బురారీ మిస్టరీ: వారిని ఎవరో చంపారు | Hanging Family Daughter Says Someone killed Them They Did Not Believe in Babas | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 2 2018 7:25 PM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

Hanging Family Daughter Says Someone killed Them They Did Not Believe in Babas - Sakshi

ఆత్మహత్య చేసుకున్న కుటుంబం బంధువు సుజాత

న్యూఢిల్లీ : ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింన విషయం తెలిసిందే. క్షుద్ర పూజల ప్రభావానికి లోనయి మోక్షం కోసం వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రచారం జరగగా.. అది అంతా తప్పని వారిని ఎవరో చంపారని మృతురాలు నారయణ దేవి కూతురు సుజాతా మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు ప్రేమతో సంతోషంగా ఉండేవారని, కనీసం వారు బాబాలను కూడా నమ్మే వారు కాదని స్పష్టం చేశారు. పోస్టుమార్టం నివేదికలో కూడా ఆత్మహత్య చేసుకోవడం వల్లనే చనిపోయారని తేలింది. ఇక ఈ కేసులో రాతలతో దొరికిన ఓ నోట్‌ బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని, అందులో రాసిపెట్టినట్లుగానే వాళ్లు ఉరి వేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

బురారీలోని సంత్‌ నగర్‌లో ఆదివారం ఉదయం ఒకే ఇంట్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతూ కనిపించిన ఘటన కలకలం రేపింది.  భాటియా కుటుంబం ఇంటి పెద్ద నారాయణ్‌ దేవి(77) గొంతు తెగి రక్తపుమడుగులో పడి ఉండగా, ఆమె కూతురు ప్రతిభా(57), కొడుకులు భావనేశ్‌(50), లలిత్‌ భాటియా(45)తోపాటు వాళ్లిద్దరి భార్య, పిల్లలు ఉరికి వేలాడుతూ కనిపించారు. 

చదవండి: బురారీ ఆత్మహత్యల కేసు; ఊహించని ట్విస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement