
నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నఆర్‌జీఐఏ క్రైం పోలీసులు
శంషాబాద్: ప్రయాణికుడి బ్యాగ్‌ను చోరీ చేసిన ఇద్దరు క్యాబ్ డ్రైవర్లను ఆర్‌జీఐఏ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఐ దస్రునాయక్ తెలిపిన వివరాల ప్రకారం... నాలుగు రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను క్యాబ్ డ్రైవర్లు దొంగిలించారు. బ్యాగ్‌లో నగదు, బంగారం పోవడంతో బాధితుడు ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా చోరీ చేసిన నిందితులను గుర్తించి బేగంపేట పోలీస్ ల్యాండ్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ గౌస్(34), రసూల్‌పురాలో నివాసం ఉంటున్న మహ్మద్ జాకీర్(21)లను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు తులాల బంగారం, రూ. 76 వేల నగదు స్వాధీనం చేసుకోని గురువారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment