పలుకుతుంది. కానీ ముందు ఆ ఇంటి గురించి ప్రచారం అవుతోన్న పుకార్లు అవాస్తవమని తెలాలి’ అన్నారు. -
బురారీ కేసు.. ప్రమాదం మాత్రమే : ఫోరెన్సిక్ రిపోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ సామూహిక మరణాల మిస్టరీ వీడింది. భాటియా కుటుంబ సభ్యులవి ఆత్మహత్యలు కావని.. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదం మాత్రమేనని సీబీఐ- సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. గత జూన్‌లో ఢిల్లీలోని బురారి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంలోని 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. వారిలో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతుండగా, ఇంటి యజమాని నారాయణ దేవి (75) గొంతు కోయడం వల్ల చనిపోయింది. కాగా తాంత్రిక పూజల ప్రభావానికి లోనుకావడం వల్లే వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు భావించారు. భాటియా కుటుంబ సభ్యుల్లో ఒకడైన లలిత్ భాటియా మూఢనమ్మకాల కారణంగానే ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని విచారణలో వెల్లడైంది. అయితే భాటియా కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఈ విషయాన్ని వ్యతిరేకించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో ఉరివేసుకోవడం వల్లే మరణించారని నివేదిక రావడంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. వీరి మరణాలకు గల స్పష్టమైన కారణాలు తెలుసుకునేందుకు.. మృతుల సైకలాజికల్ అటాప్సీ నివేదిక ఇవ్వాల్సిందిగా సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు లేఖ రాశారు. వీరికి ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఏమాత్రం లేదని.. ఇదొక ప్రమాదమని ఫోరెన్సిక్ ల్యాబ్ బుధవారం సాయంత్రం నివేదిక ఇచ్చింది. సైకలాజికల్ అటాప్సీ అంటే... మెడికల్ రిపోర్టుల ఆధారంగా ఒక వ్యక్తి మానసిక స్థితిని అధ్యయనం చేసే ప్రక్రియనే సైకలాజికల్ అటాప్సీ అంటారు. సైకలాజికల్ అటాప్సీలో వ్యక్తి స్నేహితులు, వ్యక్తిగత డైరీలు, కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. బురారీ కేసులో కూడా ఈ ప్రక్రియనే అనుసరించామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సైకలాజికల్ అటాప్సీలో భాగంగా భాటియా కుటుంబ యజమాని నారాయణ దేవి పెద్ద కుమారుడు దినేశ్ సింగ్ చందావత్, అతడి సోదరి సుజాతా నాగ్‌పాల్‌ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, లలిత్ భాటియా డైరీలు, రిజిస్టర్లు, ఇరుగుపొరుగు వారు చెప్పిన విషయాల ఆధారంగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
మరో బురారీ : బిహార్ నుంచి వలస వచ్చి...
రాంచీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని బురారీ సామూహిక ఆత్మహత్యల మిస్టరీ వీడకముందే జార్ఖండ్‌లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాంచీలోని కంకే ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తులను దీపక్, అతడి భార్య, తల్లిదండ్రులు, ఐదేళ్ల కూతురు, ఏడాదిన్నర కొడుకుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు ఉరివేసుకోగా, మిగతావారి శవాలు ఓ గదిలో నేలపై పడి ఉన్నట్లు వెల్లడించారు. వివరాలు... బిహార్‌లోని భగల్పూర్కు చెందిన దీపక్ ఝా అనే వ్యక్తి కుటుంబంతో సహా వచ్చి రాంచీలో స్థిరపడ్డాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే మానసికంగా కుంగిపోయిన దీపక్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించకపోవడంతో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఎస్పీ అనీష్ గుప్తా తెలిపారు. కాగా కొన్ని రోజుల క్రితం జార్ఖండ్‌లోని హజారీ బాగ్‌లో కూడా ఇదే తరహాలో మహవీర్ మహేశ్వరీ అనే వ్యక్తి వ్యాపారంలో నష్టం రావడంతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
బురారీ మిస్టరీ : పెట్ డాగ్ డెడ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బురారీ ఆత్మహత్యల కేసులో, మరో గుండె బద్దలయ్యే సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా మారి.. ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలి ఉన్న ఏకైక ప్రాణి, పెట్ డాగ్ ‘టామీ’ హార్ట్ అటాక్‌తో మరణించింది. నోయిడా జంతు సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఈ పెట్ డాగ్ మరణించినట్టు హిందూస్తాన్ టైమ్స్ రిపోర్టు చేసింది. బురారీ కుటుంబం హత్యకు గురైనప్పుడు, ఈ పెట్ డాగ్ తీవ్ర జ్వరంతో టెర్రస్‌పై వణుకుతూ కనిపించింది. కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు యత్నించే సమయంలో ఆ పెట్ డాగ్‌ను గ్రిల్‌కు కట్టేసి ఉంచారు. మీడియా ద్వారా ఈ పెట్ డాగ్ గురించి తెలుసుకు సంజయ్ మొహపాత్ర అనే జంతు హక్కుల పోరాట కార్యకర్త దానిని పోలీసుల అనుమతితో తన జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే తొలుత ఆ డాగ్ చాలా కోపంగా ఉండేదని, ఎవరిని దగ్గరికి రాణించేదని కాదని అతను మీడియాకు తెలిపారు. ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పెట్ డాగ్ సైగల నుంచి కూడా మరింత సమాచారన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. ‘ఈ డాగ్‌కు అంతకముందు నుంచే పలు అనారోగ్య సమస్యలు ఉండి ఉంటాయి. వారికి తెలిసి ఉండకపోవచ్చు. బురారీ ట్రాజెడీ అనంతరం ఈ డాగ్‌ను కొత్త వాతావరణంలోకి తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఇన్ని రోజులు వారి ప్రేమ, ఆప్యాయల మధ్య జీవించిన ఈ పెట్ డాగ్, కొత్త వాతావరణానికి అలవాటు కాలేకపోయింది. దీంతో దీని ఆరోగ్యం మరింత క్షీణించింది’ అని జంతు సంరక్షణ అధికారి చెప్పారు. కాగ, ఇటీవల ఢిల్లీలోని బురారీలో పదకొండు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకే ఇంట్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు ఉరివేసుకోగా.. భాటియా ఇంటి పెద్ద నారాయణ్ దేవీ గొంతు తెగి రక్తపు మడుగులో కనిపించింది. ఈ కేసుపై విచారణ చేపడుతున్న పోలీసులు, వారి ఇంట్లో కొన్ని రాత పూర్వక నోట్లను కూడా గుర్తించారు. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని, అందులో రాసిపెట్టినట్లుగానే వాళ్లు ఉరి వేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
బురారీ కేసు; పోలీస్ స్టేషన్లో పూజలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయిన కేసును విచారిస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసుల మానసిక పరిస్థితి కాస్తా ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసు ఉన్నాతాధికారులు తెలిపారు. ఈ విషయం గురించి ఒక పోలీస్ అధికారి చెబుతూ.. ‘ఈ కేసును విచారిస్తున్న పోలీసుల్లో చాలామంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మునుపెన్నడు తమ జీవితంలో ఇలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. పాపం చాలా మంది నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు. విచారణ నిమిత్తం పోలీసులు తరచుగా బాటియా ఇంటికి వెళ్తుండటంతో వారు ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవమే’ అని తెలిపారు. ఈ కేసు విచారణ పూర్తయిన వెంటనే ఉద్యోగుల కోసం ఒత్తిడి నివారణ కార్యక్రమాలు నిర్వహించి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అంతేకాక కొందరు స్థానికులు పోలీస్ స్టేషన్లో యాగం, శాంతి హోమం వంటి పూజలు చేయమని సలహా కూడా ఇచ్చారన్నారు. అయితే ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం కనుక కొంత గడువు ఇవ్వమని కోరామన్నారు. ఎందుకంటే 15 లక్షల జనాభాతో దాదాపు 30 కిలోమీటర్ల మేర విస్తరించిన బురారీ రక్షణ బాధ్యత పోలీసుల మీద ఉన్నది. ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వడం కూడా మా విధుల్లో భాగమే, కనుక ఈ విషయంలో తొందరపాటు పనికిరాదు అని పోలీసు ఉన్నాతాధికారి తెలిపారు. ఇదిలావుండగా బురారీ ఆత్మహత్య ఘటనల ఉదంతాన్ని నిత్యం టీవీల్లో చూసి ప్రభావితమైన 63 ఏళ్ల కృష్ణశెట్టి అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
ఆ వార్తను పదే పదే చూసి...
న్యూస్ ఛానెళ్లలో ప్రసారం అవుతున్న ఒకే వార్తను పదే పదే చూసిన ఓ వ్యక్తి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికే డిప్రెషన్లోకి వెళ్లిపోగా.. ఆ కథనాలు అతనిపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఆ పెద్దాయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్య ఘటనల ఉదంతం కేసులో దర్యాప్తు కొనసాగుతున్న విషయం విదితమే. ఇదిలా ఉంటే గోరెగావ్‌కు చెందిన 63 ఏళ్ల కృష్ణశెట్టి అనే వ్యక్తి మూడేళ్ల క్రితం వ్యాపారంలో భారీగా నష్టాలు రావటంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఇంటికే పరిమితమైన ఆయన.. బురారీ ఫ్యామిలీ సూసైడ్ కథనాలను టీవీలో రెప్పవేయకుండా చూస్తూ వస్తున్నాడు. వద్దని భార్య, కూతురు ఎంత వారించినా కృష్ణ పట్టించుకోలేదు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనై శుక్రవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘ఆ కుటుంబం(భాటియా ఫ్యామిలీ) చేసింది నిజంగానే సాహసం. చావటానికి చాలా ధైర్యం కావాలి’ అని తరచూ తమతో చెప్పేవాడని కృష్ణ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన శుభంగి పారేకర్ అనే మానసిక వైద్యుడు ఇలాంటి కథనాల విషయంలో సున్నితత్వం పాటించాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
సంచలన కేసులో కీలక మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సంచలనం రేపిన కుటుంబం ఆత్మహత్యల కేసు కీలక మలుపు తిరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మందిని ఆత్మహత్యలకు ప్రేరేపించినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. తాంత్రిక పూజల వెనుక ఆ మహిళ హస్తం ఉందన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. తండ్రి తమను కాపాడతాడని భాటియా కుటుంబం నమ్మేది. ఓ కప్పులో నీళ్లు ఉంచితే.. అది రంగు మారగానే నాన్న వచ్చి కాపాడతాడని బురారీ ఏరియాకి చెందిన లలిత్ భాటియా(45) తన కుటుంబాన్ని నమ్మించాడు. ఈ క్రమంలో తాంత్రిక పూజలు చేసిన అనంతరం కుటుంబం మొత్తం గత ఆదివారం సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అయితే ‘గీతా మా’ అనే మహిళ వీళ్లను తాంత్రిక పూజల దిశగా నడిపించినట్లు అనుమానాలున్నాయి. మరోవైపు కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రధాన ద్వారం తెరిచి ఉండటంతో పూజలు చేసిన వ్యక్తి ఆ మార్గం గుండానే వెళ్లిపోయి ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. ఈ కేసుకు సంబంధించి 12వ వ్యక్తి మిస్టరీ చేధించే క్రమంలో గీతా మాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించి ఓ డైరీని సేకరించిన పోలీసులు, దాని ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరీ గీతా మా...? లలిత్ భాటియా కుటుంబానికి, పోలీసులు అదుపులోకి తీసుకున్న గీతా మాకు సంబంధం ఉంది. భాటియా కుటుంబం ఉంటున్న ఇంటిని ఓ కాంట్రాక్టర్ నిర్మించారు. ఆ కాంట్రాక్టర్ కూతురే గీతా మా కావడం గమనార్హం. ఆమెకు లలిత్ భాటియాకు సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. ఏదైన కారణంతో భాటియా కుటుంబం తమకు తామే బలవన్మరణానికి పాల్పడేలా చేసి ఉండొచ్చునేమోనని గీతా మాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత కథనాలు 11 మంది మరణం: అతడే సూత్రధారి బురారీ కేసులో 12వ వ్యక్తి?? తండ్రి కాపాడుతాడని... -
బురారీ కేసు: ఇంటిని ఆలయంగా మార్చండి!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్యల కేసు విషయంలో స్థానికులు ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. గత ఆదివారం 11 మంది మూకమ్మడిగా బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికులు భయంతో చచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆ చుట్టుపక్కల్లో నివసించే చాలా మంది ఇతర ప్రదేశాలకు తరలి వెళ్లారు. ప్రస్తుతం ఆ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. మరి దర్యాప్తు తర్వాత ఆ ఇంటిని ఎవరికి అప్పగిస్తారు అన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఆ ఇంటిని తీసుకోడానికి బంధువులు సైతం విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని ఏం చేయాలనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనతో ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రారని, ఆ ఇంటిని దేవాలయంగా మార్చడమే ఉత్తమమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దీనిపై మృతుల బంధువు కేతన్ నాగ్‌పాల్ స్పందిస్తూ.. ఇంటి గురించి ఇంకా ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంపై బంధువులతో చర్చించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని, పోలీసులు ఆధీనంలో ఉన్న ఇంటిని ఎప్పుడు అప్పజెప్పుతారనే విషయం తెలియదన్నారు. మృతురాలు నారాయణ్ దేవి మరో కుమార్తె, కుమారుడు పానిపట్, ఛిత్తోర్‌గఢ్‌లో స్థిరపడ్డారు. దీంతో వారు ఈ ఇంటిని తీసుకోడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. నవీన్ బాత్రా అనే స్థానికుడు మాట్లాడుతూ.. తన 21 ఏళ్ల కూతురు ఈ ఘటన అనంతరం భయంతో వణికిపోతుందని, లైట్ లేనిది ఇంట్లో ఉండలేక పోతుందని, చివరకు వాష్ రూం డోర్ పెట్టుకోడానికి కూడా భయపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ ఇంటికి పోలీసులు వస్తుండటం, టీవీ చానెళ్లో పదే పదే రావడం కూడా స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. చిన్నారులను బలవంతంగా చంపారు! ఇక ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీలో చిన్నారులను ఆత్మహత్య చేసుకునేలే వారిపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. 15 ఏళ్ల ధృవ్, శివమ్లిద్దరికి బలవంతంగా ఊరితాడు బిగించారని దీంతోనే వారి శరీరాలపై గాయాలైనట్లు పోలీసులు వాపోతున్నారు. ఈ ఫుటేజీలో ఆ 11 మంది స్టూల్స్, వైర్ల పట్టుకెళ్లినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
బురారీ కేసులో 12వ వ్యక్తి??
సామూహిక మరణాల కేసు(బురారీ కేసు) దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొత్త అనుమానాలు వ్యక్తం కావటంతో బురారీ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. లలిత్ భాటియా మభ్యపెట్టడంతోనే కుటుంబ సభ్యులంతా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్న కోణం ఒకటి కాగా, ఈ వ్యవహారంలో మరో వ్యక్తి ప్రమేయం ఉండి ఉంటుందన్నది రెండో కోణం. అందుకు కారణం ఆత్మహత్యకు ముందు ఇంట్లో పూజలు నిర్వహించినట్లు ఉండటం. (...విచిత్రంగా ప్రవర్తించేవాళ్లు) సాక్షి, న్యూఢిల్లీ: భాటియా కుటుంబం ఆత్మహత్యకు ముందు ఇంట్లో ‘వటవృక్ష’ పూజ నిర్వహించారు. సాధారణంగా పూజారుల సమక్షంలోనే దీనిని నిర్వహిస్తుంటారు. దీంతో బయటి నుంచి వచ్చిన వ్యక్తే ఈ పూజను నిర్వహించి ఉంటాడని భావిస్తున్నారు. మోక్షం కోసం భగవంతుడ్ని చేరేందుకు దగ్గరి దారి ఇదేనని ప్రలోభానికి గురి చేసి ఉంటారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ద్వారం తెరిచి ఉండటంతో సదరు వ్యక్తి పూజ ముగిశాక ఆ మార్గం గుండానే వెళ్లిపోయి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భాటియా కుటుంబం తరచూ ఇటువంటి పూజలు నిర్వహించేదని, కొందరు స్వామీజలు వారి ఇంటికి వచ్చే వారని గతంలో ఇంట్లో పని చేసిన వాళ్లు చెబుతున్నారు. దీంతో 12వ వ్యక్తి మిస్టరీ చేధించే పనిలో పడ్డారు. మానసిక రుగ్మతే!... 2007లో నారాయణ్ దేవి(77) భర్త మృతి చెందారు. ఆయన మరణాన్ని కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. ముఖ్యంగా లలిత్ భాటియా మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. తండ్రి ఫొటోతో మాట్లాడడం, ఆయన ఆదేశాలు ఇచ్చాడంటూ వాటిని ఓ పుస్తకంలో రాయడం చేస్తుండేవాడు. ‘తండ్రి తన కలలో కనిపించాడని, మాట్లాడాడని, ఆయన ఆత్మ ఆవహించిందని చెబుతూ కుటుంబ సభ్యులను కూడా అదే దారిలో నడిపించాడు. క్రమంగా తన రుగ్మతను కుటుంబ సభ్యులకూ అంటించాడు. ‘అంతిమ సమయంలో మన కోర్కెలు నెరవేరేటప్పుడు ఆకాశం బద్దలవుతుంది.భూమి కంపిస్తుంది. అయినా ఎవరూ భయపడొద్దు. నేనొచ్చి రక్షిస్తా’ పుస్తకాల్లో రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఈ రెండు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు.. వీలైనంత త్వరలో కేసులో చిక్కుముడి విప్పుతామని డీసీపీ వెల్లడించారు. మరోవైపు భాటియా ఇంట్లో దొరికిన నోట్ బుక్‌లను విశ్లేషించిన మానసిక నిపుణులు.. వాటిని అధ్యయనం చేసే పనిలో ఉన్నారు. సీసీటీవీలో షాకింగ్ విజువల్స్... ఆ పైపుల సంగతేంటి? -
తండ్రి కాపాడుతాడని...
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయిన కేసు మరో మలుపు తిరిగింది. ఆత్మహత్య సందర్భంగా చనిపోయిన తండ్రి తమను కాపాడతాడని భాటియా కుటుంబం నమ్మేదని ఇంట్లో పోలీసులకు లభ్యమైన డైరీల్లో ఉంది. ఈ క్రతువులో భాగంగా ‘ఓ కప్పులో నీళ్లు ఉంచండి. అది రంగు మారగానే నేను వచ్చి మిమ్మల్ని కాపాడతాను’ అని లలిత్ భాటియా(45)తో ఆయన తండ్రి అన్నట్లు వీటిలో ఉంది. జూన్ 30న(శనివారం) చివరిసారిగా రాసిన డైరీలో ఈ క్రతువుల్ని ‘దేవుడి దగ్గరకు దారి’గా లలిత్ అభివర్ణించాడు. కొన్నేళ్ల క్రితం చనిపోయిన తండ్రి తనకు కన్పిస్తున్నారనీ, ఆయన సూచనలతో మోక్షం కోసం ఈ క్రతువును పాటించినట్లు లలిత్ రాసుకున్నాడు. మరోవైపు భాటియా కుటుంబం ఆత్మహత్యకు చేసుకుంటున్న ఏర్పాట్లు ఎదురింటివారు అమర్చిన సీసీటీవీలో నమోదయ్యాయి. దీన్ని ఓ జాతీయ మీడియా సంస్థ బుధవారం ప్రసారం చేసింది. తాంత్రిక క్రతువులో భాగంగా భాటియా కుటుంబం పెద్ద కొడలు సవిత, ఆమె కుమార్తె నీతూలు శనివారం రాత్రి 10 గంటలకు ఐదు కుర్చీలను ఇంట్లోకి తీసుకెళ్లినట్లు వీడియోలో ఉంది. మరో 15 నిమిషాలకు ఉరి వేసుకునేందుకు కావాల్సిన వైర్లను శివమ్(15), ధ్రువ్(12)లు తీసుకొచ్చారు. కాగా, ఈ దారుణం జరిగిన రోజున బయటివారెవరూ భాటియా ఇంట్లోకి వెళ్లలేదని పోలీసులు స్పష్టం చేశారు. బురారీ ఘటనలో చనిపోయిన శివమ్(15), ధ్రువ్(15) చదువులో ఎప్పుడూ చురుగ్గానే ఉండేవారని ఢిల్లీకి చెందిన వీరేంద్ర పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయుడు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సంఘటన జరిగిన తీరుతెన్ను ఇదే.. శనివారం రాత్రి 10 గంటలు: పెద్ద కోడలు సవిత, ఆమె కుమార్తె నీతూ ఆత్మహత్య కోసం కుర్చీలు తెచ్చారు. ► 10:15గంటలు–ధ్రువ్, శివమ్లు ఉరి కోసం వైర్లను తీసుకొచ్చారు. ► 10:39– ఆర్డర్ చేసిన 20 రొట్టెల్ని ఓ వ్యక్తి డెలివరీ చేశాడు ► 10:57– పెద్ద కుమారుడు భవనీశ్ ఇంట్లోని కుక్కను షికారుకు తీసుకెళ్లాడు. ► 11:04– కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం ► 5.56 గంటలు– పాలవాడు క్యాన్లను ఇంటిదగ్గర పెట్టివెళ్లాడు. ► 7.14– పొరుగునే ఉన్న ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. -
బురారీ ఆత్మహత్యల కేసు; కీలకంగా మారిన పెట్ డాగ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బురారీ ఆత్మహత్యల కేసులో ఆ కుటుంబపు పెట్ డాగ్ కీలకంగా మారింది. ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రస్తుతం ఆ పెట్ డాగ్ సైగలతో మరింత సమాచారన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దానిని జంతు సంరక్షణ కేంద్రంలో ఉంచారు. మీడియా ద్వారా ఈ పెట్ డాగ్ గురించి తెలుసుకు సంజయ్ మొహపాత్ర అనే జంతు హక్కుల పోరాట కార్యకర్త దానిని పోలీసుల అనుమతితో తన జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే తొలుత ఆ డాగ్ చాలా కోపంగా ఉండేదని, ఎవరిని దగ్గరికి రాణించేదని కాదని అతను మీడియాకు తెలిపారు. అది ఆనారోగ్యానికి గురైందని గ్రహించి వైద్యం అందించనట్లు సంజయ్ పేర్కొన్నారు. ప్రస్తుంత కాలేయం సంబంధిత వ్యాధితో బాధపడుతుందని, ప్రస్తుతం కోలుకుంటుందన్నారు. కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు యత్నించే సమయంలో ఆ పెట్ డాగ్‌ను గ్రిల్‌కు కట్టేసి ఉంటారని సంజయ్ అభిప్రాయపడ్డారు. డాగ్ ఆరోగ్యంపై పోలీసులు ఎప్పటికప్పుడూ ఆరాతీస్తున్నారని, అది కోలుకోగానే డాగ్‌స్క్వాడ్ ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని దాని నుంచి రాబట్టే అవకాశం ఉందన్నారు. ఇక ఈ కేసులో రాతలతో దొరికిన ఓ నోట్ బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని, అందులో రాసిపెట్టినట్లుగానే వాళ్లు ఉరి వేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బురారీలోని సంత్ నగర్లో గత ఆదివారం ఉదయం ఒకే ఇంట్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. భాటియా కుటుంబం ఇంటి పెద్ద నారాయణ్ దేవి(77) గొంతు తెగి రక్తపుమడుగులో పడి ఉండగా, ఆమె కూతురు ప్రతిభా(57), కొడుకులు భావనేశ్(50), లలిత్ భాటియా(45)తోపాటు వాళ్లిద్దరి భార్య, పిల్లలు ఉరికి వేలాడుతూ కనిపించారు. -
చచ్చిపోయే ముందు చపాతీల కోసం...
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబంలోని సామూహిక మరణాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. క్షుద్ర పూజల ప్రభావానికి లోనై మోక్షం కోసమే వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రచారం జరగగా.. అది అంతా తప్పని వారిని ఎవరో చంపారని మృతురాలు నారయణ దేవి కూతురు సుజాత ఆరోపించారు. అయితే వారివి ఆత్మహత్యలేనని ఢిల్లీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల్లో ఒకరైన లలిత్ భాటియానే మిగతా కుటుంబ సభ్యులను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు తెలిపారు. అయితే నారాయణ దేవి కుటుంబ సభ్యులను వారి ఇంట్లో చివరిసారిగా చూసిన డెలివరీ బాయ్ రిషి చెప్పిన విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ‘మంగళవారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు 20 చపాతీల కోసం వారు ఆర్డర్ చేశారు. 10 గంటల 45 నిమిషాల ప్రాంతంలో చపాతీలు ఇచ్చేందుకు వారి ఇంటికి వెళ్లాను. వాళ్లలో ఒక మహిళ తన తండ్రిని నాకు డబ్బులు ఇవ్వాల్సిందిగా చెప్పింది. నేను వెళ్లిన సమయంలో ఇళ్లంతా సందడిగా ఉంది. వారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అసలు ఎవరూ ఊహించనే లేరంటూ’ రిషి వాపోయాడు. మరికొన్ని గంటల్లో చనిపోతామని తెలిసి కూడా వారంతా అలా ఉండటం తనను విస్తుగొలిపిందని అతడు తెలిపాడు. కాగా నారాయణ దేవి ఇంట్లోని రెండు రిజిస్టర్లలో లభ్యమైన కాగితాల్లో మోక్షం పొందాలంటే చనిపోయే రోజు ఇంట్లో భోజనం వండకూడదని వారు పెట్టుకున్న నియమం ప్రకారమే చపాతీలను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. -
11 మంది మరణం: అతడే సూత్రధారి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని బురారీ ప్రాంతంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మరణాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని చేధించారు ఢిల్లీ పోలీసులు. మొదటి నుంచి కేసులో కీలకంగా మారిన రిజిష్టర్‌లోని ప్రతుల్లోని చేతి రాతలు, మృతుల్లో ఒకడైన లలిత్ భాటియా చేతి రాతతో సరిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. లలిత్ భాటియాకు ఉన్న భ్రమలు, ఆత్మల పట్ల నమ్మకాలే అతనితో పాటు మిగతా కుటుంబ సభ్యులను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని పోలీసులు తెలిపారు. ఎవరీ లలితభాటియా... నారాయణ దేవి(77) చిన్న కుమారుడు లలిత్ భాటియా(45). తనతో పాటు తన కుటుంబానికే చెందిన మరో 10 మంది సామూహిక ఆత్మహత్యలకు ప్రణాళిక రూపొందించిన వ్యక్తి కూడా ఇతనే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిరాణా దుకాణం నడుపుతున్న లలిత్ భాటియా ఐదేళ్ల నుంచి మౌనవ్రతాన్ని పాటిస్తున్నాడు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చివరకు దుకాణానికి వచ్చిన వారితో కూడా మూగ సైగలు, చేతి రాతల ద్వారానే సంభాషించేవాడు. ఇలాంటిది ఉన్నట్టుండి గత కొంతకాలం నుంచి భాటియా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. అది కూడా తన తండ్రి తనకు ‘కనిపించినప్పటి నుంచి’. కనిపించడం ఏంటంటే లలిత్ భాటియా తండ్రి పదేళ్ల క్రితమే మరణించాడు. మరణించిన తండ్రి తనకు కనిపిస్తున్నాడని, తనతో మాట్లాడుతున్నాడని.. తనకు సందేశాలు ఇస్తున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పేవాడు భాటియా. ఈ క్రమంలోనే తండ్రి సందేశాలను రిజిస్టర్లో రాసి మిగతా కుటుంబ సభ్యులకు తెలిపేవాడు. అందులో భాగంగానే రిజిస్టర్లో ఒక చోట ‘త్వరలోనే మీ ఆఖరి కోరికలు నెరవేరతాయి. అప్పుడు ఆకాశం తెరుచుకుంటుంది. భూమి కంపిస్తుంది. కానీ ఎవరూ భయపడకండి. గట్టిగా మంత్రాన్ని జపించండి నేను మిమ్మల్ని కాపాడతాను’ అని తండ్రి తనతో చెప్పినట్లు కాగితంలో రాసి కుటుంబ సభ్యులకు తెలిపాడు. లలిత్ భాటియా చెప్పిన విషయాలను మిగతా కుటుంబ సభ్యులు కూడా నమ్మి అతడు చెప్పినట్లే ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు పోలీసులు. మోక్షం పొందాలనే కోరికతో... మంత్ర, తంత్రాలపై ఉన్న మూఢనమ్మకంతోనే ఇలా సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. మొదటి నుంచి అందరిలోనూ రేకెత్తిన అనుమానాలకు పేపర్లలో ఉన్నచేతి రాతలను గుర్తించడం ద్వారా సమాధానం దొరికిందని పోలీసులు చెప్పారు. లలిత్ భాటియాకు ఉన్న భ్రమలే కుటుంబ సభ్యులందరిని మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదికలు... 11 మందిలో ఇప్పటి వరకు ఆరుగురి పోస్ట్‌మార్టం నివేదికలు వచ్చాయి. ఉరితీత వల్ల వారి మరణాలు సంభవించినట్లు డాక్టర్లు తేల్చారు. వారి శరీరాలపై ఎటువంటి గాయాల గుర్తులు లేవని నివేదికలు పేర్కొన్నాయి. మృతుల నేత్రాలను దానం చేయాలని వారి కుటుంబసభ్యులు కోరారు. ఇంతమంది మృతదేహాలను రాజస్థాన్‌లోని స్వగ్రామానికి తీసుకుని వెళ్లి అంత్యక్రియలు నిర్వహించడం కష్టం కనుక ఢిల్లీలోనే అంత్యక్రియలు జరపాలని వారు నిర్ణయించారు. -
వాళ్లది ఆత్మహత్య కాదు.. హత్యే!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో చనిపోవడంపై వారి బంధువులు స్పందించారు. తమ కుటుంబం ఆత్మహత్య చేసుకోలేదని, వారిని చంపేశారని మృతుల్లో ఒకరైన నారాయణ్ దేవీ భాటియా కుమార్తె సుజాత ఆరోపించారు. ‘ప్రతి రెండ్రోజులకు ఓసారి నేను మా అమ్మతో మాట్లాడేదాన్ని. అందరూ ఆనందంగా ఉన్నారు. కుటుంబంలో ఎవ్వరూ బాబాలను నమ్మరు.మీడియా అసత్యాలను ప్రచారం చేస్తూ, మా కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది’ అని మండిపడ్డారు. ఊపిరాడకే చనిపోయారు.. చనిపోయిన 11 మందిలో 8 మంది ఊపిరాడకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని పోస్ట్‌మార్టంలో తేలినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మృతులకు పోస్ట్‌మార్టం కొనసాగుతోందని పేర్కొన్నారు. మృతుల శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వెల్లడించారు. మోక్షం పొందేందుకే.. మోక్షం పొందేందుకు ఎలా ప్రాణత్యాగం చేయాలన్నదానిపై చేతిరాతతో ఉన్న కాగితాలు బాధితుల ఇంట్లో లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. రెండు రిజిస్టర్లలో లభ్యమైన ఈ కాగితాల్లో ‘మోక్షం పొందాలంటే దీన్ని మంగళ, గురు, శనివారాల్లోనే పాటించాలి. ఆ రోజు ఇంట్లో భోజనం వండకూడదు. మిగతా కుటుంబ సభ్యులు ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకునేంతవరకూ ఒకరు పర్యవేక్షించాలి. వాస్తవానికి ఈ బలిదానంతో చనిపోరు. వాళ్లను దేవుడు కాపాడతాడు.’ అని ఉంది. ఈ కుటుంబం బాధ్ తపస్యా అనే విధానాన్ని ఆచరించి ఆత్మహత్య చేసుకుందని ఇంట్లో దొరికిన రిజిస్టర్లను బట్టి తేలిందన్నారు. వీరందరూ మర్రిచెట్టు ఊడల నిర్మాణం తరహాలో ఒకేచోట తాళ్లతో ఉరివేసుకున్నారని వెల్లడించారు. 2015 నుంచి ఈ కుటుంబం తాంత్రిక క్రతువుల్ని నిర్వహించినట్లు రిజిస్టర్లను బట్టి తెలుస్తోందన్నారు. -
బురారీ మిస్టరీ: వారిని ఎవరో చంపారు
న్యూఢిల్లీ : ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింన విషయం తెలిసిందే. క్షుద్ర పూజల ప్రభావానికి లోనయి మోక్షం కోసం వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రచారం జరగగా.. అది అంతా తప్పని వారిని ఎవరో చంపారని మృతురాలు నారయణ దేవి కూతురు సుజాతా మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు ప్రేమతో సంతోషంగా ఉండేవారని, కనీసం వారు బాబాలను కూడా నమ్మే వారు కాదని స్పష్టం చేశారు. పోస్టుమార్టం నివేదికలో కూడా ఆత్మహత్య చేసుకోవడం వల్లనే చనిపోయారని తేలింది. ఇక ఈ కేసులో రాతలతో దొరికిన ఓ నోట్ బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని, అందులో రాసిపెట్టినట్లుగానే వాళ్లు ఉరి వేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బురారీలోని సంత్ నగర్లో ఆదివారం ఉదయం ఒకే ఇంట్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతూ కనిపించిన ఘటన కలకలం రేపింది. భాటియా కుటుంబం ఇంటి పెద్ద నారాయణ్ దేవి(77) గొంతు తెగి రక్తపుమడుగులో పడి ఉండగా, ఆమె కూతురు ప్రతిభా(57), కొడుకులు భావనేశ్(50), లలిత్ భాటియా(45)తోపాటు వాళ్లిద్దరి భార్య, పిల్లలు ఉరికి వేలాడుతూ కనిపించారు. చదవండి: బురారీ ఆత్మహత్యల కేసు; ఊహించని ట్విస్ట్ -
బురారీ ఆత్మహత్యల కేసు; ఊహించని ట్విస్ట్
ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించటం దేశరాజధానిలో సంచలనం సృష్టించింది. క్షుద్ర పూజల ప్రభావానికి లోనయి మోక్షం కోసం వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంతా భావిస్తున్నారు. అయితే ఈ కేసులో బంధువుల మాత్రం కొత్త వాదనను వినిపిస్తున్నారు. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వారికి లేదని, ఖచ్ఛితంగా ఎవరో వారిని చంపి వేలాడదీసి ఉంటారని అనుమానిస్తున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: బురారీ సామూహిక ఆత్మహత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోస్ట్ మార్టం నివేదికను కూడా మృతుల బంధువులు తప్పుబడుతుండటం గమనార్హం. ‘వాళ్లంతా (భాటియా కుటుంబ సభ్యులు) బాగా చదువుకున్న వాళ్లు. దెయ్యాలు-చేతబడులను నమ్మటం ఏంటి?.. పైగా గతంలో కూడా వాళ్లు ఇలాంటి చేష్టలకు పాల్పడినట్లు మేం ఎప్పుడూ చూడలేదు. వాళ్లకు ఎలాంటి ఆర్థిక కష్టాలు లేవు. అప్పులుగానీ, లోనులు గానీ లేవు. అన్నీ బాగున్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏంటి?. నోటికి ప్లాస్టర్లు, చేతులు కట్టేసి ఎలా సూసైడ్‌కు పాల్పడతారు? వాళ్లకు శత్రువులంటూ ఎవరూ లేరు. కానీ, ఖచ్ఛితంగా ఎవరో చంపే ఉంటారని మాకు అనిపిస్తోంది’ అని కేథన్ నాగ్‌పాల్ అనే బంధువు చెబుతున్నారు. ఆరోజు రాత్రి... భాటియా కుటుంబం మూకుమ్మడిగా విగతజీవులుగా మారటాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతకు ముందు రోజు దాకా నవ్వుతూ కనిపించిన వాళ్లు.. ప్రాణాలతో లేరన్న విషయం తెలియగానే బోరున విలపించారు. ‘శనివారం రాత్రి దాకా శివం, ధృవ్‌లు(ఆ ఇంటి పిల్లలు) నాతోనే నవ్వుతూ ఆడుకున్నారు. తర్వాత వాళ్ల ఇంట్లోంచి పిలుపు రావటంతో భోజనానికి పరుగులు తీశాడు. ఆ సమయంలో వాళ్ల కుటుంబ సభ్యులు నలుగురు ఇంటి బయటే నవ్వుతూ సంతోషకంగా కనిపించారు. అంతా మాములుగానే ఉంది’ అని స్థానికంగా ఉన్న ఓ బాలుడు చెబుతున్నాడు. విచిత్రంగా ప్రవర్తించేవాళ్లు... అయితే ఆ ఇంట్లో గతంలో పని చేసిన మానేసిన ఓ మహిళ మాత్రం ఆసక్తికర విషయాలను మీడియాకు వివరించారు. ఆరేళ్ల క్రితం తాను ఆ ఇంట్లో పని చేశానని, ఆ కుటుంబం అంతా చాలా సందర్భాల్లో చాలా విచిత్రంగా ప్రవర్తించేందని.. ముఖ్యంగా ఆ ఇంట్లోని మహిళలు ఆలయాలకు వెళ్లినప్పుడు పూనకంతో ఊగిపోయేవారని... సదరు మహిళ తెలిపారు. ఇంట్లో కూడా అప్పుడప్పుడు పూజలు నిర్వహించి, స్వామీజీలను ఆహ్వానించేవారని, స్వామీజీలు చెప్పే విషయాలను బాగా నమ్మి తూచా తప్పకుండా పాటించేవారని ఆమె వివరించారు. కీలకం కానున్న నోట్ బుక్?.. ఇక ఈ కేసులో రాతలతో దొరికిన ఓ నోట్ బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని, అందులో రాసిపెట్టినట్లుగానే వాళ్లు ఉరి వేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘2017 నుంచి రాతలు రాసినట్లు ఉన్నాయి. గత నెల 27(జూన్)న ఎలా చనిపోవాలో.. అన్న విషయం కూడా అందులో రాసి ఉంది. అయితే దీనిని సూసైడ్ నోట్‌గా పరిగణించి దర్యాప్తు చేస్తున్నాం. పోస్టుమార్టం నివేదిక కూడా ఆత్మహత్య అనే చెబుతోంది. అలాగని క్షుద్ర పూజల ప్రభావంతోనే వాళ్లంతా చనిపోయి ఉంటారని మేం నిర్ధారించలేం. రాతను కుటుంబ సభ్యుల చేతిరాతలతో పోల్చి చూడాల్సి ఉంది. కారణాలు అన్వేషించి కుటుంబ సభ్యుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని ఉత్తర ఢిల్లీ డీసీపీ చెబుతున్నారు. బురారీలోని సంత్ నగర్లో ఆదివారం ఉదయం ఒకే ఇంట్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతూ కనిపించిన ఘటన కలకలం రేపింది. భాటియా కుటుంబం ఇంటి పెద్ద నారాయణ్ దేవి(77) గొంతు తెగి రక్తపుమడుగులో పడి ఉండగా, ఆమె కూతురు ప్రతిభా(57), కొడుకులు భావనేశ్(50), లలిత్ భాటియా(45)తోపాటు వాళ్లిద్దరి భార్య, పిల్లలు ఉరికి వేలాడుతూ కనిపించారు. ప్రతిభా కూతురు ప్రియాంక కూడా మృతుల్లో ఒకరు. కాగా, ప్రియాంకకు రెండు వారాల క్రితమే నిశ్చితార్థం కాగా, ఈ ఏడాది చివర్లో వివాహం జరగాల్సి ఉంది. -
మిస్టరీ డెత్: ఒకే ఇంట్లో 11 మృతదేహాలు లభ్యం
-
ఢిల్లీలో గ్యాంగ్‌వార్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండు నేరగాళ్ల ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్ సభ్యులతోపాటు దారిన వెళ్తున్న మరో ఇద్దరు చనిపోయారు. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతం లో బలవంతపు వసూళ్లు, హత్య కేసుల సంబంధమున్న టిల్లు, గోగి గ్యాంగ్‌లు పనిచేస్తున్నాయి. టిల్లు గ్యాంగ్ వాహనాన్ని, గోగి గ్యాంగ్ సభ్యుల వాహనం ఢీకొంది. దీంతో ఈ రెండు ముఠాల సభ్యులు పరస్పరం కాల్పులకు దిగారు. -
దోపిడి దొంగలు... వయాగ్రా టాబ్లెట్లు
న్యూఢిల్లీ: దొడ్డి దారుల్లో సంపాదన కోసం ఆ ముగ్గురు దోపిడి దొంగలు ఓ ముఠాగా ఏర్పాడ్డారు. జాతీయ రహదారిపై ఉండే దాబాల వద్ద ఆగి ఉన్న వాహనాలనే లక్ష్యంగా చేసుకుని దోపిడిలు ప్రారంభించారు. ఆ క్రమంలో దాబా వద్ద సరుకుతో ఆగి ఉన్న లారీతో ఉడాయించారు. న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని జరోదా పుస్తా రహదారిపై బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ సదరు వాహనాన్ని ఆపారు. లారీలో లోడ్ ఏమిటని ప్రశ్నించగా... గుటకలు మింగారు. పోలీసులకు సీన్ అర్థమైంది. అంతే లారీలోని లోడ్‌ను తనిఖీ చేయగా... అగరబత్తులు, షాంపు ప్యాకెట్ల బాక్స్‌ల కింద వయాగ్రా టాబ్లెట్లు ఉన్న 20 అట్టపెట్టలను పోలీసులు కనుగొన్నారు. దీంతో పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకుని... లారీని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన వయాగ్రా టాబ్లెట్ల విలువ దాదాపు 35 లక్షల ఉంటుందని పోలీసులు తెలిపారు. ముగ్గురు దొంగలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాకు చెందిన సలీం, ఖలీద్, షాజద్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. షాంపు, సబ్బుల విలువ రూ. 5 లక్షలు ఉంటుందని తెలిపారు.