ప్రమాద దృశ్యం, ప్రమాదానికి కారణమైన యువకుడు, కారులో ఉన్న యువతి
కృష్ణరాజపురం: తాగిన మైకంలో కారు ను నడిపి బైకులను ఢీకొట్టి ఇద్దరు యువకులు గాయాలపాలవడానికి కారణమైన యువకుడిని స్థానికులు చావబాది పో లీసులకు అప్పగించిన ఘటన ఆదివారం వైట్‌ఫీల్డ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన యువకుడు తన స్నేహితురాలితో కలసి ఆదివారం పూటుగా మద్యం సేవించాడు. అనంతరం మద్యం మత్తులోనే మేడహళ్లి–వైట్‌ఫీల్డ్ మార్గంలో కారును వాయువేగంతో నడపాడు.
దీంతో కారు అదుపుతప్పి మేడహళ్లి, బెళతూరు ప్రాంతాల్లో బైకులను ఢీకొట్టడంతో బైకులపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అదేవేగంతో దూసుకెళ్లడంతో కాడుగోడి సమీపంలో మరో బైకును ఢీకొట్టడంతో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఇక యువకుడు, యువతి మద్యం మత్తులో ఉండడాన్ని గమనించిన స్థానికులు ఆగ్రహంతో యువకుడికి దేహశుద్ధి చేయడంతో పాటు కారు అద్దాలను ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment